-->

ఆ మాత్రాన స్త్రీ శీలం చెడిపోలేదు - That alone did not spoil the woman's modesty

Also Readస్త్రీల జననాంగం మరీ సంకీర్ణంగా ఉంటుంది. సరిగ్గా పురుషుని వృషణాల ప్రమాణంలో, ఆకారంలో ఆమెకు రెండు అండకోశాలున్నాయి. ఆమె శరీరంలో అవి కండరపు త్రాళ్ళకు వ్రేలాడుతూ ఉంటాయి. ప్రతీ అండకోశానికి చేరువలో సుమారు నాలుగు అంగుళాల పొడవుగా ఉన్న సన్నని అండవాహిక వుంటుంది. అది గర్భాశయంలోకి చొచ్చుకుని ఉం టుంది. అండకోశమూ, అండవాహికా కలిసి ఉండవు. అండవాహిక చివరి భాగం అండకోశం వైపు గరాటువలె తెరచుకుని ఉంటుంది. ఆ గరాటు కొసను వ్రేళ్ళవంటి భాగాలు ఉంటాయి. అవి అండకోశాన్ని చుట్టు ముట్టి వుంటాయి. అండకోశం నుండి అండం విడుదల కాగానే అది తిన్నగా అండవాహికాగ్రాన్ని చేరుకుని, లోపలికి ప్రవేశించి, గర్భకోశం లోకి ప్రవేశిస్తుంది. దాని కనువుగా ఈ అండవాహిక వ్రేళ్ళు ఆ సమ యంలో కదులుతాయి.

గర్భకోశం ఇంచుమించు జీడిమామిడి పండంత ఉంటుంది. కండ ‘రాలతో బిగిసి గట్టిగా వుంటుంది. దాని మెడభాగాన్నే గర్భాశయ కంఠమని (సెర్విక్సు) అంటారు. ఇది బీజవాహిక (వెజీనా)లోనికి తెరచుకొని ఉం టుంది. ఈ బీజవాహిక సుమారు 4-6 అంగుళాల మధ్య పొడవు ఉం టుంది. ఈ బీజవాహిక అడుగు ద్వారం యోని లోకి తెరచుకునివుంటుంది. దానిని అంతరాధరాలని చెప్పబడే రెండు చర్మపు మడతలు మూసి వుంచి రక్షిస్తాయి.

