-->

ప్రపంచానికే నడకను నేర్పిన సింధు నాగరికత - What did the Indus civilization contribute to the world?

Also Read


'చరిత్ర అడక్కు... చెప్పింది విను' అనేది సినిమాలకు మాత్రమే పనికొచ్చేమాట. 'చరిత్ర తెలుసుకోకుండా చెప్పేదేదీ వినకు’ అనేది జీవితానికి ఉపకరించే సూత్రం. సమకాలీన సమాజంతో సంబంధం లేకుండా గతం ఉండదు. చారిత్రక అవగాహన లేకపోతే వర్తమానం అంతుపట్టదు. ముఖ్యంగా గ్రూప్-2 వంటి పరీక్షల్లో చరిత్ర ప్రాధా న్యం ఎనలేనిది. గ్రూప్-2 జనరల్ స్టడీస్లో 'భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం' ఈసారి ఓ ప్రధానాంశం. దీనిపై కనీసం 25 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చరిత్రను విస్తృతంగా చదవా ల్సిందే. అయితే సింధు నాగరికత మొదలు స్వాతంత్ర్య సాధన వరకు మహాసాగరంలా కనిపించే చరిత్రలో ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎంతని చదవాలి అన్న అయోమయం ఉద్యోగార్థుల్లో కలిగితే అది అసహజమేమీ కాదు. అయిదువేల సంవత్సరాల భారత చరిత్ర విస్తృతి అంతటిది. ఎన్నెన్నో వైరుధ్యాలు, వైవిధ్యమైన భారత చరి త్రను గ్రూప్-2 కోణంలో విశ్లేషించి, అరటిపండు ఒలిచినట్లుగా మీకందించేందుకు మేం చేస్తున్న ప్రయత్నమిది.

సింధు నాగరికత

దేశ చరిత్రను రెండువేల ఏళ్ల వెనక్కి జరిపిన నాగరికత ఇది. ఆర్యుల తోనే భారతదేశ చరిత్ర ప్రారంభమైందని 1920 వరకూ చరిత్రకారులు భావించారు. కానీ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, విస్తార మైన, నవ నాగరిక సంస్కృతికి మన దేశం పుట్టినిల్లన్న వాస్తవం. 1921లో దయారాం సాహ్ని హరప్పాను, 1922లో ఆర్.డి. బెనర్జీ మొహంజొదారొను కనుగొనడంతో వెల్లడైంది. ఈ నాగరికత స్థూలం గా క్రీ.పూ. 3000-1500ల మధ్య విలసిల్లిందన్నది చరిత్రకారుల అభిప్రాయం. కాంస్య యుగానికి చెందిన ఈ నాగరికత - 12,99,600 చదరపు కిలోమీటర్ల భారీ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. భౌగోళికంగా పశ్చిమాన సుక్తోజెంధార్ నుంచి తూర్పున అలంగీర్పూర్ వరకూ, ఉత్తరాన కాశ్మీర్ వద్ద ఉన్న మండ నుంచి దక్షిణాన మహారాష్ట్రలోని దైమాబాద్ పట్టణం వరకూ సింధు నాగరికత విస్తరించింది.

సమాజంలో ప్రధాన వర్గాలు

సింధు ప్రజలు మాతృస్వామిక వ్యవస్థను అనుసరించారు. ఆనాటికి వర్ణవ్యవస్థ ఆవిర్భవించలేదు. వ్యాపారులు, చేతివృత్తులవారు, వ్యవ సాయదారులు, ఆటవికులు సింధు సమాజంలో నాలుగు ప్రధాన వర్గాలు. వ్యవసాయం, వాణిజ్యం సింధు ప్రజల ప్రధాన వ్యాపకాలు.

ప్రపంచంలోనే పత్తిని పండించిన తొలి సమాజం వారిది. వాణిజ్యప రంగానూ సింధు ప్రజలు కొత్త ఒరవడికి తెరచాపలెత్తారు. మెసపటో మియా, ఈజిప్ట్, గ్రీస్ వంటి ప్రాంతాలలో నౌకల ద్వారా ఉధృతంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించారు. అందుకోసం ప్రత్యేకంగా నౌకాశ్రయాలను నిర్మించుకున్న ఘనత వీరిది. ఆచార విశ్వాసాల పరంగానూ సింధు ప్రజలు విలక్షణమైన పంథానే అనుసరించారు. పశుపతి, అమ్మతల్లికి, జంతు, వృక్షాదులకు వీరు పూజాధికాలు నిర్వ హించినట్లు తెలుస్తోంది. ప్రపంచంలో సింధు నాగరికతను విలక్షణ వేదికపై నిలుపుతున్న అంశం- వారి నగర నిర్మాణ కౌశలం. స్కేల్ పెట్టి కొలిచారా అన్నట్లు నిలువూ, అడ్డంగా వీధులను సమాన బ్లాకు లుగా విభజించారు. ఇళ్ల నిర్మాణంలో కూడా వారు అదే పరిణతిని కనబర్చారు. ప్రతి ఇంటికీ ప్రవేశ, నిష్క్రమణ ద్వారం; స్నానపు గదులు, మురుగునీటి వ్యవస్థ కచ్చితంగా ఉండేవి. ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా భారతదేశంలోని అనేక పట్టణాల్లోనూ ఇప్పటికీ స్థాయి సౌకర్యాలు లేవంటే అతిశయోక్తి కాదు. అందుకే సింధు నాగరి కత 'పట్టణ నాగరికత' అన్న పేరు గణించింది. ఆ

ప్రజల ఆహార అలవాట్లు

గోధుమ, బార్లీ సింధు ప్రజల ప్రధాన ఆహారం. పప్పుదినుసులు, నూనెగింజలు కూడా వీరు ఆహారంలో వినియోగించారనడానికి ఆధా రాలున్నాయి. స్టిటైట్ అనే సున్నపు రాయితో వీరు విస్తృతంగా ముద్రి కలను తయారుచేశారు. రకరకాల జంతువులు, పశుపక్ష్యాదులను ము ద్రించిన ముద్రికలు రెండు వేల వరకు దొరికాయి. కుండలను, బంక మట్టితో బొమ్మలను తయారుచేయడంలో వీరు సిద్ధహస్తులు. వీరిది బొమ్మల లిపి. వీటిని ఇప్పటి వరకూ చరిత్రకారులు ఛేదించలేకపో యారు. 400 రకాల బొమ్మలను ఉపయోగించి వీరు వ్యక్తం చేసిన భావాలను చదవగలిగితే సింధు నాగరికతకు సంబంధించి మరిన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయి.

Close