-->

సాయుధ పోరాటాలు - Armed conflicts Andhra

Also Readమద్రాసు ప్రెసిడెన్సీ, హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిస్టులు 1945లో కేడర్ ఉన్న పార్టీలుగా గుర్తింపు పొందారు. వీరు ఆంధ్ర మహాసభ ద్వారా రైతు సంఘాలను ఏర్పాటు చేసి ప్రజల్లో జాతీయ భావాలు నూరిపోశారు.
1944లో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన భువనగిరిలో 'ఆంధ్ర మహాసభ జరిగింది. హైదరాబాద్ నగరంలో 1940లో యువజను లతో ‘కామ్రేడ్స్ అసోసియేషన్' స్థాపించి ప్రజలతో మంచి సంబం ధాలు ఏర్పరచుకున్నారు. విద్యార్థులు, కార్మికుల్లో సామ్యవాద భావా లు మొలకెత్తేటట్లు సభలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో ట్రేడ్ యూనియన్ సంస్థలను ముఖ్ుమ్ మొహినుద్దీన్, డాక్టర్ రాజబహదూర్ గౌడ్, సాంబమూర్తి లింగారెడ్డి, శ్రీనివాస లహాటి వంటివారు కార్మిక ఉద్యమాలకు జీవం పోశారు.
ఆంధ్ర కమ్యూనిస్టు నాయకులు అన్నివేళలా తెలంగాణ కమ్యూ నిస్టు నాయకులకు తోడ్పడ్డారు. ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు అందించడం ద్వారా పార్టీ పటిష్టానికి సేవలందించారు. ఆంధ్రా కమ్యూనిస్టు నాయకుడు ఎన్.వి.కె. ప్రసాద్- నిజాం ఆంధ్ర మహాసభ కార్యకర్తలకు ఎన్నో విలువైన సూచనలు అందజేశారు. తెలంగాణ ప్రాంత కమ్యూనిస్టు నాయకులైన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, వి.ఆళ్వారు స్వామి, దేవులపల్లి వెంకటేశ్వరరావులు, ఆంధ్రా కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, బసవ పున్నయ్య వంటి కమ్యూనిస్టు నాయకులతో సత్సంబంధాలు నెలకొల్పుతూ రెండు ప్రాంతాల్లోనూ కమ్యూనిస్టు పార్టీలు పటిష్టమయ్యేందుకు ప్రయత్నించారు.
హైదరాబాద్ రాష్ట్రంలో 'కమ్యూనిస్టు పార్టీ'ని 1939లో స్థాపిం చారు. ఆంధ్రా కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావు భువన గిరిలో జరిగిన ఆంధ్ర మహాసభకు హాజరయ్యారు. తెలంగాణ ప్రాంతంలో రాజకీయ పాఠశాలలు నిర్వహించారు. (school of politics). ఆనాటి రైతులపై విధించిన బలవంతపు లెవీ పద్ధతిని వ్యతిరేకించారు.
దేశ్ముఖు, జాగీరుదార్ల (స్థానిక భూస్వాములు) చెర నుంచి విముక్తి కావాలంటే ప్రజలంతా చైతన్యవంతులు కావాల్సిన అవసరాన్ని గుర్తించి కమ్యూనిస్టు నాయకులు ఆ దిశగా తమ వంతు ప్రయత్నాలు చేశారు. 'ప్రజా నాట్యమండలి' ద్వారా బుర్రకథలు, నాటికల ద్వారా కమ్యూనిస్టు సామ్యవాద భావాలను విస్తృతంగా ప్రచారం చేశారు.

రైతాంగ పోరాటాలు - భూస్వామి వ్యతిరేక రైతు ఉద్యమాలు

ఆ 1944 భువనగిరి ఆంధ్ర మహాసభ సదస్సు తర్వాత నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ఆంధ్ర మహాసభ శాఖలు ఏర్పడ్డాయి. వీటిని ఆనాడు 'సంఘాలు'గా పిలిచారు. జనగామ తాలూకాలోని విసునూరి రామచంద్రారెడ్డి అనే పదివేల ఎకరాల భూస్వామికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ సభ్యుడైన ఆరుట్ల రామచంద్రారెడ్డి పోరాటం జరి పాడు. ఈ పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటానికి (19461951)స్ఫూర్తినిచ్చింది. 1946లో విసునూరి రామచంద్రారెడ్డికి, ఆంధ్ర మహాసభ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. సందర్భంలో దొడ్డి మల్లయ్య, మంగలి కొమరయ్య అనే ఇద్దరు రైతు లను విసునూరి వర్గీయులు కాల్చి చంపారు. తర్వాత కమ్యూనిస్టులు 'హింసకు-హింస' పద్ధతిలో పోరాటాలు నిర్వహించారు. తెలంగాణ లోని జాగీరుదార్లు, దేశముఖపై రైతాంగం తిరుగుబాటు చేసింది. జనగామ రైతాంగ పోరాట సంఘటన భువనగిరి, సూర్యాపేట, రామన్నపేటలకు వ్యాపించింది. దీనితో నిజాం ప్రాపకం పొందిన భూస్వాములు వెనకడుగు వేశారు. ఈ సంఘటన ఆంధ్రా కమ్యూని స్టులను కూడా ప్రభావితం చేసింది. మరోవైపు... 1946 జూలైలో దేశ స్వాతంత్య్ర సాధన కోసం ఉద్యమం తీవ్రమైంది. దీంతో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన సంస్థానాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి పావులు కదిపాడు. ఈ కాలంలో కమ్యూనిస్టులు ప్రజల్లో చొచ్చుకుపోయారు. భూస్వాములు, జాగీరుదార్లు, దేశముఖ్ు నిర్వీ ర్యం అయిపోయారు. దీంతో కమ్యూనిస్టులు ప్రజలకు చుక్కాని వలె కన్పించారు. తమకు రక్షకులు వీరేనని ప్రజలు భావించారు. హిందువు లంతా ఏకమయ్యారు. తెలంగాణలో 'ఆకునూరు, మాచిరెడ్డిపల్లి' రైతాంగ పోరాటం దేశముఖ్ కు వ్యతిరేకంగా జరిగింది. ఈ సంఘ టన భారతదేశమంతా ఆకర్షించింది. కుమారి పద్మజానాయుడు ద్వారా మహాత్మాగాంధీ రైతాంగ పోరాట వివరాలను సేకరించారు.

