-->

వాటాదారుల సమావేశం - Why are shareholders meetings important?

Also Readసంవత్సరానికొకసారి ప్రతి కంపెనీ తమ వాటాదారులను సమావేశానికి పిలుస్తుంది. దానిని 'వార్షిక సమావేశం' (Annual General Body Meeting) అంటారు.

ఈ వార్షిక సమావేశాన్ని నిర్వహించేముందు కంపెనీ తన లాభనష్టాల నివేదికని, ఆస్తులు, అప్పుల ఖాతాని ఓ పుస్తకం రూపంలో ప్రచురిస్తుంది. ఆ పుస్తకాన్నే ‘వార్షిక నివేదిక' (Annual Report) అంటారు. దీనిలోనే సమావేశం తేదీ, సమయం, సమావేశపు స్థలం లాంటి వివరాలు కూడా ఉంటాయి.

ఆ వివరాలనాధారంగా వాటాదారులు సమావేశానికి హాజరవుతారు. ఆ సమావేశంలో కంపెనీ లాభనష్టాలు, భవిష్యత్ ప్రణాళికలు, రైట్స్ షేర్ల వివరాలు గురించి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చర్చించి తదనుగుణంగా వాటాదారుల అనుమతిని కోరుతారు. వాటాదారులు అంగీకరించాక ఆ మేరకు తీర్మానాన్ని ఖరారు చేస్తారు.

కొన్ని కంపెనీలు సమావేశానికి వచ్చిన తమ వాటాదారులకు ఏదో ఒక కానుకని అందజేస్తాయి. ఓ లెదర్ బ్యాగో, రిస్ట్ వాచో, స్టీల్ కంచమో 'గిఫ్ట్' రూపాన వాటాదారులకు అందుతుంది. అంతేకాక ఫలహారాలు, కాఫీ, వగైరాలు కూడా వాటాదారులు స్వీకరించవచ్చు.

కాబట్టి ఇన్వెస్లర్లు తమకు వచ్చిన వార్షిక నివేదికలను అవతల పడెయ్యకుండా సమావేశానికి తీసుకెళ్ళి కంపెనీ వారికి చూపించి బహుమతులను అందుకోవడం మంచిది.

అయితే ఇక్కడొక ప్రశ్న ఉద్భవిస్తుంది. అదేమిటంటే- చాలామంది ఇన్వెస్టర్లు ఎక్కడో మారుమూల గ్రామాల్లో, చిన్న పట్టణాలలో వుంటారు. కదా! అలాంటప్పుడు వారు నగరాలలో జరిగే సమావేశానికి ఎలా హాజరవగలరు? అని. నిజమే! అలా హాజరు కాలేని వారు ఒక పని చెయ్యొచ్చు! నగరంలో నివసించే తమ బంధువలనో, తెలిసిన వారినో తమతరుపున ఆ కంపెనీ సమావేశానికి హాజరు కమ్మని చెప్పవచ్చు. అందుకు గాను మీరు చేయ్యాల్సింది చాలా తేలిక. వార్షిక నివేదికలో 'ప్రాక్సీ' (ప్రత్యామ్నాయ వ్యక్తి) అనే హెడ్డింగ్తో ఉన్న ఖాళీఫారాలను నింపి, సమావేశ సమయానికి 48 గంటలలోపు కంపెనీవారికి చేరేటట్లుగా పోస్ట్ చేయ్యండి. దాంతో మీ తరపున మీ వ్యక్తి కంపెనీకి హాజరయి కంపెనీ వారిచ్చే బహుమతిని స్వీకరిస్తారు.

కంపెనీ సమావేశంలో మీకు, మీ తరపు వ్యక్తికీ హక్కుల విషయంలో ఎలాంటి తేడా వుండదు. ఒక వాటాదారుడిగా మీకు ఎలాంటి హక్కులు ఉంటాయో, మీ తరపున నియమించబడ్డ వ్యక్తికి కూడా అవే హక్కులు ఉంటాయి. అతడు ఓటింగ్ సరళిలో పాల్గొనవచ్చు. తన అభిప్రాయాలను నిస్సందేహంగా వెలిబుచ్చవచ్చు.

Close