-->

భారత జాతీయోద్యమము (1919-1939) - Indian National Movement (1919-1939)

Also Read


    1919-1947 మధ్యకాలంను జాతీయోద్యమంలో చివరి అంకంగా చెప్పవచ్చును. ప్రపంచ చరిత్రలోనే వినూత్నమైన అహింస అను ఆయుధంతో గాంధీ జాతీయ ఉద్యమ అంతిమలక్ష్యంను 1947 నాటికి సాధించెను.
ఈ పాఠంలో 1919–1939 మధ్యకాలంలో జాతీయ ఉద్యమ గమనాన్ని మనం అధ్యయనం చేద్దాం. ఈ కాలంలో జాతీయ ఉద్యమంలో భిన్న సిద్ధాంతాలు ప్రవేశించినవి. గాంధీ సత్యాగ్రహం, భగత్సింగ్ విప్లవ పోరాటం, స్వరాజ్య వాదుల శాసనసభల ప్రవేశం, నెహ్రు సామ్యవాద భావాలు, సుభాష్చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ మొదలైన వేరు వేరు రాజకీయ భావాలు జాతీయోద్యమంలో చూస్తాము. ఈ దశలో యువకులు, వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, మేధావులు, కార్మికులు, రైతులు అందరూ ఉద్యమంలో భాగస్వాములైరి. ఈ అధ్యాయంలో జాతీయ ఉద్యమ గమనంతో పాటు మహిళల జాగృతి, అంటరానితనానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాలు, మద్యపాన వ్యతిరేక ఉద్యమాలు మొదలగునవి అంతర్భాగాలుగా చూడగలం. కాని ఈ దశలో హిందూ-ముస్లిం సంబంధాలు నానాటికి బలహీనపడి మతోన్మాదం పెచ్చు పెరిగెను.
పూర్ణస్వరాజ్ దిశగా సాగిన ఉద్యమంలోని ముఖ్య పరిణామాలను అధ్యయనం చేసెదము.

Close