-->

ప్రాచీన భారతదేశంలో సామాజిక, ఆర్ధిక మార్పులు - Social and Economic Changes in Ancient India

Also Read    కార్యకలాపాలు రెండు రకాలు. ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థికేతర కార్యకలాపాలు. ఒక వ్యక్తి స్వయంగా కాని, వేరొకరి సహాయంతోగాని ఉపాధిని పొందవచ్చు. అంటే ఒక వ్యక్తి లాభదాయక వృత్తిలో నిర్వహించే ఆర్ధిక కార్యకలాపం. ఇందులో భాగంగా నాణ్యమైన వస్తువు తక్కువ ధరను ఉత్పత్తి చేయడం, అమ్మకం, వస్తుకొనుగోలు అమ్మకం లేదా సేవలు నిర్వర్తించడము.

1. భారతసంస్కృతి ఎందుకు మిశ్రమ సంస్కృతి అని పిలువబడుతుంది?

మిశ్రమ సంస్కృతి - అనాదిగా అనేకమంది విదేశీయులు ఆర్యులు, గ్రీకులు, హూణులు, శకులు, కుషాణులు మున్నగువారు భారతదేశానికి రావడం, మనతో సంఘర్షణ పడటం, తదుపరి వారు మనదేశంలో స్థిరపడి, మానవత్వాన్ని, సంస్కృతి అని స్వీకరించి మనలో కలవటం జరిగింది. సహనశీలురైన భారతీయులు వారి పట్ల ఉదారంగా వ్యవహరించటం జరిగింది. ఇట్టి స్వదేశీయ మరియు విదేశీయ సంస్కృతులు సమ్మేళనంగా ఏర్పడినదే మిశ్రమ సంస్కృతి 

ప్రాచీన భారదేశంలో మిశ్రమ సంస్కృతి ఆవిర్భవించిన రీతి - -

1. ఆర్య, ఆర్యేతర సంగమం - విదేశీయులైన ఆర్యులు భారతదేశవిస్తరణలో నాటికిఉన్న స్వదేశీయులతో సంఘర్షణ పడ్డారు. ఈ స్వదేశీయులనే వైదిక గ్రంధాలలో, ధన్యులుగా, పాణులుగా పేర్కొన్నారు. భౌతికంగా ఆజానుబాహువులు తెల్లరంగు గల ఆర్యులు, లావుగాను, పొట్టిగాను నల్లగాను ఉండే ఆర్యేతరులను హీనంగా చూసేవారు. ఆర్య, ఆర్యేతర జీవనవిధానం, మత విశ్వాసాలు భిన్నంగా ఉండేవి. కాలగమనంలో ఇరువురు కలిసిమెలిసి జీవించుట వలన ఈ రెండు సంస్కృతులు మేళవించి నూతన మిశ్రమ సంస్కృతి ఏర్పడింది. రవీంద్రనాధ్ ఠాగూర్ మాటలో చెప్పాలంటే ఆర్య మరియు ద్రావిడ సంగమమే హిందూమతం.

