-->

జాతీయ విద్యావిధానం2019 ముసాయిదా సారాంశం - 1. ప్రారంభ బాల్య సంరక్షణను విద్యను బలోపేతం చేయడం

Also Read


లక్ష్యం: 2025 నాటికి 3-6 సంవత్సరాల వయస్సుగల ప్రతి బిడ్డకు ఉచిత, సురక్షితమైన, అధిక నాణ్యతగలిగి, అభివృద్ధిపరంగా తగిన సంరక్షణను, విద్యను అందించటం.

ప్రారంభ బాల్య విద్య క్లిష్టతనూ ఒక వ్యక్తి జీవితమంతా దాని ప్రయోజనాలు నిలిచిఉండే అంశాన్ని ఈ విధానం నొక్కి చెబుతుంది.

ఎ. స్థానిక అవసరాలు, భౌగోళికం ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలపై బహుముఖ, పదునైన విధానాల ద్వారా గణనీయమైన విస్తరణతోపాటు, ప్రారంభ బాల్య విద్య సౌకర్యాలను బలోపేతం చేయటం జరుగుతుంది.

బి. ముఖ్యంగా సామాజిక-ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలు/ప్రదేశాలకు ప్రత్యేక శ్రద్ధను వహించడంతోపాటు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. నాణ్యతకు, ఫలితాలకు తగిన పర్యవేక్షణ కోసం ప్రక్రియలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.

సి. ప్రారంభ బాల్య విద్య అధ్యాపకులకూ తల్లిదండ్రులకు ఈ ఇరువురినీ ఉద్దేశించిన ఒక బోధనా రూపురేఖనూ ఒక పాఠ్యప్రణాళికను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ రూపురేఖ 0-3 సంవత్సరాల పిల్లలకు తగిన అభిజ్ఞా ఉద్దీపనను కలిగించడంతోపాటు, 3-8 సంవత్సరాల పిల్లలకు విద్యాపరమైన మార్గదర్శకాలను కలిగి ఉంటుంది.

డి. అభ్యాస-స్నేహపూర్వక వాతావరణాలు, నిరంతర వృత్తిపరమైన అధ్యాపకుల అభివృద్ధి, ప్రారంభ బాల్య విద్య కోసం దశ-నిర్దిష్ట శిక్షణ, మార్గదర్శకత్వం, నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి, అంరతరనైపుణ్యాలను మెరుగుపరచడానికి అవకాశాలతో కలిపి ఈ రూపకల్పనను చేపట్టడం జరుగుతుంది.

ఇ. ప్రారంభ బాల్య విద్య అన్ని అంశాలు విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి (ప్రస్తుతం దీనికి ఉన్న మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేరు మార్చబడుతుంది) ప్రారంభ బాల్య విద్యను మిగిలిన పాఠశాల విద్యతో సమర్థవంతంగా అనుసంధానించడం జరుగుతుంది - - 2019నాటికి విద్యా, మహిళా శిశు అభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు సంబంధిచిన పరివర్తన ప్రణాళికను సంయుక్తంగా ఖరారు చేయడం జరుగుతుంది.
ఎఫ్. అన్ని ప్రీ-స్కూల్ విద్యలను (ప్రైవేట్, ప్రభుత్వ, దాతృత్వ) కలుపుకొని ఒక సమర్థవంతమైన నాణ్యత నియంత్రణను లేదా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది సమ్మతిని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది.

జి. తల్లిదండ్రులు తమ పిల్లల అభ్యాస అవసరాలకు చురుకుగా మద్దతు ఇవ్వడానికి వీలుగా పెద్ద ఎత్తున సమాచారాన్ని వ్యాప్తి చేయడం, భారీ స్థాయిలో సలహాలను తీసుకోవడం ద్వారా వాటాదారుల నుండి గిరాకీని ఉత్పత్తి చేయడం జరుగుతుంది.

ఎచ్. 3–6 సంవత్సరాల పిల్లలకు ఉచిత, తప్పనిసరి నాణ్యమైన విద్యను అందుబాటులో ఉంచి భరోసా ఇవ్వడానికి ఈ 2009 విద్యా హక్కు చట్టాన్ని విస్తరించటం జరుగుతుంది.

Close