-->

తుఫాన్ల వల్ల నష్టాలు - Losses due to hurricanes

Also Read

తుఫాన్ల వల్ల నష్టాలు

తుఫాను అలజడి కారణంగా వచ్చే బలమైన గాలులు, విస్తారమైన వర్షాలు, వాటివల్ల వచ్చే వరదలు కలిసి భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలుగజేస్తాయి. 1999లో ఒడిశాలో వచ్చిన సూపర్ సైక్లోన్ కారణంగా 10వేల మందికి పైగా మరణించగా, అంతకంటే ముందు 1977 నవంబర్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన భయంకర తుఫాను కారణంగా 9,941 మంది చనిపోయారు. 34 లక్షల మందికి పైగా నిరాశ్రయులు అయ్యారు. 2013 అక్టోబర్లో వచ్చిన ఫైలిన్ తుఫాను కూడా భారీ విధ్వంసం సృష్టించింది.

తుఫాన్లు సృష్టించే విధ్వంసం ప్రధానంగా తుఫాను తీవ్రత, దాని పరిమాణం, అది సంభవించే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. పెను తుఫాన్లు అడవులను సైతం ధ్వంసం చేస్తాయి. ఇటీవల వచ్చిన పైలిన్ తుఫాను వల్ల ఒడిశా రాష్ట్రంలో 26 లక్ష లకు పైగా చెట్లు నేలకూలాయి. తీర ప్రాంతంలో ల్యాండు స్కేపుల రూపురేఖలను సైతం మార్చివేస్తాయి. ఇసుక దిన్నెలను తొలగించడం లేదా వాటి రూపురేఖలను మార్చడం ద్వారా తీరం వెంబడి భూ క్షయానికి దారితీస్తాయి. తుఫాన్ల వల్ల వచ్చే భారీ వర్షాల కారణంగా తీరం వెంబడే కాకుండా లోతట్టు ప్రాంతాల్లో సైతం విధ్వంసం జరుగుతుంది. పర్వత ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటం (భూపాతాలు Landslides), బురద ప్రవాహాలు (పంక-పాతాలు Mudslides) వంటివి జరుగుతాయి. తుఫాను సంభవించిన సమీప ప్రాంతంలోని గుహల్లో ఆక్సిజన్ 18 ఐసోటోపు గాఢత పెరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. తుఫాను సృష్టించిన విధ్వంసం అంత టితోనే ఆగిపోదు. ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి ఉండటం వల్ల అంటువ్యాధులు వ్యాపి స్తాయి. రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయి. 

ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలు తుఫాన్ల వల్ల అధికంగా నష్టాలకు గురికావడానికి కారణాలు

  • బంగాళాఖాతంలో సంభవించే సగం తుఫాన్లు తరచుగా తుఫాను తుఫాను అలజడులతో కూడిన తీవ్ర చక్రవాతాలుగా మారడం. 
  • తీరం వెంబడి లోతట్టులో ఉండే ప్రాంతాలు అసాధా . రణ వరదలకు, సముద్రపు నీటి ముంపునకు గురవడం. . 
  • తీరం వెంబడి జనాభా, మౌలిక వసతులు, ఆర్థిక కార్యక లాపాలు అధికంగా కేంద్రీకృతం కావడం.
  • వరద సంరక్షణ, సాగునీటిపారుదల వ్యవస్థలు, మురు గునీటి కాలువలు, ఆనకట్టల నిర్వహణ సక్రమంగా లేకపోవడం.
  • తీరప్రాంత, డెల్టా నిర్వహణ సమగ్రంగా లేకపోవడం." .

