-->

జాతీయ విద్యావిధానం2019 ముసాయిదా సారాంశం - 4. పాఠశాల విద్యకు కొత్త పాఠ్యప్రణాళిక, బోధనా నిర్మాణం

Also Readలక్ష్యం: విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, శాస్త్రీయ స్వభావం, సహకారం, బహుభాషావాదం, సమస్య పరిష్కారం, సామాజిక బాధ్యత, డిజిటల్ సంఖ్యాత్మక అక్షరాస్యత వంటి సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించే 21 శతాబ్దపు నైపుణ్యాలను ప్రోత్సహించటానికి బదులుగా మూస పద్ధతిలో వల్లె వేయడం పద్ధతిలో తగ్గించి, 2022 నాటికి పాఠ్య ప్రణాళిక, బోధనలు రూపాంతరం చెందుతాయి.

పాఠశాల విద్య పాఠ్య ప్రణాళిక, బోధనా నిర్మాణం వివిధ దశలలో వారి అభివృద్ధిపరమైన అవసరాలకు ప్రతిస్పందనగానూ, సంబంధంగానూ అభ్యాసకుల అభిరుచులకు తగినట్లుగాను చేయడానికి పునర్నిర్మించబడుతుంది.

ఎ. పాఠ్య ప్రణాళిక, బోధనా నిర్మాణం, పాఠశాల విద్య కోసం పాఠ్య ప్రణాళిక రూపురేఖకు మార్గనిర్దేశం చేయడానికి ఒక 5 + 3 + 3 + 4 రూపకల్పనను చేస్తారు:

• పునాది (వయస్సు 3-8 సంవత్సరాలు): వేగవంతమైన మెదడు అభివృద్ధి; ఆటలు, క్రియాశీల ఆవిష్కరణల ఆధారంగా నేర్చుకోవడం.

• సిద్ధపాటు దశ (8-11 సంవత్సరాలు): ఆటలు, ఆవిష్కరణలపై నిర్మించడం; నిర్మాణాత్మక అభ్యాసానికి పరివర్తనను ప్రారంభించడం.

మధ్య దశ (11-14 సంవత్సరాలు): విషయాలలో భావనలను అభ్యాసంచేయడం; కౌమారదశను ప్రారంభించడం.

• ద్వితీయ దశ (14-18 సంవత్సరాలు): జీవనోపాధి, ఉన్నత విద్యకు సిద్ధపాటు; నవయవ్వన యుక్తవయస్సులోకి మారడం.

బి. ద్వితీయ దశ నాలుగు సంవత్సరాల బహుశాస్త్రవిషయ అధ్యయనాన్ని కలిగి ఉంటుంది. విద్యార్థులు విషయాన్ని లోతుగా అధ్యయనంచేయాడానికి, విమర్శనాత్మక ఆలోచనకు, జీవిత ఆకాంక్షలపై శ్రద్ధ చూపుతూ వారి ఎంపికకు వెసులుబాటు గలిగి ఉంటారు.

సి. అభ్యాసకులను అభివృద్ధి చేయడానికి పాఠశాల విద్య పాఠ్యవిషయాన్ని, ప్రక్రియను తిరిగి కొత్త చేయవలసి ఉంటుంది. పాఠ్యప్రణాళిక భారాన్ని తగ్గించి అవసరమైన ఆలోచనలకు, కీలకమైన అంశాలకు మాత్రమే పరిమితంచేయటంతోపాటుగా అనుభవపూర్వక అభ్యాసానికి స్థానం కల్పించడం జరుగుతుంది.

డి. భాషలలో ప్రావీణ్యం, శాస్త్రీయ స్వభావం, సౌందర్య, కళల దృష్టి, సమాచారం, నైతిక తార్కికం, సంఖ్యాత్మక (డిజిటల్) అక్షరాస్యతలనూ భారతదేశ జ్ఞానం, స్థానిక సమాజాలు, దేశం, ప్రపంచం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలపై పరిజ్ఞానాన్ని పెంపొందించే విధంగా విద్యార్థులందరూ ప్రోత్సహించబడడం జరుగుతుంది.

