-->

మూలధన వ్యయంలో అట్టడుగున ఏపీ - AP is at the bottom of the capital expenditure

Also Read

దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూలధన వ్యయంలో అథఃపాతాళానికి చేరింది. 25 రాష్ట్రాల మూలధన వ్యయాలను పరిశీలిస్తే అందులో ఏపీ అట్టడుగున ఉంది. మనపొరుగున ఉన్న కర్ణాటక దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. చివరకు దేశంలోనే అతి చిన్న రాష్ట్రాలైన నాగాలాండ్, అస్సాం, త్రిపుర కంటే కూడా వెనకబడటంగమనార్హం. అతి చిన్న రాష్ట్రమైన నాగాలాండ్ మూలధన వ్యయం రూ.7,936 కోట్లుకాగా ఆంధ్రప్రదేశ్ మూలధన వ్యయం రూ.6,917 కోట్లే. చాలా రాష్ట్రాలు తమ 2022 - 23 బడ్జెట్ మూలధన కేటాయింపుల్లో 50 శాతం, అంతకంటే ఎక్కువ మూలధన వ్యయంచేయగా ఆంధ్రప్రదేశ్లో అది 23% మాత్రమే అని బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదలచేసిన నివేదిక వెల్లడించింది.

ఈనివేదిక ప్రకారం దేశంలోని కర్ణాటక, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, బిహార్రాష్ట్రాలు తమ బడ్జెట్ మూలధన కేటాయింపులకు మించి ఖర్చుపెట్టాయి.8 రాష్ట్రాలు కేటాయింపుల్లో 70% పైన, మరో 9 రాష్ట్రాలు 50% పైన మూలధన వ్యయంచేశాయి.

మూలధన వ్యయం అంటే..

ప్రాజెక్టుల నిర్మాణం, రహదారులు, భవనాలు, ఆరోగ్య సౌకర్యాలు, విద్యతదితరాలపై ఖర్చు చేసే మొత్తాన్ని మూలధన వ్యయంగా పరిగణిస్తారు. ఈ వ్యయం వల్లసంపద సృష్టి జరుగుతుంది. ఈ ఖర్చులు చేయడం వల్ల భవిష్యత్తులో ఆదాయం సమకూరిరాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందువల్ల సంపద సృష్టికి మూలధన వ్యయమేఆధారం. ఇప్పుడు పెట్టే ఖర్చుతో ప్రజల ఆదాయం పెరుగుతుంది. జీవనోపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఉదాహరణకు ఒక ప్రాజెక్టు కడితే దాని ద్వారా లక్షలఎకరాలకు సాగునీటి వసతి కల్పించవచ్చు. తద్వారా పంటలు పండి, రైతులకు ఆదాయంలభిస్తుంది. వ్యవసాయంపైనే ఆధారపడిన ఇతర రంగాల్లోనూ వృద్ధి నమోదవుతుంది. అంతిమంగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది.

Close