భారతదేశంలో తుఫాను హెచ్చరికలు

అల్పపీడనం ఏర్పడి, అది తుఫానుగా మారి, విధ్వంసం సృష్టించడాన్ని కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల ముందే పసి గట్టవచ్చు. కృత్రిమ ఉపగ్రహాలు తుఫాన్ల కదలికలను పసిగడతాయి. దాని ఆధారంగా, అవి ప్రభావితం చేయబోయే ప్రాంతాల నుంచి ప్రజలను ముందుగానే ఖాళీ చేయిస్తారు. అయితే తుఫాన్లను నిక్కచ్చిగా అంచనా వేయడం చాలా కష్టం. కచ్చితమైన హెచ్చరికలను కొద్ది గంటలు ముందుగా మాత్రమే ఇవ్వడం సాధ్యమవుతుంది.
ప్రపంచంలో అత్యుత్తమ తుఫాను హెచ్చరిక వ్యవస్థలు కలి గిన దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. భారతదేశంలో తుఫాన్ల రాకను అంచనా వేసి, హెచ్చరికలను జారీ చేసే బాధ్యతను భారత వాతావరణ శాఖ నిర్వర్తిస్తుంది. ఇనాశాట్ ఉపగ్రహాలతో పాటు 10 సైక్లోన్ డిటెక్షన్ రాడార్ల సహాయంతో చక్రవాతాల రాకను, అవి ప్రయాణించే మార్గాన్ని పసిగడతారు. కోల్కతా, చెన్నై, ముంబైలలోని ఏరియా సైక్లోన్ హెచ్చరికల కేంద్రాలు, విశాఖపట్టణం, భువనేశ్వర్, అహ్మదాబాద్లోలో ఉన్న తుఫాను హెచ్చరికల కేంద్రాల ద్వారా తుఫాను హెచ్చరికలను జారీ చేస్తారు. తుఫాను హెచ్చరికల ప్రక్రియను పుణెలోని డీడీజీఎం వాతావరణ కేంద్రం, న్యూఢిల్లీలోని నార్తరన్ హెమిస్ఫెరిక్ ఎనా లసిస్ సెంటర్ (ట్టజ్ఛిట Hemispheric Analysis Centre)లు సమన్వయపరుస్తాయి. అనంతరం తుఫాను హెచ్చరికలను ప్రజలకు శాటిలైట్ ఆధారిత విపత్తు హెచ్చరికల వ్యవస్థ, రేడియో, టెలివిజన్, టెలిఫోన్, ఫ్యాక్స్, హై ప్రయారిటీ టెలిగ్రాములు, బహిరంగ ప్రకటనలు, పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియజేసి అప్రమత్తం చేస్తారు.

తుఫాను ఉపశమన చర్యలు

7516 కిలోమీటర్ల భారతదేశ తీరరేఖలో 5700 (71%) కిలో మీటర్ల భూభాగం తుఫాను అలజడులు, తుఫాన్లు, సునా మీల ముప్పును కలిగి ఉంది. భారతదేశంలో ఏటా వచ్చే తుఫాన్ల వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతోంది. జీవనో పాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు తీవ్ర నష్టం జరుగుతోంది. మౌలిక వసతులు ధ్వంస మవుతున్నాయి. తద్వారా అప్పటివరకు సాధించిన అభివృద్ధి తిరోగమన మార్గం పడుతోంది. దీని నివారణకు కొన్ని ఉపశ మన చర్యలు చేపట్టాలి. ఇవి రెండు రకాలు: 1. నిర్మాణాత్మక ఉపశమన చర్యలు, 2. నిర్మాణేతర ఉపశమన చర్యలు.

తీర ప్రాంతాల్లో బహుళార్ధ సాధకతుఫాను షెల్టర్లను నిర్మిం చడం, తీరరేఖ వెంబడి శాస్త్రీయ పద్ధతిలో మడ అడవులను పెంచడం, వృక్షాలను నాటడం వంటి చర్యలు చేపట్టాలి. అడ వులు బలమైన గాలులు, ఆకస్మిక వరదలను అడ్డుకునే కవచంలాగా పని చేస్తాయి. వీటితోపాటు భవనాలను బలమైన గాలులను తట్టుకునే విధంగా దృఢంగా నిర్మించడంతో పాటు ఎత్తయిన దిన్నెలు లేదా మట్టి దిబ్బలపై నిర్మించాలి. ఆయా ప్రాంతాలకు సంబంధించిన వైపరీత్యాల మ్యాపులను తయా రుచేసి, ప్రజలకు అవగాహన కల్పించాలి. తుఫాను ముప్పు ఉన్న ప్రాంతాల్లో సంక్లిష్టమైన నిర్మాణాలు, కార్యకలాపాలు చాలా తక్కువగా ఉండే విధంగా ప్రభుత్వాలు జాగ్రత్తపడాలి. వరదలు సంభవించే మైదాన ప్రాంతాల్లో ఉండే భూ వినియో గాన్ని క్రమబద్ధీకరించే విధానాలను, భవన నిర్మాణ కోడ్లను రూపొందించి అమలు చేయాలి.
ఈ చర్యల్లో భాగంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేసేందుకు జాతీయ తుఫాను ముప్పు ఉపశమన ప్రాజెక్టు (National Cyclone Risk Mitigation Project)ను 200910లో ప్రారంభించింది. 5 ఏళ్లపాటు అమల్లో ఈ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. 