ఈ మిశ్రమ సంస్కృతి ముఖ్యలక్షణములేమనగా -

ఎ) ప్రకృతి వికృతి ఆరాధకులైన ఆర్యులు, ఆర్యేతరుల స్వదేశీయుల మత విశ్వాసాలను స్వీకరించారు. ఉదా నాగారాధన, వృక్షారాధన, శక్తిలేక, అమ్మతల్లి, పశుపతి మున్నగునవి. అలాగే కొన్ని ఆర్యేతర తెగల వారు వేదశ్లోకాలను సంకలనం చేశారు. కాలం గడిచిన కొద్ది ఆర్య, ఆర్యేతరుల మధ్యవివాహ సంబంధాలు ఏర్పడుట వల్ల మిశ్రమ సంస్కృతి బలవత్తరమైంది.
బి) ఆర్య, ఆర్యేతర వివాహాల వలన చాతుర్వర్ణములకే పరిమితమైన వైదిక సమాజంలో అనేక కులాలు, ఉపకులాలు ఉద్భవించాయి.
సి) ఆర్ధిక వ్యవస్థలోను మిశ్రమ సంస్కృతి చోటుచేసుకుంది. ఆర్యుల ముఖ్య వృత్తి వ్యవసాయం. కాని వేట, తోళ్ళ పరిశ్రమ వంటి అనేక వృత్తులు ఆర్యేతర ప్రభావం వలన చోటుచేసుకున్నాయి. ఈ వృత్తులననుసరించి ఆర్యేతరులు క్రమంగా ఆర్యుల ఆర్ధిక వ్యవస్థలో భాగస్వాములైనారు.
2. విదేశీయులు - భారత్ పై దండెత్తిన పారశీకులు, గ్రీకులు, పార్ధియన్లు, కుషాణులు, హూణులు ఏమయ్యారో తెలుసా? వీరెవ్వరు తమ స్వదేశాలకు వెళ్ళలేదు. వీరు మన స్త్రీలను వివాహమాడి, మత, సంస్కృతులను స్వీకరించి, ఇచట స్థిరపడి, భారతీయులైనారు. ఉదా - మినాందార్, కనిష్కుడు, బౌద్ధమతాన్ని స్వీకరించారు. గాంధార, మద్దరశిల కళాకారులు రెండింటి సంగమమే
ముగింపు - ఇట్లు స్వదేశీ విదేశీయ సంస్కృతులు సమ్మేళనంగా ఏర్పడినదే ఈ మిశ్రమ సంస్కృతి. ఈ సంస్కృతి ఎవరి ఒక్కరిదోకాదు. దేశం, జాతి కులంవేరైనా అందరిది అదే భారతీయ సంస్కృతి.

2. ప్రాచీన భారతదేశంలో వ్యవసాయాధారిత ఆర్ధిక వ్యవస్థలో గల దశలను పేర్కొనుము?

ప్రాచీన కాలం నుండి నేటివరకు వ్వవసాయమే మన ఆర్ధిక వ్యవస్థకు మూలాధారం. ప్రాచీన భారతదేశంలో
- సాగిన వ్యవసాయాధార ఆర్ధిక వ్యవస్థను మూడు దశలుగా విభజించవచ్చును. అవి ఏమనగా ఎ) నాగరికత దశ క్రీపూ. 3000-500, బి) మౌర్య యుగం క్రీపూ 322-181. సి) మౌర్యయుగానంతర దశ క్రీపూ 181 - క్రీశ 400. నాగరికతల దశ క్రీపూ 3000-500 - క్రీపూ 3000 సం॥ల నాడు వెల్లివిరిసిన సింధునాగరికతా కాలంలోనే వ్యవసాయము ముఖ్య వృత్తిగా నున్నట్లు మొహంజోదారోలో బయల్పడిన ధాన్యాగారం, కాళీబంగన్లో దున్నిన పొలాలను బట్టి తెలుస్తుంది. తదుపరి మనదేశానికి వచ్చిన ఆర్యులు ఋగ్వేద కాలంలో సంచార జీవులై, పశుపోషణను ముఖ్యవృత్తిగా చేసుకొన్నారు. కాని మలివేదకాలంలో ఇనుప పనిముట్లతో అడవులను నరికి అనేక నూతన భూములను సాగులోకి తెచ్చారు. ఆపై గంగానది పరీవాహక ప్రాంతంలో స్థిరపడి వ్యవసాయాన్ని ముఖ్యవృత్తిగా చేసుకున్నారు. వీరికి వ్యవసాయంలోని అన్ని ప్రక్రియలు అనగా దున్నటం, విత్తటం, నారు పోయటం, కోయడం, నిల్వచేయడం తెలుసు. బి. మౌర్య యుగం క్రీపూ. 322-181 - మౌర్యులు వ్యవసాయాభివృద్ధికి కృషిచేశారు. అధిక జనాభాను తరలించుట ద్వారానూ తన వ్యవసాయ ఆవాసాలు ఏర్పడ్డాయి. నాడు భూమిలో అత్యధిక శాతం రాజ్యం చేతులలో ఉంది. రాజు భూమిని సీతయని ఈ భూమి అధ్యక్షుని సీతధ్యక్ష అని పిలిచేవారు. ఈ భూమిని వేతన కూలీలతో సాగు చేయించేవారు. వ్యవసాయాభివృద్ధికి మౌర్యులు నీటి పారుదల సౌకర్యాలు కల్పించారు. రాజ్యానికి ముఖ్య ఆదాయం భూమిశిస్తు

