-->

భేతాళ కథలు - చంద్రగుప్త ఆదిత్యుడు - ఉజ్జయినీ రాజ్యము - Stories of Bethala - Chandragupta Aditya - Kingdom of Ujjain

Also Readపూర్వకాలము అనగా యిప్పటికి 16 వందల సంవత్సరముల క్రిండట ఉజ్జయినీ నగరాన్ని చంద్రగుప్త ఆదిత్యుడనే రాజు పాలించేవాడు. ఈతనికే చంద్రవర్ణ ఆదిత్యుడని పేరుకూడ ఉండేది.

ఈ ఉజ్జయినీ నగరంలో చిత్రఖరేయను ఒక వేశ్య యుండేది. ఆమె కులమున వేశ్యగా బుట్టినను మంచి శీలము గలిగి ఉండేది. చిత్రరేఖ తల్లి మదన రేఖ కూతురును కులవృత్తిరీత్యా ఆమెకు ఏ మహారాజు చేతనో, చక్రవర్తి అంతటి ధనవంతుని చేతనో కన్నెరికము చేయించి - చిత్ర రేఖను ఒక వేశ్యగా చేయాలని ఆలోచించెడిది.

చిత్రరేఖ మిక్కిలి అందగత్తె. అందుకు తగిన విద్యాబుద్ధులు కూడా ఆమెకు వన్నె దెచ్చినవి. ఆమె గుణగణములు గూర్చి, అందమును గూర్చి ఎందరెందరో మహారాజకుమారులకు తెలిసినది. అందువలన చిత్రరేఖను పెండ్లాడవలయునని, కనీసము ఆమెను తమ రాజాస్థానమున నర్తకిగా చేసుకోవలయుననియు ఉర్రూతలూగేవారు.

చిత్రరేఖ మాత్రం అందుకు సమ్మతించెడిదికాదు. తల్లియగు మదన రేఖ ఆమెను ఉపయోగించుకొని, బాగా ధనము గడించాలని అనుకొనేది. కానీ, చిత్రరేఖ ఈ విషయంలో తల్లిని యెదిరించి, తానొక సంసారిక జీవితమునే గడుపవలెనని నిశ్చయించుకొన్నది. సకల శాస్త్రములు తగిన గురువుల వద్ద అభ్యసించి"చదువుల సరస్వతి"గా విరాజిల్లి నది.

అట్టి సమయంలో ఒకనాడు ఒక బ్రాహ్మణ యువకుడు ప్రయాణము చేయుచూ వచ్చి, చిత్రరేఖ మందిర ప్రాంగణంలో ఆ రాత్రి శయనించినాడు, ఎన్ని రాత్రులనుండియో నిద్రలేక పోవుటవల్లనో ఏమో- రాత్రి నిదురబోయిన ఆ బ్రాహ్మణ యువకుడు సూర్యోదయమైనను ఆ మందిరపు అరుగుమీదనే పండు కొనియున్నాడు.

ఉదయమున దాసీలు ఊడ్చుటకు వచ్చి, ఆతనిని జూచి మదన రేఖకు విన్నవించారు. ఆమె కూతురగు చిత్రరేఖతో వచ్చి- ఆ బ్రాహ్మణ యువకుని చూచినారు. నవమన్మథాకారుడైన ఆతని సోయగమును గాంచి- చిత్రరేఖ ఎంతయో ఆనందించినది, మనసారా ప్రేమించినది.

అందువలన ఆమె కోరికతో, తల్లి మదన రేఖ అతనిని తమ మందిరం లోనికి సేవకులతో చేర్పించి, శీతలోపచారములు చేయించిరి. కొంతసేపటికి వారి ఉపచర్యలవల్ల బ్రాహ్మణ యువకుడు నిద్రనుండి మేల్కొని వారిని గాంచి"ఎవరు మీరు? నేనీ హంసతూలికా తల్పమునకు ఎట్లు వచ్చితిని? నన్నీ విధంగా సేదదీర్చినందులకు మీకెంతయో కృతజ్ఞుడను" అని పలికెను.

ఆ బ్రాహ్మణ యువకునకు మెలకువ వచ్చినప్పటికి, ఆతని ప్రక్కన చిత్రరేఖయే యుండెను. అందువలన ఆమె ఆతనిని జూచి"మహాత్మా! మేమే యిక్కడకు చేర్చితిమి. మీకు 4, 5 రోజులనుండి నిద్రలేకున్నట్లుంది; గాఢంగా నిద్ర పోవుచున్నారు. మీ నిద్రకు భంగం రాకుండా, మీకు ఎట్టి ఆటంకము కలుగకుండా నేను చూచుచున్నాను. నా పేరు చిత్రరేఖ. కులమున వేశ్యను, మీరెవరు? ఏ గ్రామమునుండి వచ్చితిరి ? ఎందులకు వచ్చితిరి ?" అని ఆప్యాయముగా అడిగినది.
అప్పుడా బ్రాహ్మణ యువకుడు-"చిత్రరేఖా, నేను బ్రాహ్మణ వంశమున పుట్టినవాడను. పేరు విద్యాసాగరుడు. పేరులోనే విద్యగలదు కానీ, నాకు ఏ విద్యా సరిగారాదు. అందువలన తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, స్నేహి తులు నన్ను ఎంతో హేళన చేసేవారు. నన్నొక తృణమును జూచినట్లు చూచి, అగౌరపరిచేవారు.

Credit to (భేతాళుడు విక్రమార్కునికి చెప్పిన కథలు) బూరెల సత్యనారాయణమూర్తి

Close