-->

జాతీయ విద్యావిధానం2019 ముసాయిదా సారాంశం - 6. దేశంలోని ప్రతి బిడ్డకు సమానమైన, సమ్మిళిత విద్య

Also Readభారతదేశంలోని పిల్లలందరికీ ప్రయోజనం చేకూర్చే విద్యావ్యవస్థను రూపొందించాలని తద్వారా ఏ పిల్ల/పిల్లవాడు కూడా పుట్టుక పరిస్థితుల కారణంగా లేదా నేపథ్యాన్ని బట్టి నేర్చుకోవటానికిగానీ రాణించటానికిగాని ఎటువంటి అవకాశాన్ని కోల్పోకుండా ఉండేవిధంగా చూడడాన్ని ఈ విధానం లక్ష్యంగా పెట్టుకుంది.

లక్ష్యం: సమగ్ర, సమానమైన విద్యావ్యవస్థను సాధించడం, తద్వారా పిల్లలందరూ నేర్చుకోవడానికీ అభివృద్ధి చెందడానికి సమానమైన అవకాశాన్ని కలిగివుంటారు. తద్వారా 2030 నాటికి (లింగ భేదంలేకుండా) అన్ని లింగ, సామాజిక వర్గాలు పాల్గొనడంతోపాటుగా అభ్యాస ఫలితాలు కూడా సమానంగా ఉంటాయి.

ఎ. తక్కువ ప్రాతినిధ్యం గల సమూహాల విద్యార్థులను లక్ష్యంగా పెట్టుకొని వారిపట్ల తగిన శ్రద్ధ, మద్దతునిస్తూ ప్రారంభ బాల్య విద్య, అక్షరాస్యతా పునాది, గణితశాస్త్రం, పాఠశాల ప్రాప్యత, నమోదు, హాజరుకు సంబంధించినంతవరకు ఈ విధాన చర్యలు ఉంటాయి.

బి. దేశవ్యాప్తంగా (వెనుకబడిన) ప్రాంతాల్లో ప్రత్యేక విద్యా మండలాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్పష్టమైన సామాజిక అభివృద్ధి, సామాజిక-ఆర్ధిక సూచికల ఆధారంగా ఈ మండలాలను ప్రకటించడానికి ఆయా రాష్ట్రాలను ప్రోత్సహించడం, రాష్ట్రం ఖర్చు చేసే ప్రతి రూపాయికి 2:1 నిష్పత్తిలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ మండలాలను కలిగివుండడానికి గల కీలక ఆలోచన, ఈ విధానంలో పేర్కొన్న వాటన్నిటినీ ఒక సంఘటిత పద్ధతిలో, తక్కువ ప్రాతినిధ్యం గల సమూహాలను విలీనం చేసే లక్ష్యంగా పనిచేస్తాయి, ఈ మండలాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పర్యవేక్షణ పనిచేస్తాయి.

సి. కొన్ని కీలక ప్రారంభకార్యక్రమాలు ఉపాధ్యాయుల సామర్థ్య అభివృద్ధికి, ఈ అంశాల పట్ల నిరంతరం సున్నితంగా మార్చడం, విద్యాపరంగా తక్కువ ప్రాతినిధ్యం వహించే సమూహాల నుండి ఎక్కువ శాతం ఉపాధ్యాయుల నియామకానికి ప్రత్యామ్నాయ మార్గాలను సృష్టించడం, విద్యాపరంగా తక్కువ ప్రాతినిధ్యం లేని సమూహాల నుండి ఆయా పాఠశాలల్లో విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి 25:1 కంటే ఎక్కవ లేకుండా పరిమితం చేయడం, సమ్మిళిత పాఠశాల వాతావరణాన్ని సృష్టించడం, వేధింపులు, బెదిరింపులు, లింగ- ఆధారిత హింసను పరిష్కరించటానికి, వేత పద్ధతులను తొలగించే యంత్రాంగాల స్థాపనకు పాఠ్యప్రణాళికను చడం తద్వారా అందరినీ (కలుపుకొనిపోయేలా) సమ్మిళితం చేయడం జరుగుతుంది.
డి. నేషనల్ రిపోజిటరీ ఆఫ్ ఎడ్యుకేషనల్ డేటాలో ప్రతి విద్యార్థికి సంబంధించిన తాజా సమాచార నిర్వహణ, సెంట్రల్ ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్ డివిజన్ చేపట్టిన సమాచార విశ్లేషణతో ఉంటుంది.

ఇ. ప్రత్యేకంగా ఉపకారవేతనా(స్కాలర్షిప్)లను అందించడం కోసం ఒక జాతీయ నిధిని రూపొందించి విద్యార్థులకు వ్యక్తిగత ఆర్థిక సహాయం, తక్కువ ప్రాతినిధ్యం గల సమూహాల విద్యార్థులకు వనరులను, సౌకర్యాలను అభివృద్ధి చేయడంతోపాటుగా లక్షిత నిధులనూ మద్దతును, జిల్లాలకు, సంస్థలకు కూడా ఈ విధానం ప్రవేశాన్ని కలిగివుంటుంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మద్దతు, జాతీయ సహాయక ఉపాధ్యాయ కార్యక్రమంలోని నియామకాలు, పరిహార సూచనాత్మక సహాయ కార్యక్రమం (రెమెడియల్ ఇన్స్ట్రక్షన్ ఎయిడ్స్ ప్రోగ్రామ్), మధ్యాహ్నం భోజనంతో పాటు అల్పాహారం, ప్రత్యేక (ఇంటర్న్ షిప్) అవకాశాలు, సమ్మిళిత విద్యపై పరిశోధన కోసం నిధులివ్వడం కూడా జరుగుతుంది.

ఎఫ్. పాఠశాల ఉపాధ్యాయులలో మహిళల భాగస్వామ్యం, బాలికల విద్య విషయంలో ఉన్న లింగ అసమతుల్యతను పరిష్కరించడానికి విద్య, గిరిజన, కుల, మతం ఆధారిత సమూహాల విద్య, ఈ వర్గాల పిల్లలకు కేటాయించిన అన్ని ప్రయోజనాలను వారు పొందుకునేలా చూడటం, పట్టణ పేద కుటుంబాల పిల్లల విద్య, పట్టణ పేద ప్రాంతాలలో జీవనాన్ని గడపటానికి విద్యార్థులకు సహాయం చేయడం ఇంకా ప్రత్యేక అవసరాలున్న పిల్లల విద్యతో పాటు, ట్రాన్స్ జెండర్ పిల్లలను నిరంతరం పునరుద్ధరించే దృష్టితో ప్రధాన స్రవంతిలోని పొరుగున ఉన్న పాఠశాలల పిల్లలతో కలిసిపోయేవిధంగా చేర్చటం, పునాది దశ నుండి 12 వ తరగతి వరకు చర్యలు తీసుకోవడం ఈ విధానంలోని ఇతర సచిత్ర జోక్యం.

Close