కన్నెపొర

సరిగ్గా ఈ మడతల దిగువ బీజవాహిక ముఖద్వారాన్ని వరకు మూసి ఉంచే పొర ఒకటి ఉంటుంది. దానికే “కన్నెపొర” (హైమెన్) అని పేరు. దీనికి మధ్యగా చిన్న కన్నం ఉంటుంది. ఈ కన్నం ద్వారా గర్భాశయ స్రావాలు, బీజవాహిక స్రావాలు ఆమె శరీరంలోంచి బయటకు పోతాయి.
ఈ కన్నెపొర సవ్యంగా ఉంటే ఆ స్త్రీ కన్యాత్వం చెడలేదని ప్రపంచ జాతులన్నీ విశ్వసిస్తున్నాయి. కనుక దీనికి అర్హత లేని ప్రాధాన్యత వచ్చేసింది. స్త్రీల కన్యాత్వానికీ, కన్నెపొరకూ సంబంధం లేదన్న సత్యాన్ని ఇటీవల పరిశోధకులు గమనించారు. పురుష సంపర్కమంటే ఏమిటో యెరుగని చాలా మంది కన్యలకు పుట్టుక నుంచీ కన్నెపొరలేదు. మరి కొందరికి తొమ్మిది నెలలూ నిండి పురుడు వచ్చే దాకా కన్నెపొర చెక్కు చెదర కుండా ఉండటమూ గమనించారు. కన్నెపొర రాయిలా ఉన్నప్పుడు రతి దానిపైనే జరుగుతుంది. కనుక వీర్యం అక్కడే విడుదలవుతుంది. దాని రంధ్రం గుండా వీర్యకణాలు బీజవాహికలో ప్రవేశించి, అక్కడ నుండి గర్భాశయం గుండా అండవాహికల లోకి ప్రవేశించి గర్భాన్ని కలిగి స్తున్నాయి. కనుక కన్నెపొర లేనంత మాత్రాన స్త్రీ శీలం చెడిపోనట్లుకాదు.
కన్నెపొర చాలా మందంగా ఉన్న అమ్మాయిలు శోభనం నాడు రాత్రి అంగప్రవేశం కాక యమయాతన పడతారు. ఆ బాధను చూడలేక పుంసత్వం పోగొట్టుకున్న భర్తలు ఉన్నారు. కామాతురులై ఆమె బాధ కూడా పరిగణించకుండా తీవ్రమైన ఆఘాతాల నిచ్చి ఆమెను హడల గొట్టిన వాళ్ళూ ఉన్నారు. కొందరికి కన్నెపొరతో బాటు యోని కూడా చిరిగి పోవటం జరిగింది. కొందరమ్మాయిలకు యోని ఆకస్మిక సంకోచం (Vaginismus)ఏర్పడి, రతికి పనికి రాకుండా పోయారు.
కనుక ఆమె కన్నెపొర స్థాయిని డాక్టరు పరీక్షించకుండా ఏ పిల్ల.. జీవితం ఏమవుతుందో చెప్పలేడు. కనుక బుద్ధిమంతులైన తలిదండ్రులు శోభనం నాడు ఈ రకం ప్రమాదం తమ ఆడబిడ్డలకు రాకుండా కాపాడు కోవటం కోసం పెళ్ళికి ముందే వైద్య పరీక్ష చేయించి అవసరమైతే ఆ కన్నెపొరసు శస్త్రం ద్వారా తొలగింపచేయటం అవసరం. చాలా ఆటవిక సమాజాలు ఈ విషయంలో యెంతో నాగరికంగా ఉన్నాయి. తొలిరతికి ముందే ఈ కన్నెపొరను అవి తొలగింపచేస్తున్నాయి. అండకణాలు
అండకోశానికి, వృషణానికి గొప్ప తేడా వుంది; వృషణంలో జీపకణాలు నిత్యమూ తయారవుతూనే వుంటాయి. కాని, స్త్రీ పుట్టినప్పుడే ఆమె అండంలో ఉండవలసిన జీవకణాలన్నీ వుంటాయి. ఇవి మళ్ళీ మళ్ళీ తయారు కావు. ప్రతీ అండకోశం లోనూ సుమారు ముప్పయి ఆరు వేల అండకణాలు ఉంటాయి. నిజంగా అవన్నీ పొదగబడితే ప్రతి స్త్రీ డబ్బయి రెండు వేల మంది పిల్లల్ని కనగలదన్న మాట! కాని వాటిలో నెలకు ఒక కణం కన్నా విడుదల కావటం జరగదు. ఆ లెబన సంవ త్సరానికి పదమూడు గుడ్లే విడుదలవుతాయి. ఆమె గర్భాన్ని ధరించిన తర్వాత ఏడాదివరకూ గుడ్లు విడుదలకావు సకృత్తుగా రెండు మూడు గ్రుడ్లు విడుదలయ్యే స్త్రీలు కూడా ఉన్నారు. వారికి ఒకే కాన్పులో ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టటం జరుగుతుంది.

ఫలదీకరణం

గర్భోత్పత్తి జరగటానికి గాను అండాన్ని ఒక్క వీర్యకణం పొదిగితే చాలు. ఒకే అండాన్ని ఒక దానికన్నా ఎక్కువ వీర్యకణాలు పొదగటం సాధ్యమయ్యే పనికాదు. వీర్యకణాలు బీజవాహిక నుండి అండవాహికలోకి తమ తోకల్ని వేగంగా కదిలిస్తూ ప్రవేశిస్తాయి. ఈ అండవాహికల గోడలు సంకోచవ్యాకోచాలను సాగిస్తూ అందున్న అండాన్ని వీర్యకణాల వైపు నెట్టుతాయి.

Close