ఇ. సౌకర్యవంతమైన పాఠ్యాంశాలు - పాఠ్య, సహ-పాఠ్య లేదా అదనపు పాఠ్యాంశాల ప్రాంతాలను కఠినంగా వేరు చేయకుండా; కళలు, శాస్త్రాలు, ‘వృత్తి', 'విద్యా స్రవంతులు - మాధ్యమిక పాఠశాల స్థాయిలో విషయ ప్రాంతాలను మార్చే అవకాశంతో విద్యార్థుల ఎంపికను అనుమతిస్తుంది.

ఎఫ్. విద్య స్థానిక భాష / మాతృభాషలో కనీసం 5 వ తరగతి వరకు ఉంటుంది, అయితే దాదాపుగా 8 వ తరగతి వరకు ఉంటే బాగుంటుంది, అవసరమైన చోట ఒక సౌకర్యవంతమైన (ద్విభాషా) భాషా విధానంతో ఉంటుంది.

జి. అధిక నాణ్యతగల పాఠ్యపుస్తకాలు స్థానిక భాషలలో అవసరమైన విధంగా, సాధ్యమైనంతవరకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. వైకల్యంగల విద్యార్థుల కోసం ప్రత్యేక పఠనసామగ్రిని అభివృద్ధి చేయడం జరుగుతుంది.

ఎచ్. త్రి భాషా సూత్రం దేశవ్యాప్తంగా (ఒకే) తో అమలు చేయడం జరుగుతుంది; భాషా ఉపాధ్యాయులను నియమించడానికీ అభివృద్ధి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

ఐ. 6-8 తరగతుల్లోని విద్యార్థులందరికీ వృత్తిపరమైన నైపుణ్యాలు, చేతిపనులపైన ఏడాది పొడవునా కోర్సులో శిక్షణనివ్వడం జరుగుతుంది. తొందరగా వారికి వృత్తిపరమైన అంశాలపై కలగటం ప్రారంభమవుతుంది. 9-12 తరగతులలో పిల్లలకు సాంప్రదాయ విద్యా కోర్సులతో పాటుగా వృత్తి విద్యా కోర్సులకు ప్రాప్యతను జతపరుచు” (‘మిక్స్ అండ్ మ్యాచ్') అనే విధంగా విద్యార్థులకు కూడా కలిగి ఉంటారు. "కలగలుపు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

జె. 2020 చివరి నాటికి జాతీయ పాఠ్య ప్రణాళిక రూపురేఖ పునఃసమీక్షించడంతోపాటు సవరించబడుతుంది. అన్ని ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంటుంది. కొత్త పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేసి, అధిక నాణ్యత గల అనువాదాలను చేయడం జరుగుతుంది.

కె. మదింపు: విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడేలా మదింపు మార్చబడుతుంది. అన్ని పరీక్షలు (బోర్డు పరీక్షలతో సహా) అధిక క్రమ సామర్థ్యాలతో పాటు కీలక అంశాలనూ నైపుణ్యాలను పరీక్షించటం జరుగుతుంది. 2025 నాటికి, మధ్యతరగతి స్థాయిలో, ఆపై వాటిలో మదింపు కంప్యూటరీకరించి దాని ద్వారా
పరీక్ష ఉంటుంది. 2020/2021 నుండి, జాతీయ అటానమస్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా వివిధ విషయాలలో పరీక్షలు ఇంకా వివిధరకాల విషయాల మీద పరీక్షలను నిర్వహిస్తుంది, వీటిని సంవత్సరంలో బహుసందర్భాలలో రాయవచ్చు.

ఎల్. పాఠశాల నుండి జిల్లా స్థాయిలు, నివాస వేసవి కార్యక్రమాలు, ఒలింపియాడ్లు, పోటీల ద్వారా అంశ కేంద్రీకృత, పథక-ఆధారితల ద్వారా ఏక ప్రతిభలను, ఆసక్తులను గుర్తించడం, ప్రోత్సహించడం జరుగుతుంది.
Close