- సి.) మౌర్య యుగానంతర దశ క్రీపూ 181 నుండి క్రీశ 400 వరకు ఈ యుగంలో భూములు రాజ్యం ఆధీనం నుండి ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళింది. మనుధర్మశాస్త్రం భూమిని చదునుచేసి సాగుచేసి, పంటలు పండించేవారినే స్వంతదారులుగా అనగా భూమిహక్కు దారులుగా గుర్తించింది. ఈ యుగంలో భూదానాలు చేయుటలోని ఆంతర్యం నూతన భూములను సాగులోనికి తేవడం. ఈ యుగంలో వ్యవసాయంతోబాటు ఇతర చేతివృత్తులు ప్రోత్సహించబడ్డాయి.

1. ఋగ్వేద మరియు మలివేద ఆర్థిక వ్యవస్థల మధ్యగల తేడాలు ఏవి?

    ఋగ్వేదకాలంనాటి ఆర్ధిక వ్యవస్థ - ఋగ్వేదకాలంలో ఆర్యులకు వ్యవసాయం తెలిసినా పశుపోషణ ముఖ్యవృత్తిగా చేసికొన్నారు. ఆర్ధిక వ్యవస్థలో వడ్రంగి కీలక పాత్ర పోషించారు. బండ్లను, యుద్ధ రధాలను తయారు చేసేవారు. ఇతడు నాటి ఆర్ధిక వ్యవస్థలో చర్మకార, లోహకార, కుమ్మరి మున్నగు వృత్తులు సైతం కీలకపాత్ర పోషించాయి. గోమాతను ధనముగా భావించెడివారు. వ్యాపార లావాదేవీలలో బార్టర్ విధానం అమలులో ఉంది. ప్రజలు అప్పులు తీసుకోవటం వానికి వడ్డీలు చెల్లించడం ఉంది.

    - మలి వేదకాలం నాటి ఆర్ధిక వ్యవస్థ మలివేదకాలంలో ఇనుప పనిముట్లు వాడుకలోనికి రావడంతో వ్యవసాయ విస్తరణ జరిగింది. వాటిపరిమాణం పెద్దదై ఒకసారి ఆరునుండి 24 ఎద్దులను సైతం ఉపయోగించెడివారు. వరి, బార్లీ, నువ్వులు, మున్నగు పంటలు పండించారు. వృత్తుల సంఖ్య పెరిగింది. మంగలులు, కసాయివారు, బట్టలుతుకువారు, అద్దకం వేసేవారు మున్నగు అనేక వృత్తులు ఆవిర్భవించాయి. అనేక లోహాలను వాడారు. విదేశీ వాణిజ్యం సాగింది. బార్టర్ విధానం (వస్తుమార్పిడి) తగ్గి శతమాన, నిష్క, కర్షపణ మున్నగు బంగారు నాణాలు చెలామణిలోకి వచ్చాయి, తక్షశిల, కౌశాంబి, హస్తినాపురం, మ్నుగు నగరాలు పరిశ్రమల వాణిజ్యానికి కేంద్రాలుగా భాసిల్లినాయి. ఋగ్వేదకాలం నాటి కంటే మలి వేద కాలంలో ఆర్థిక స్థితిగతులు మెరుగుగా యున్నాయి.

4. భూస్వామ్యవర్గం అంటే ఏమిటి? అది ఏ విధంగా ఆవిర్భవించింది? ఏ రాజ్యం మొదటిగా భూదానాలు ఇవ్వటం ప్రారంభించింది? ఎందుకు?

