-->

షేర్ల సమాచారాన్ని సేకరించటం ఎలా? - How do collect information on shares?

Also Read


అసలు 'సమాచారాన్ని ఎక్కడ్నుంచి సేకరించాలన్నది చాలా మందికి అంతుపట్టని ప్రశ్న. సమాచారాన్ని సేకరించటానికిచాలా పద్ధతులున్నాయి. వాటిని దిగువన ఇస్తున్నాం.

1. బిజినెస్ న్యూస్ పేపర్లు : మామూలు దినపత్రికల్లాగే వ్యాపార దినపత్రికలైన బిజినెస్ స్టాండర్డ్, ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లాంటి వాటిలో రకరకాల వార్తలు, విశేషాలు వుంటాయి. ఒక్కో వార్త దేశ ఆర్థిక పరిస్థితిపైన, పరిశ్రమలపైన చూపించే ప్రభావాన్ని గుర్తించగలగాలి. అందకు అనుగుణంగా మనం నిర్ణయాలు తీసుకోగలగాలి.

2. బిజినెన్ పత్రికలు : బిజినెస్ వరల్డ్, బిజినెస్ ఇండియా, బిజినెస్టుడే, మనీ, కాపిటల్ మార్కెట్, దలాల్ స్ట్రీట్ లాంటి పత్రికలు ఈ కోవకు చెందినవి. ఇవి ఆయా పరిశ్రమ, కంపెనీల పనితీరుని సమీక్షిస్తుంటాయి. ఈ పత్రికల విశ్లేషణని బట్టి మనకు కంపెనీలపైన ఓ ఖచ్చిత అభిప్రాయం ఏర్పడుతుంది.

3. కంపెనీ వార్షిక నివేదికలు : పై పత్రికలే కాకుండా ప్రతి సంవత్సరం కంపెనీలు తమ కార్యకలాపాలు, లాభనష్టాల వివరాలను తమ వార్షిక నివేదికలలో పేర్కొంటాయి. వాటిని కామర్స్ లైబ్రరీలలో, స్థానిక ఎక్సేంజిలలోనూ పొందవచ్చు.

4. న్యూస్ లెటర్స్ : కొన్ని ప్రచురణ సంస్థలు తమ రిసెర్చి టీమ్ పరిశోధనలతో ఏయే షేర్లని కొనాలో రికమెండ్ చేస్తుంటాయి. ఇవి క్లుప్తంగా, సూటిగా విషయాన్ని సూచిస్తాయి. వీటి ఆధారంగా కూడా ఇన్వెస్టర్లు నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే ఈ న్యూస్ లెటర్ల ఆధారంగా షేర్లు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పుకార్లు, గాసిప్స్ ఆధారంతో సూచించిన షేర్లు కాకుండా దీర్ఘకాల దృష్టితో హేతుబద్దమైన షేర్లని గురించి మాత్రమే వారు ఇస్తే, ఇన్వెస్టర్లు ఆయా లెటర్స్ని ఆదరించడం మంచిది.
5. ఇంటర్నెట్లో వెబ్ సైట్లు : ప్రస్తుత రోజుల్లో షేర్ల గురించి, కంపెనీ గురించి ఇంటర్నెట్లో ఎన్నో అద్భుత వెబ్సైట్లు వెలిశాయి. ఎప్పటి సమాచారం అప్పుడు ఇంటర్నెట్లో దొరకడం వల్ల అవి ప్రసిద్ధిపొందాయి. ఈ పుస్తకం అనుబంధంలో అలాంటి ప్రసిద్ధిగాంచిన వెబ్సైట్లను కొన్ని ఇచ్చాం చూడండి.

6. బ్రోకర్లు : మనకోసం షేర్లుకొనే బ్రోకరు సలహాలు కూడా మనం తీసుకోవచ్చు. అయితే షేర్ల గురించి కనీస అవగాహన లేని వారు మటుకు పూర్తిగా బ్రోకర్ మీద ఆధారపడక తప్పదు. ఏది ఏమైనా బ్రోకర్ ఇచ్చే సలహాలు సాధారణంగా చెవులకు సోకిన వార్తలు, పుకార్లు, గాలికబుర్ల ఆధారంగా వుండే అవకాశం ఎక్కువ.

7. ఇతర ఆధారాలు : మీకు తెలిసిన మిత్రుడో, బంధువో, పక్కింటివాళ్ళో కూడా సలహాలు ఇవ్వవచ్చు. లేదా ఏదైనా కంపెనీల్లో పనిచేసే మీ సన్నిహితులు తమ కంపెనీ షేర్లని కొనుక్కోమని సలహాలు ఇవ్వవచ్చు. అయితే అలాంటి వారి సలహాలు పాటించేముందు, ఆయా షేర్లని గురించి కనీస పరిజ్ఞానం కలిగి వుండి మీ దృష్టిలో అవి హేతుబద్ధమైనవి అవునో కాదో తేల్చుకొని పెట్టుబడి పెట్టండి.

Close