-->

భారత రాజ్యాంగం - గవర్నర్- సుప్రీంకోర్టు- హైకోర్టు - Constitution of India (భారత రాజ్యాంగం)

Also Read(1) దేశానికి రాష్ట్రపతి అధినేత అయితే రాష్ట్రానికి గవర్నర్ అధినేత. 
(2) రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతి నియమిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
(3) వాస్తవానికి రాష్ట్రానికి గవర్నర్ నామమాత్రపు అధికారి. కార్యనిర్వాహక అధికారం అంతా ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుంది. 
(4) గవర్నర్ గా ఎన్నిక కావడానికి కనీసం 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.
(5) గవర్నర్, జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. 
(6) శాసనసభ ఆమోదించే బిల్లులు చట్టాలు కావడానికి గవర్నర్ ఆమోదముద్ర తప్పనిసరి. 
(7) శాసనసభ సమావేశాలు ఆరు నెలలకు కనీసం ఒక్కసారైనా జరగాలి.
(8) రాష్ట్ర ప్రభుత్వం జారీచేయు అన్ని శాసనాలు కూడా గవర్నర్ పేరు మీద ఉంటాయి.
(9) గవర్నర్ ముఖ్యమంత్రిని, అతని సూచనల ప్రకారం మంత్రి మండలిని నియమిస్తారు. రాష్ట్రపతిని సంప్రదిస్తారు. 
(10) హైకోర్టు న్యాయమూర్తులను ముందు గవర్నర్ నియమించడానికి
(11) బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలలో మంత్రి మండలి నిర్మాణంలో ఆదివాసుల కోసం ఒక మంత్రి తప్పనిసరిగా ఉండేలా గవర్నర్ సూచిస్తాడు.
(12) రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులకు, చేయు ఖర్చులకు సంబంధించిన బిల్లులను గవర్నర్ ఆమోద ముద్రతో శాసనసభలో ప్రవేశపెట్టాలి. 
(13) ఆగంతుక నిధిని గవర్నర్ ఆధీనంలో ఉంచుకుంటాడు.
(14) ప్రతి ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ను గవర్నర్ అనుమతితో రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి ప్రవేశపెడతాడు.
(15) న్యాయస్థానాలు విధించే శిక్షలను రద్దు చేయటానికి, మార్చటానికి, తగ్గించటానికి గవర్నర్కు అధికారము కలదు.
(16) న్యాయస్థానాలకు సంబంధించిన అన్ని పదవులకు గవర్నర్ పేరు మీదనే నియామకాలు జరుగుతాయి.
(17) గవర్నర్ విధులపై పాలనా సంస్కరణల సంఘంను 1969లో నియమించారు.
(18) గవర్నర్కు సంబంధించిన విధులు, అతని పాత్రపై రాజమన్నార్ సంఘాన్ని 1971లో నియమించారు.
(19) “గవర్నర్ రాజ్యాంగం ఏర్పరచిన రాష్ట్రాధిపతి. అతను కేంద్ర ప్రభుత్వం ఏజెంటు కాదు" అని గవర్నర్ ఉపసంఘం పేర్కొంటుంది. 
(20) కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించడానికి నియమించిన కమిషన్స ర్కారియా కమిషన్
(21) 'గవర్నర్గా పనిచేయు వ్యక్తి అదే రాష్ట్రానికి చెందిన వాడై ఉండకూడదు' అని సర్కారియా కమిషన్ సూచించింది.
(22) శాసనసభను ఏర్పరచడం, వాయిదా వేయడం, రద్దు చేయడం విషయంలో ముఖ్యమంత్రి సలహాను గవర్నర్ పాటించవలెను.
(23) రాజ్యాంగంలో మూడు ప్రకరణాలు 74(1), 75(1), 78 మాత్రమే దేశ ప్రధాని గురించి ప్రస్తావిస్తున్నాయి.
(24) 74(1) రాజ్యాంగ ప్రకరణను 44వ సవరణ ద్వారా కొంత మార్పు చేశారు. దీని ప్రకారం మంత్రి మండలి సిఫార్సులను రాష్ట్రపతి పునఃపరిశీలన చేయమని తిప్పి పంపవచ్చు.
(25) 39వ రాజ్యాంగ సవరణకు పూర్వం ప్రధాన మంత్రి ఎన్నికకు సంబధించిన వివాదాలను నిర్ణయించడానికి సాధారణ న్యాయస్థానాలకు అధికారముంటుంది.
(26) ప్రధానమంత్రి మంత్రి మండలికి అధ్యక్షుడుగా ఉంటాడు. మంత్రి మండలి నియమించు అన్ని ఉపసంఘాలకు ప్రధాని అధ్యక్షుడుగా ఉంటారు.
