-->

శ్రీశ్రీ మార్క్సిజం అవగాహన గురించి || About the understanding of Sri Sri Marxism

Also Read



    ఆర్ధిక మాంద్యం (1929 - 34), స్పెయిన్ అంతర్యుద్ధం (1936-39) కాలంలో గొప్ప రచనలు చేసిన అడెన్, స్పెండర్, డేలూయిస్, దిలాన్గామస్, జార్జిబార్కర్, ఆకాలంలోనే ఇంగ్లాండు నుంచి వెలువడిన ఇండియన్ ప్రొగ్రెసివ్ టర్స్ మానిఫెస్టో - “ఇన్ని యిన్ని ప్రవాహాలమధ్య" "తన ' మహాప్రస్థాన గీతాలు కూడా ప్రవహించాయి" అని శ్రీశ్రీ చెప్పుకున్నారు “ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించినా, ఇలాంటి రచనలను 'సామాజిక వాస్తవికత' అంటారనీ దీనివెనుక దన్నుగా 'మార్క్సిజం' అనే దార్శనికత ఒకటి ఉందని అప్పటికీ నాకు తెలియదు” అని శ్రీశ్రీ తెల్పారు (మహాప్రస్థానం నామాట. శ్రీశ్రీ ప్రచురణలు మే 1990 - సొంతదస్తూరీలో) అప్పటికీ శ్రీశ్రీ మార్క్సిజానికి సంబంధించిన ప్రమాణ గ్రంధాల నుంచి ఉత్తేజం పొందలేదు. ఆ తర్వాత కూడా దాదాపు అదే స్థితి ఆయన ప్రధానంగా స్ఫూర్తి పొందింది, జాతీయ, అంతర్జాతీయ సాహిత్యం నుంచీ, ఆ ఉద్యమాలనుంచీ ఈ స్ఫూర్తితోనే సాహిత్యంలోంచీ, సాహిత్యోద్యమాలకు నేతృత్వం వహించారు. ఫ్రెంచి, జర్మన్, చెక్, పోలిష్ ఇంగ్లీష్ అమెరికన్, స్పానిష్, రష్యన్, చైనీస్ సాహిత్యాలను ఆయన చదివారు శ్రీశ్రీ సాహిత్య సృజన విస్తారమైన సాహిత్యాధ్యయనానికీ, సాహిత్య మధనానికీ, జీవితానుభవాల విశ్లేషణకూ, ప్రపంచంలోని పీడిత మానవ ఘోషలకూ సంబంధించింది. శ్రీశ్రీ మార్క్సిజం నుంచీ మావోయిజందాకా, నక్సలిజం దాకా చేసిన ప్రయాణం సమగ్ర సిద్ధాంత అవగాహనతో ముడిపడింది కాదు సాహిత్య విమర్శలో ఆయన ప్రస్తావించిన (thesis, antithesis, Synthasis' dialectic materialist technique') (వేమన పద్యాల్లోని నిర్మాణ శిల్పాన్ని గురించి) అనే శాస్త్ర పరిభాషాపదాలు శాస్త్రప్రమాణానికి నిలిచేవి కావని చేరా నిరూపించారు. ('విమర్శకుడిగా శ్రీశ్రీ' సాహిత్య వ్యాస రింఛోళి పేజీలో 150, 151) Thesis, antithesis, synthesis అనే మాటలు జర్మన్ భావవాది ఫిచే (1762-1814) ప్రతిపాదించినవి ఈ పద్ధతిలో భావవాద గతితార్కిక లక్షణాలు కొన్ని ఉన్నాయి నిజానికి
    సామ్యవాద వాస్తవికత అనే మాటను కూడా ఆయన సోవియెట్ సాహిత్యం నుంచి గ్రహించిన మాటే తప్ప, సిద్ధాంత భూమిక నుంచి వివేచించిన మాటకాదు - జార్జిలూకాస్ గా శ్రీశ్రీ ఎన్నెన్నో ప్రవాహాల మధ్య మార్క్సిజం బీజలక్షణాలను తన రచనల్లో ప్రవహింప చేశారు. సృజనాత్మక వచన సాహిత్యంలో కొండవటిగంటి కుటుంబరావు కున్నంత మార్క్సిజం అవగాహన శ్రీశ్రీకి ఉందని చెప్పలేము

Close