-->

భారతదేశ భౌగోళిక లక్షణాలు - Geographical features of India

Also Read


    భారత దేశ చరిత్రకు, భౌగోళిక పరిస్థితులకు అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. ఒక దేశ చరిత్రను బాగా అర్థం చేసుకోవడానికి ఆ దేశ భౌగోళిక స్వరూపం గురించి తెలుసుకోవడం అవసరం. భారత దేశం అనే ఉపఖండం, ఐరోపా ఖండంలో రష్యాను తీసివేస్తే ఆ ఖండం ఎంత విస్తీర్ణం కలిగి ఉండునో అంత విస్తీర్ణం కలిగి ఉంది. ఇది ఎత్తైన పర్వత శ్రేణులు, పెద్ద పీఠభూములు, ప్రత్యేక మైదాన ప్రాంతాలు, ఇసుక ఎడారులు, పెద్ద నదులు, మెట్ట భూములు, సారవంతమైన నదీలోయలు మరియు అనేక రకాలైన అడవులను కలిగి ఉన్నది. అత్యధిక శీతల వాతావరణ పరిస్థితుల నుండి అత్యధిక ఉష్ణ వాతావరణ పరిస్థితుల వరకు అన్ని రకాల వాతావరణ పరిస్థితులు కలిగి ఉన్నది. దానివల్ల భారతదేశం అనేక ప్రాంతీయ విభాగలుగా విడిపోయి, ప్రతి ప్రాంతం ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నది. సహజ హద్దులు ఈ దేశానికి ఉన్నాయి. ఉత్తరాన హిమాలయాలు, మూడువైపులా మూడు సముద్రాలు ఉండుట వల్ల ప్రత్యేక దేశంగా వృద్ధి చెంది, ప్రత్యేక సాంస్కృతిక మరియు రాజకీయ విభాగంగా అభివృద్ధి చెందింది. సహజ సిద్ధమైన సరిహద్దుల వలన కాని, విశాలంగా ఉండటంవల్ల కాని, భౌగోళిక పరిస్థితులకారణంగా గాని మాతృభూమి అనే భావం అందరిలో కలిగింది. కాని విశాల ప్రాంతం మరియు భౌగోళిక పరిస్థితుల కారణంగా ఐక్యత సాధించలేకపోయాం. అయినా సాంస్కృతిక ఐక్యత చాలా ప్రస్ఫుటంగా కన్పిస్తుంది. సాంస్కృతిక ఐక్యత వలన ఉమ్మడిభాష, వాజ్ఞ్మయం, మతాల వలన దేశం సామాజిక వృద్ధితో మనుగడ సాగిస్తున్నది. ఇట్టి కారణాల వల్ల మనం భిన్నత్వంలో ఏకత్వమనే కోణం నుండి భారతదేశంలో మనం అనేక అంశాల్ని అర్థం చేసుకోగలగుచున్నాం.

Close