-->

అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం - 2019 - April 2024 Current Affairs.

Also Read

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) మళ్లీ తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నాలుగురోజుల్లో షెడ్యూలు వస్తుందనగా.. భాజపాకు ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్న సీఏఏను మోదీ సర్కారు బ్రహ్మాస్త్రంలా బయటికి తీసింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ల నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకుమనదేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా నోటిఫికేషన్ జారీచేసింది. సీఏఏ చట్టం - 2019లోనే పార్లమెంటు ఆమోదం పొందినా.. రాష్ట్రపతి సమ్మతి కూడా లభించినా. విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా అమలులో జాప్యం జరిగింది. పూర్తిస్థాయి నిబంధనలపై సందిగ్ధం నెలకొనడంతో ఆ చట్టం కార్యరూపం దాల్చలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ పలుమార్లు చెబుతూ వచ్చారు.

ఏమిటీ నిబంధనలు?

పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం మన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి.

ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ముగుస్తుంది. కేంద్ర నిర్ణయంపై విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. కొందరి పట్ల వివక్ష చూపేలా ఉంటే దీనిని అమలుచేయబోమని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఈ చట్టాన్ని తాము అమలు చేసేది లేదని కేరళ ముఖ్యమంత్రి విజయన్లు తెగేసిచెప్పారు.

Close