-->

జాతీయ విద్యావిధానం2019 ముసాయిదా సారాంశం - 5. మార్పుకు మార్గదర్శకులు - ఉపాధ్యాయులు

Also Readలక్ష్యం: పాఠశాల విద్య అన్ని స్థాయిలలోని విద్యార్థులందరూ ఉద్వేగభరితమైన, ప్రేరేపిత, అధిక అర్హత కలిగిన, వృత్తిపరంగా శిక్షణ పొంది, చక్కటి సిద్ధపాటుగలిగిన ఉపాధ్యాయుల ద్వారా బోధనను హామీ ఇవ్వటం జరుగుతుంది.

'మన సమాజంలోని అతి ముఖ్యమైన సభ్యులు, మార్పుకు మార్గదర్శకులు' ఉపాధ్యాయులు. నాణ్యమైన విద్యను ప్రోత్సహించడానికి చేసే ఏ ప్రయత్నమైనా విజయం గురువు నాణ్యతపై ఆధారపడి ఉంటుందని ఈ విధానం దార్శనికంగా ఊహిస్తుంది.

ఎ. నిరుపేద, గ్రామీణ లేదా గిరిజన ప్రాంతాలలోని వారిని అత్యుత్తమ విద్యార్థులుగా సమర్థతకలుగజేసే నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.ఎడ్. ప్రోగ్రామ్ ఉంటుంది. మేధ ఆధారిత ఉపకారవేతనాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, వారి స్థానిక ప్రాంతాలలో ఉపాధి హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బడుతుంది. ముఖ్యంగా మహిళా విద్యార్థులను గురిగా పెట్టుకొని జరుగుతుంది.

బి. అన్ని పాఠశాలల్లో సమగ్ర ఉపాధ్యాయ అవసరాల ప్రణాళిక ఆధారంగా ఒక బలమైన ప్రక్రియ ద్వారా ఉపాధ్యాయుల నియామకం జరుగుతుంది, స్థానిక ఉపాధ్యాయులకు, స్థానిక భాషలో నిష్ణాతులుగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, వైవిధ్యానికి హామీనిస్తుంది. మొదటి అడుగులో పునఃరూపకల్పన చేసి, ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఆ తర్వాత మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ), బోధనా ప్రదర్శన ద్వారా జరుగుతుంది. ఉపాధ్యాయులను జిల్లాకు నియమించడం ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో చేస్తునట్లుగానే జరుగుతుంది, వారిని ఒక పాఠశాల సముదాయానికి నియమించడం, పారదర్శక మైన సాంకేతిక-ఆధారిత వ్యవస్థ ద్వారా స్థిర పదవీకాలం, నియమ-ఆధారిత బదిలీలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో బోధించడానికి వారిని ప్రోత్సహిస్తారు.

సి. ‘సహాయక ఉపాధ్యాయులు' (అర్హత లేని, ఒప్పంద ఉపాధ్యాయులు) 2022 నాటికి దేశవ్యాప్తంగా పూర్తిగా నిలిపివేయడం జరుగుతుంది.

డి. ఉపాధ్యాయ వృత్తిపరమైన నిరంతర అభివృద్ధికి అనువైన పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యాయులు తాము ఏమి నేర్చుకోవాలనుకునేదాన్నీ ఎలా నేర్చుకోవాలనుకుంటున్నారో వారే ఎంచుకుంటారు. ప్రారంభ ఉపాధ్యాయులను ప్రేరేపించడంలోనూ ఒకే చోట ఉంచే మార్గదర్శక ప్రక్రియలపై దృష్టి నిలుపుతారు. ఎంపిక-ఆధారిత వృత్తిపరమైన అభివృద్ధిని ప్రారంభించడానికీ ప్రతి ఒక్కఉపాధ్యాయుని వృత్తిపరమైన పర్యవేక్షణ ప్రక్రియలపై దృష్టి సారించడం జరుగుతుంది. సాంకేతిక-ఆధారిత వ్యవస్థను ఆయా రాష్ట్రాలు అవలంబించాల్సి ఉంటుంది. పాఠ్య ప్రణాళికకు సంబంధించి కేంద్రీకృత నిర్ణయం ఉండదు, మాదిరి (క్యాస్కేడ్-మోడల్) శిక్షణ ఉండదు, కఠినమైన నిబంధనలు ఉండవు. ఈ కార్యక్రమాలను ఉపన్యాసాలకు వనరు వ్యక్తులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేయడం, తద్వారా సమర్థవంతంగా శిక్షణ పొందడం జరుగుతుంది. వారి పాత్రలో పదవీకాలం ఉంటుంది.

ఇ. ఉపాధ్యాయుల పనిని సులభతరం చేయడానికి తగినంత భౌతిక మౌలిక సదుపాయాలూ సౌకర్యాలు, అభ్యాస వనరులతోపాటు కావలసిన విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తిని నిర్ధారిస్తారు. విద్యార్థులందరూ నేర్చుకునేందుకు సహాయపడే విధంగా అన్ని స్థాయిలలో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, తద్వారా ఉపాధ్యాయులు నేర్చుకునే విద్యార్థులకు హామీ ఇవ్వడానికి సహాయపడుతుంది.

ఎఫ్. ఉపాధ్యాయులందరూ పాఠశాల సమయంలో బోధనేతర కార్యకలాపాల రూపంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా బోధించగలగాలి (ఉదా. మధ్యాహ్నం భోజనం వండటం, పాఠశాల సామాగ్రిని సేకరించడం మొదలైనవి). క్రమంగా, కారణం లేకుండా పాఠశాలకు హాజరుకానందుకు లేదా అనుమతి పొందిన సెలవు లేకుండా ఉన్నందుకు ఉపాధ్యాయులు జవాబుదారీగా ఉంటారు.

జి. ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడు/రాలు లేదా పాఠశాల ప్రిన్సిపాల్ పాఠశాల అభివృద్ధి ప్రక్రియలకు, సహాయక పాఠశాల సంస్కృతిని నిర్మించడానికి బాధ్యత వహిస్తారు. పాఠశాల నిర్వాహక కమిటీని సున్నితమౌతుంది. అటువంటి సంస్కృతికి మద్దతుగా పాఠశాల విద్య డైరెక్టరేట్ అధికారులు వారి పనితీరును మార్చడానికి పునరభ్యసన చేయించవలసి ఉంటుంది.

ఎచ్. భారతీయ భాషలలోని ఉపాధ్యాయులకూ అధ్యాపకులకు, విద్యార్థులందరినీ కలుపుకుని వారికి హామీ ఇచ్చే విధంగా ఉండే అధిక-నాణ్యతగల పఠనసామగ్రిని వారివారి ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి ఇవ్వబడుతుంది.

ఐ. ప్రస్తుతం ఉన్న అన్ని విద్యా సహాయక సంస్థలను బలోపేతం చేయడానికి, జాగ్రత్తగా ఒక ప్రణాళికతో విద్యా సహాయక సంస్థలను పునరుజ్జీవింపచేయడానికి తగిన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

జె. ఉపాధ్యాయులందరూ కనీస సంవత్సరాల బోధనా అనుభవం తర్వాత విద్యా పరిపాలన లేదా ఉపాధ్యాయ విద్యలో ప్రవేశించగలుగుతారు. దీర్ఘకాలంలో, అన్ని విద్యా పరిపాలనా స్థానాలు పరిపాలనపై ఆసక్తి ఉన్న అత్యుత్తమ ఉపాధ్యాయులకు కేటాయించబడతాయి.


Close