-->

భారత స్వాతంత్ర్య చట్టం 1947 || స్వతంత్రం- విభజన || The Indian Independence Act 1947 || independence- division

Also Read


సామాజికంగా సమూలమైన మార్పులు కోరే ఉద్యమాలకు తలమానికమైన తెలంగాణా ఉద్యమం సంఘటితమైన సమర్థవంతమైన రాజకీయ ప్రత్యామ్నాయం గల దేశవ్యాప్త ఉద్యమాలను ఐక్యం చేయలేకపోయింది. కాని ఆ ఉద్యమాలు కలిగించిన భయాందోళనలు - విభజన, మతమారణ కాండని మూల్యాలుగా చెల్లించి శాంతియుతంగా అధికారమార్పిడి కొరకు జరిగిన రాజీబేరానికి తోడ్పడ్డాయి. సీనియర్ ఉన్నతాధికార ఉద్యోగిగా, 1947-48లో పటేల్కి విశ్వాస పాత్రుడిగా, వేవల్కి ఆ తరువాత మౌంట్బాట్కి నమ్మకమైన సలహాదారుడిగా కీలకపాత్ర నిర్వహించిన వి.పి. మీనన్ 1947 సంవత్సర ప్రారంభంలో పైకెగసిన సమ్మె వెల్లువ సందర్భంగా వైస్రాయికి యిలా రిపోర్టు చేశారు. “కాంగ్రెస్ నాయకులు ప్రజాదరణ కోల్పోయన్నారు. కాంగ్రెస్లో తీవ్రమైన అంతర్గత సమస్యలున్నాయి. కాంగ్రెస్ లోని వామపక్షాన్ని చూసి కాంగ్రెస్భ యపడుతుంది. కార్మిక సమస్యల ప్రమాదం చాలా తీవ్రంగా వుంది.” ఒక వారం తరువాత వేవల్స్ జర్నల్ కమ్యూనిస్టు ప్రమాదాన్ని గురించి పటేల్తో జరిపిన సంభాషణని ప్రచురించింది.
“అతడు కమ్యూనిస్టు పార్టీని చట్ట విరుద్ధమైనదిగా ప్రకటిస్తాడనే అభిప్రాయం కలిగింది.” – స్వతంత్రం సాధించిన కొద్ది నెలలో హోం మినిష్టర్ ఈ ఆకాంక్షని నెరవేర్చాడు (వైస్రాయి జర్నల్ 1947 జనవరి పేజీలు 408,411). 1947 ఫిబ్రవరిలో రాజ్యాంగ పరిషత్తులో చేరి మంత్రివర్గ పని విధానంలో సహకరించేందుకు లీగు తిరస్కారం, లీగుకి చెందిన మంత్రుల రాజీనామాకై కాంగ్రెస్ డిమాండు, డిమాండ్ ఆమోదించబడకపోతే తమ మంత్రుల రాజీనామా బెదిరింపు-లాంటి హెచ్చరికల కారణంగా బ్రిటిషు ప్రభుత్వం తక్షణమే నాటకీయంగా ముందుకు వచ్చింది. అధికార మార్పిడికి తుది గడువు 1948 జూన్ గా నిర్ధారిస్తూ అట్లీ ఫిబ్రవరి 21 కామన్స్ సభలో ప్రఖ్యాత ప్రసంగం చేశారు. రాజ్యాంగంపై భారత దేశ రాజకీయ నాయకులు అంగీకారానికి రాకపోయినప్పటికి బ్రిటిషిండియాకి కేంద్ర ప్రభుత్వాన్ని మొత్తంగా ఏదో ఒక రూపంలో యివ్వడంగాని లేక కొన్ని ప్రాంతాలలో అప్పటికి వున్న రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పడం ద్వారాగాని, భారత ప్రజల ప్రయోజనాల దృష్ట్యా హేతుబద్ధమైన మరొక విధంగా గాని బ్రిటిషువారు రాజకీయాధికారాన్ని పరిత్యజిస్తారు. బ్రిటిషువారి అధికారాలు, స్వదేశీ సంస్థానాల పట్ల గల బాధ్యతలు అధికార మార్పిడితో అంతమవుతాయి. విభజన సూచన చాలా రాజ్యాలుగా విడగొట్టే సూచన చాలా స్పష్టంగా చేయబడింది. కాంగ్రెస్ మరొక ప్రజా ఉద్యమం చేపట్టడం తప్ప ప్రత్యామ్నాయంలేని పరిస్థితులలో, మత ఘర్షణల కారణంగా ఉద్యమం చేపట్టడం చాలా కష్టమైన పరిస్థితులలో నిర్దిష్టమైన తేదీకి అదీ చాలా దగ్గరలో వున్న తేదీ నాటికి పూర్తి అధికార మార్పిడి ఎర తిరస్కరించడానికి వీలుపడనంత ఆకర్షణీయంగా వుంది. వేవల్ స్థానంలో మౌంటు బాటెన్ని నియమిస్తున్నట్లుగా బ్రిటిషు ప్రధాన మంత్రి ప్రకటించారు.

Close