    భూస్వామ్యవర్గం - అర్ధం - రాజ్యానికి సేవచేసిన వారికి పారితోషికం నగదు రూపంలోగాకుండా, భూమి రూపంలో చెల్లించి, ఆ భూములనుండివచ్చు ఆదాయంతో రాజుకు అవసరమైనపుడు, ధన, సైనిక సాయముచేయు వర్గం. భూస్వామ్య ఆవిర్భావానికి కారణాలు క్రీశ నాల్గవ శతాబ్ధం నుండి ధనసాయం చేసే వైశ్యులు రాజ్యానికి పన్నులు చెల్లించటం మానివేశారు. తత్ఫలితంగా రాజ్యఖజానాలో లోటు ఏర్పడింది. దానికి తోడు రోమ్తో వ్యాపారం సన్నగిల్లింది. ఇటువంటి పరిస్ధితులలో ప్రభుత్వ ఉద్యోగాలకు వేతనాలు చెల్లించటం రాజ్యానికి కష్టతరమైంది. దీనిని అధిగమించటానికి భూదానమిచ్చే సంప్రదాయం ప్రారంభమైంది. ఈ భూదానాలు ఇవ్వటం తొలుత ప్రారంభించినవారు, ఆంధ్ర శాతవాహనులు. తొలుత ఈ భూదానాలు బ్రాహ్మణులకు, భౌద్ధ భిక్షువులకు ఇచ్చారు. ఆ తదుపరి అన్ని వర్గాల వారికి అనగా భూదాన గ్రహీతలు స్వతంత్రంగా వ్యవసాయము చేయలేక, కౌలుకిచ్చి, వారి వద్ద నుండి కౌలు వసూలు చేసేవారు. ఇట్లు వ్యవసాయదారునికి రాజుకు మధ్య భూస్వామ్య వర్గం అనే దళారి వ్యవస్థ ఏర్పడింది. ఈ భూస్వామ్యం క్రమంగా బలపడిపాలన, సైనికి (రక్షణ) బాధ్యతలను కూడా నిర్వహించింది. ఈ భూస్వాములు ఠాకూర్, నాయక్, అను బిరుదులు కూడ ధరించి శక్తివంతులైనారు. కాకపోతే భూదానాల వలన వ్యవసాయోత్పత్తులు పెరిగాయి. చక్రవర్తులు భూస్వాములపై ఆధారపడే పరిస్థితి నెలకొంది.
రెండు వాక్యాల సమాధానం 2 మార్కులు

వ్యాపారాభివృద్ధి వర్ణవ్యవస్థను ఎలా ప్రభావితం చేసింది?

    వ్యాపారాభివృద్ధి చేతివృత్తులలో నైపుణ్య పెంపొందించటానికి దోహదం చేసింది. తదుపరి ఒక్కొక్క వృత్తివారు ఒక్కొక్క కులముగా రూపాంతరం చెందటంతో కులాల సంఖ్య గణనీయంగా పెరిగింది.

1. భారతదేశంలో మొదట స్థిరనివాసమేర్పరచుకున్న వారికి వైదిక గ్రంధాలు ఇచ్చిన పేరేమి? (దాసులు మరియు పణులు)
2. భారతదేశాన్ని తన జన్మభూమిగా చేసుకున్న మద్య ఆసియా వాసులకు ఒక ఉదాహరణ? (బాక్ట్రియన్ గ్రీకులు, శకులు)
3. విదేశలక్షణాల ప్రభావమున్న గ్రంధాలకు ఒక ఉదాహరణ తెల్పండి? (సంస్కృత భాషావికాసం, శకపాలకుడైన రుద్రదామునిగిర్నార్ శాసనం.) 
4. సీత అనేది ఏ రకపు భూమి? (ప్రభుత్వ భూమి) 
5. క్రీపూ. 200 క్రీశ300 సం॥ మధ్య కాలంనాటి ఆర్ధిక వ్యవస్థ ముఖ్యలక్షణం ఏది? (ఇండో రోమన్ వ్యాపారం క్షీణత, చేతివృత్తుల పెరుగుదల 
6. కలియుగ సంక్షోభం గురించి తెలిపే గ్రంధాలేవి? (పురాణాలు)
7. వర్ణసంకరం అంటే ఏమిటి? (కులాలు వివాహాల ద్వారా ఒక దానితోనొకటి కలిసిపోవుట)

Close