-->

జాతీయ విద్యావిధానం2019 ముసాయిదా సారాంశం - 2. పిల్లలందరిలోను అక్షరాస్యతా పునాదిని, గణితాన్ని భరోసా ఇవ్వడం

Also Readలక్ష్యం: 2025 నాటికి, 5 వ తరగతి, అంతకు మించినవాటిలో ప్రతి విద్యార్థి లోను అక్షరాస్యతా పునాదిని, గణితాన్ని సాధించడం.

ఈ విధానం తీవ్రమైన అభ్యాస సంక్షోభాన్ని గుర్తించింది. ప్రారంభ భాష, గణితానికి సంబంధించినంత వరకు సమ్మతిని బట్టి దీనికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది.

ఎ. పోషణ, అభ్యాసం విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి. మధ్యాహ్నం భోజన కార్యక్రమం విస్తరించబడుతుంది - ప్రీ-ప్రైమరీ, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పోషకమైన ఉపాహారం, మధ్యాహ్నం భోజనం రెండూ అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చు ఆహార ఖర్చులుతోను ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుంది.

బి. 1-5 తరగతులలో అక్షరాస్యతా పునాది, గణితాలపై దృష్టి పెరగడం జరుగుతుంది.దానితోపాటుగా అనుకూల అంచనా, నాణ్యమైన సామగ్రి లభ్యత గలిగి, ఇది ఒక బలమైన వ్యవస్థగా ఉంటుంది. భాష జాతీయ, గణిత వనరులు జాతీయ ఉపాధ్యాయ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి.

సి. సాంకేతిక జోక్యాలు ఉపాధ్యాయులకు సహాయపడే ఉపకరణాలను ప్రయోగాత్మకంగా పరిశీలించడం జరుగుతుంది. ప్రభుత్వ/ప్రజా, పాఠశాల గ్రంథాలయాలను, పఠన సంస్కృతిని నిర్మించడానికి ప్రయోగాత్మకంగా విస్తరించడం జరుగుతుంది.

డి. గ్రేడ్ 1 విద్యార్థులందరూ మూడు నెలల సుదీర్ఘ పాఠశాల సిద్ధపాటు మాడ్యూల్ శిక్షణ పొందుతారు.

ఇ. ఉపాధ్యాయ విద్య అక్షరాస్యతా పునాదికి, గణితానికి కొత్తగా ప్రాధాన్యతనిచ్చే విధంగా పునఃరూపకల్పన చేయడం జరుగుతుంది.

ఎఫ్. జాతీయ సహాయక ఉపాధ్యాయుల (నేషనల్ ట్యూటర్స్ ప్రోగ్రాం) (సహబోధకులను కలుపుకొని), నుండి బోధకులను తీసుకొని పరిహార సూచనాత్మక సహాయక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. జి. ప్రతి పాఠశాల స్థాయిలో విద్యార్థి- ఉపాధ్యాయ నిష్పత్తిని 30:1 లోపుగా ఉండేటట్లు హామీ ఇవ్వడం జరుగుతుంది.

ఎచ్. సామాజిక కార్యకర్తలు, సలహాదారులు పిల్లలందరినీ నిలుపుకోవడానికీ మానసిక ఆరోగ్యానికి హామీ ఇవ్వడానికి సహాయపడతారు. తల్లిదండ్రుల భాగస్వామ్యం, స్థానిక సమాజం ఇంకా విద్యా స్వచ్ఛంద సేవకుల సమీకరణ అక్షరాస్యతా పునాదికి, గణితశాస్త్రానికి సంబంధించిన విధాన లక్ష్యాలను నెరవేర్చడానికి సహాయపడతారు.

Close