-->

ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది : సుప్రీంకోర్టు - April 2024 Current Affairs.

Also Readప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇతర దేశాల స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఆ దేశాల పౌరులకు శుభాకాంక్షలు చెప్పడం తప్పేమీ కాదని తేల్చి చెప్పింది. ఆర్టికల్ 370 రద్దును విమర్శిస్తూ వాట్సప్ స్టేటస్పెట్టుకున్న ప్రొఫెసర్‌పై నమోదు చేసిన ఎఫ్ఎఆర్‌ను కొట్టేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రకు చెందిన ప్రొఫెసర్ జావేద్ అహ్మద్జం.. ఆర్టికల్ 370 రద్దును విమర్శిస్తూ ఆగస్టు 5ను జమ్మూ కశ్మీర్‌కు బ్లాక్ డేగా పేర్కొన్నారు. ఆగస్టు 14న పాకిస్థాన్‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వాట్సప్ స్టేటస్పెట్టుకున్నారు. దీంతో కొల్హాపుర్ జిల్లాలోని హట్కనంగలే పోలీస్ స్టేషన్లో హజంపై సెక్షన్153ఏ (మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం) కింద కేసు నమోదైంది. ఈ కేసు నమోదును బాంబే హైకోర్టు సమర్థించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన జస్టిస్అభయ్స్ఓకా, జస్టిఉజ్జల భూయాన్లతో 'పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ పౌరులకు కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పును పక్కనబెట్టింది. శుభాకాంక్షలు చెప్పడంలో తప్పులేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) (ఏ) భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. దీనిద్వారా ఆర్టికల్ 370 రద్దును విమర్శించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుంది. ఆర్టికల్ రద్దు చేసిన రోజును బ్లాక్ డేగా పేర్కొనడంద్వారా హజం తన నిరసనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతి చర్యనూ సెక్షన్153ఏ ద్వారా అడ్డుకుంటే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. చట్టబద్ధ నిరసనను తెలిపే హక్కు ఆర్టికల్ 19(1)(ఏ) కల్పిస్తుంది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్య అవసరం' అని ధర్మాసనం స్పష్టం చేసింది.

Close