-->

జాతీయ విద్యావిధానం2019 ముసాయిదా సారాంశం - 3. అన్ని స్థాయిల విద్యలో సార్వత్రిక ప్రాప్యత, నిలుపుదల ఉండేలా చూడటం

Also Readలక్ష్యం: 2030 నాటికి 3-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత, తప్పనిసరి నాణ్యమైన పాఠశాల విద్య పాల్గొనే ప్రాప్యతను సాధించండి.

నమోదులో పురోగతిని గమనించినప్పుడు, పాఠశాలలోని పిల్లలను నిలబెట్టుకోవడంలో మన అసమర్థతపై ఆ విధానం ఆందోళన వ్యక్తం చేస్తుంది.

ఎ. వివిధ చర్యలనుతీసికొని 2030 నాటికి మాధ్యమిక పాఠశాల ద్వారా ప్రీ-స్కూల్ లో 100% స్థూల రాల నమోదు నిష్పత్తి సాధించి అవసరాలను తీర్చగలిగి ఉండాలి.

బి. ఇప్పటికే ఉన్న పాఠశాలల్లోకి విద్యార్థులను తీసుకోవడాన్ని పెంచడం, పరిధిలోనివి ఇంకా సేవ చేయని ప్రదేశాలలో కొత్త సౌకర్యాలు అభివృద్ధి చేయడం. రవాణా, వసతిగృహ సౌకర్యాల ద్వారా పాఠశాలను హేతుబద్ధీకరణ చేయటం అదే సమయంలో విద్యార్థులందరికీ, ముఖ్యంగా బాలికలకు భద్రతను హామీ ఇవ్వడం ద్వారా ప్రాప్యత అంతరాలు తొలగించడం జరుగుతుంది.

సి. పిల్లలందరూ పాల్గొనడాన్ని, నేర్చుకోవడాన్ని హాజరు ద్వారా కనుగొనడం, నేర్చుకోవడానికి నమోదు చేసుకున్న పిల్లల హాజరును, అభ్యాస ఫలితాలను జాడను కనుగొనడం, కౌమారదశలో ఉండి, దీర్ఘకాలంగా పాఠశాల నుండి బయటికి వచ్చేసినవారిని, మధ్యలో పాఠశాలను మానివేసినవారిని ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, సలహాదారులు, కార్యక్రమాల ద్వారా జాడను కనుగొనడం జరుగుతుంది. నేర్చు కోవడానికి నియత, అనియత విధానాల ప్రమేయం, ఓపెన్, దూర పాఠశాలలో విద్యనభ్యసించడం, సాంకేతిక వేదికల వంటి బహుళ మార్గాల ద్వారా బలోపేతం చేసి, వాటిని అందుబాటులో ఉంచడం జరుగుతుంది.

డి. ఆరోగ్య సమస్యల కారణంగా పాఠశాలకు హాజరు కాలేకపోయిన విద్యార్థులు విషయంలో, వీలైనంత త్వరగా వారు పాఠశాలకు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవడానికి పాఠశాలల్లో ఆరోగ్య కార్యకర్తలను నియమించడం, విద్యార్థులలోనూ తల్లిదండ్రులులోనూ దాదాపు సమాజమంతటికీ తగిన ఆరోగ్య సేవలపైన వారికి అవగాహన కలిగించడంతోపాటుగా వాటిని అనుసంధానించడాన్ని హామీ ఇవ్వడం జరుగుతుంది.

ఇ. విద్యా హక్కు చట్టం అవసరాలను గణనీయంగా తక్కువ నియంత్రణతో (శారీరక, మానసిక) భద్రత, ప్రాప్యత, చేరిక, లాభాపేక్షలేని స్వభావంగల పాఠశాలలు, అభ్యాస ఫలితాలు కనీస ప్రమాణాలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇది స్థానిక వైవిధ్యాలను, ప్రత్యామ్నాయ నమూనాలను అనుమతించడం, ఇంకా పాఠశాలలను ప్రారంభించడానికి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు అనుమతినిస్తూ సులభతరం చేయడం జరుగుతుంది.

ఎఫ్. ప్రీ-స్కూల్ నుండి 12వ గ్రేడ్ వరకు ఉచిత, నిర్బంధ విద్య అందుబాటుకు హామీ ఇవ్వడానికి విద్యా హక్కు చట్టాన్ని విస్తరింపజేయడం జరుగుతుంది.

Close