ధర్మాపురం:

నల్గొండ జిల్లా జనగామ తాలూకా ధర్మాపురం జమీందారు పుసు కూరు రాఘవరావు 80 ఎకరాల మెట్ట, 25 ఎకరాల మాగాణీ గల లంబాడీ తండాపైకి కొంతమంది గూండాలను పంపాడు. ఈ చర్యను అక్కడి లంబాడీలు ప్రతిఘటించారు. లంబాడీలకు కమ్యూనిస్టులు పూర్తి సహకారం అందించారు. ఈ విధంగా కమ్యూనిస్టులు బేత వోలు, ఒక్కవంతుల గూడెం, మల్లారెడ్డిగూడెం, మేళ్లచెరువు తిమ్మా పురం, అల్లపురం, ములకల గూడెం, నాసికల్లు, విసునూరు భూస్వా ములను ఎదుర్కొని పోరాటాలు జరిపారు.
1945-46 సంవత్సరాల్లో తెలంగాణ జిల్లాల్లో రైతులకు రక్షణ కల్పించడానికి కమ్యూనిస్టు పార్టీ అనేకమైన వాలంటరీ దళాలను ఏర్పాటు చేసింది. ఆనాడు భూస్వాముల ఏజెంట్లు, గ్రామాలు, పొలా లపై విస్తారంగా దాడులు నిర్వహించేవారు. కార్యకర్తలు తమ రక్షణ కోసం అవసరమైన వేట తుపాకులు, రైఫిళ్లు, రివాల్వర్లు మొదలైన ఆయుధాలు సేకరించుకునేందుకు వీలుగా కమ్యూనిస్టు పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. దీంతో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను నైజాం ప్రభుత్వం మూకుమ్మడిగా నిర్బంధించింది. దీన్ని నిరసించిన కమ్యూ నిస్టు పార్టీ రైతులు, వ్యవసాయ కార్మికులు, యువజనులను సమావేశ పరచి నైజాంకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేసింది. ఈ తరుణంలో 1946, నవంబర్లో 'కమ్యూనిస్టు పార్టీ'పై నిజాం నవాబు నిషేధం విధించాడు. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నవాబు నల్గొండ వరంగల్ జిల్లాల్లో సాయుధ బలాల క్యాంపులను నిర్వహించాడు. కమ్యూనిస్టుల ఉద్యమ తీవ్రత తగ్గిందని భావించిన నిజాం సాయుధ బలగాలను గ్రామాల నుంచి వెనక్కి రప్పించాడు. దీంతో తెలంగాణ ప్రజలంతా హైదరాబాద్ను ముస్లిం రాజ్యంగా చేయడానికి సహకరిస్తారని నిజాం భావించాడు.
1947, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం లభించింది. హైదరాబాద్ సంస్థాన ఏడో నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్, తన సంస్థానం భారతదేశంలో విలీనం కాదని, స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుందని ప్రకటించాడు. అత్యధిక ప్రజానీకం విలీనం కావాలని కోరుకున్నారు. నవాబు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించారు. దీనితో స్వామి రామానంద తీర్థ 1947, ఆగస్టు 7న హైదరాబాద్ ‘జాయిన్ ఇండియా మూవ్మెంట్' (Join India Movement) ప్రారంభించాడు. ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నిషేధాలను ఉల్లంఘించేందుకు సభలు, సమావేశాలు అన్నిచోట్లా జరిగాయి. బొంబాయిలో పని చేస్తున్న 12 వేలమంది హైదరాబాద్ కార్మికులతో సహా సహ కార్మికులు, విద్యార్థులు సమ్మె చేశారు. నిజాం జాతీయ జెండా ఆవిష్కరణ ఉత్సవాన్ని నిషేధించాడు. ఈ నిషేధ ఉత్తర్వు 'హైదరాబాద్ ప్రజలకు సవాల్. ఈ సవాల్ని స్వీకరించాలి' అని రామానందతీర్థ పిలుపునిచ్చాడు. స్వామిజీ, అతని అనుచరుల్ని 1947, ఆగస్టు 15 తెల్లవారుజామున దేశానికి స్వాతం త్ర్యం లభించిన తొలి గంటలోనే అరెస్టు చేశారు. అయితే, ముందు గానే వేసుకున్న పథకం ప్రకారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అధిగమించి సుమారు వందమంది విద్యార్థులు సుల్తాన్ బజార్ లో జెండా ఎగురవేశారు. ఈ ఉద్యమంలో బ్రిటిష్ మహిళయైన బ్రిజ్జ్ యశోదాబెన్ వంటివారు పాల్గొన్నారు.

Close