(27) ప్రధాన మంత్రి సలహా, సంప్రదింపుల ఆధారంగా రాష్ట్రపతి రాజ్యాంగ అధికారాలను నిర్వహిస్తాడు.
(28) సమాఖ్య రాజ్యాంగంలో అధికారాలు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య విభజన జరుగుతుంది. అధికారాల నిర్వహణలో ఏమైనా వివాదం ఏర్పడితే సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది.
(29) రాజ్యాంగంలోని 124వ ప్రకరణం ప్రకారం సుప్రీం కోర్టులో మొదట ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు న్యాయమూర్తులు ఉండేవారు.
(30) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచు అధికారాన్ని పార్లమెంటుకు ఉంటుంది.
(31) ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు.
(32) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించే అధికారం పార్లమెంటుకు ఉంది.
(33) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఇతర న్యాయమూర్తుల వేతనాలను Anush అధికారం పార్లమెంటుకు లేదు.
(34) న్యాయమూర్తులందరి వేతనాలను సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు.
(35) రాష్ట్రాల మధ్య గానీ లేదా కేంద్రం, రాష్ట్రాల మధ్య గానీ ఏర్పడు వివాదాలను కోసం.. పరిష్కరించు అధికారం సుప్రీం కోర్టుకు 131వ అధికరణ ద్వారా ఆపాదించారు.
(36) సుప్రీం కోర్టు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం కాబట్టి రాష్ట్ర హైకోర్టు విచారించిన కేసులపై పునర్విచారణ చేయు అధికారం గలదు.
(37) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 368వ ప్రకరణలో కొత్తగా 4, 5 క్లాజులను చేర్చారు.
(38) 134(ఎ) ప్రకరణం ప్రకారం హైకోర్టు తీర్పు చెప్పిన వెంటనే తీర్పు మీద సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకోవడానికి సర్టిఫికేటు ఇవ్వమని హైకోర్టును కోరవచ్చు.
(39) 136వ ప్రకరణ ప్రకారం ఏ ట్రిబ్యునల్ తీర్పులపై నేరుగా సుప్రీం కోర్టు అప్పీలు చేసుకునే అధికారం ఇవ్వవచ్చును.
(40) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలు రూపొందించే చట్టాల రాజ్యాంగ బద్ధతను పరిశీలించే అధికారం సుప్రీంకోర్టుకు సంక్రమించింది.
(41) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 139(ఎ) ప్రకరణాన్ని కొత్తగా చేర్చారు. దీని ఆధారంగా సుప్రీం కోర్టు కోసం వచ్చిన వివిదాలతోను హైకోర్టులలో విచారణ కోసం వచ్చిన వివాదాలను శాసనాంశాలు ఒక రకంగా ఉన్నప్పుడు హైకోర్టు వివాదాన్ని ఆటార్నీ జనరల్ ఆధారంగా సుప్రీం కోర్టుకు మార్చవచ్చు.
(42) 139వ ప్రకరణాన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా హైకోర్టుల వివాదాలను అటార్నీ జనరల్ అనుమతి లేకుండా కూడా సుప్రీం కోర్టుకు హైకోర్టు మార్చవచ్చు.
(43) సుప్రీం కోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్.జె.కానియా.
(44) 7వ రాజ్యాంగ సవరణ ప్రకారం పార్లమెంటు రెండు లేక అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు సమిష్టిగా ఒకే హైకోర్టును ఏర్పాటు చేసుకోవచ్చు.
(45) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు.
(46) రాజ్యాంగంలోని 124వ ప్రకరణ ఆధారంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా తొలగిస్తారో అదే విధంగా హైకోర్టు న్యాయమూర్తులను కూడా తొలగిస్తారు.

Close