తుఫాను నష్టాల తగ్గింపులో విపత్తు నిర్వహణ ప్రభావం

తుఫాన్ల తీవ్రత పెరుగుతున్నప్పటికీ, ఇటీవల కాలంలో వాటి వల్ల సంభవించే ప్రాణ నష్టం గణనీయంగా తగ్గుతోంది. 1970లో పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్లలో వచ్చిన భోలా తుఫాను తాకిడికి రెండు ప్రాంతాల్లో కలిపి 5 లక్షల మంది మర ణించారు. అలాగే 1999 ఒడిషా సూపర్ సైక్లోన్ కారణంగా 10,000 మంది మరణించగా, 1977లో చెన్నై, కేరళ, ఆంధ్రప్ర దేళ్లలో వచ్చిన తుఫాను ధాటికి 14,204 మంది చనిపోవడం జరిగింది. ప్రాణ నష్టంతో గణనీయంగా పంటలు దెబ్బతినడం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు విధ్వంసం కావడం జరిగింది.  అయితే 2004లో వచ్చిన సునామీ అనంతరం విపత్తు నిర్వ హణపై భారతదేశంలో కూడా అప్రమత్తత ప్రారంభమైంది. తత్ఫలితంగానే 2005లో విపత్తు నిర్వహణ చట్టం రూపుదా ల్చడం, అందులో భాగంగా జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ), జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్టీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థలు ఏర్పాటు కావడం, వాటిని జిల్లా, గ్రామ స్థాయి వరకు వికేంద్రీ కరించడం, పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, పంచవర్ష ప్రణాళికలో, ఆర్థిక సంఘాల నిధుల కేటాయింపుల్లో విపత్తు నిర్వహణకు స్థానం కల్పించడం తదితర చర్యలు కారణంగా విపత్తు నిర్వహణ ప్రాధాన్యత సంతరించుకుంది. భారతదే శంలో విపత్తుల కారణంగా జీడీపీలో 2 నుంచి 2.25% వరకు నష్టం జరుగుతున్నట్టు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. కాబట్టి విపత్తు నిర్వహణకు భారతదేశం పెద్ద పీట వేస్తోంది. తత్ఫలితంగా విపత్తుల నివారణతోపాటు విపత్తు సమయంలో చేపట్టాల్సిన చర్యలపై కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాయి. దేశంలో 10 చోట్ల జాతీయ విపత్తు స్పందన దళాల(ఎన్డీఆర్ఎ ప్)ను ఏర్పాటు చేయడం జరిగింది. 2007 నవంబర్ 100 కోట్లతో జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (National Disaster Response Fund (NDRF))ని కేంద్రం నెలకొ ల్పింది. 13వ ఆర్థిక సంఘం రాష్ట్ర విపత్తు స్పందన నిధి (State Disaster Response Fund (SDRF)), జాతీయ విపత్తు స్పందన నిధుల కోసం పథకాలను సిఫారసు చేసింది. ఈ చర్యల ఫలితంగా విపత్తుల వల్ల సంభవించే నష్టాలు గణనీ యంగా తగ్గాయి. ప్రధానంగా ప్రాణ నష్టం భారీగా తగ్గింది. 1999లో వచ్చిన ఒడిశా సూపర్ సైక్లోన్ ధాటికి 10వేల మందికి పైగా మరణించగా, 2013 అక్టోబర్లో వచ్చిన ఫైలిన్ పెను తుఫానులో మరణించిన వారు 44 మంది మాత్రమే. ఇందుకు సాంకేతిక విప్లవం కూడా చాలా వరకు దోహం చేసిందని చెప్పొచ్చు. తక్కువ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వాతావరణ రేడియోలు, హామ్ రేడియోలు, సెరైన్లు, లౌడుస్పీకర్లు, ఈమె యిల్స్, ఎస్ఎంఎస్లు లేదా ట్విటర్, ఫేస్బుక్ వంటి సామాజిక వెబ్సైట్ల ద్వారా అందే సందేశాలు ప్రజలను చాలా వేగవం తంగా అప్రమత్తం చేసి, ప్రాణనష్టాన్ని తగ్గించడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. గూగుల్ సెర్చ్ ఇంజన్ కామన్ అలర్ట్ ప్రోటోకాల్(Common Alert Protocol (CAP) ఆధారిత అలర్జీలను ప్రారంభించింది. ట్విట్టర్ సామాజిక వెబ్సైట్ ట్విట్టర్ అలర్ట్ పేరుతో ఒక యాప్ను ఆవిష్కరించింది. ఇలా బహుముఖాలుగా విపత్తు నిర్వహణకు ప్రాధాన్యం పెర గడంతో ప్రాణ నష్టం గణనీయంగా తగ్గుతున్నప్పటికీ, పంట నష్టం, ఆస్తి నష్టం, పశుసంపద నష్టం, పర్యావరణానికి జరిగే నష్టాలను కుదించలేకపోతున్నారు. దీనికి సైతం తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అడవులను పెంచడం, భూతాపాన్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టడం, వాటిపై ప్రజల్లో అవగా హన కల్పించడం వంటి చర్యల ద్వారా విపత్తులను కుదించి, వాటివల్ల సంభవించే నష్టాలను కూడా నివారించవచ్చు.

Close