-->

ఆర్ధిక వృద్ధికి ఆర్ధికాభివృద్ధికి తేడాను వివరించండి? - Explain the difference between economic growth and economic development?

Also Readస్వాతంత్ర్యోద్యమ సమయంలో పరిస్థితులు అవగాహన చేసుకున్న పిమ్మట మనదేశానికి ఏది అవసరమో పునరాలోచన చెయ్యాలి. దేశంలో ప్రజల ఆదాయ స్థాయిని జీవన ప్రమాణ స్థాయిని పేదరిక నిర్మూలనను చేపట్ట వలసిన ఆవశ్యకత ఉంది. ఆర్థికాభివృద్ధి చేపట్టడం ద్వారా వీటిని సాధించవచ్చును. దీర్ఘకాలంపాటు నిజతలసరి ఆదాయంలో పెరుగుదలను ఆర్ధికవృద్ధి అంటారు. నిజ ఆదాయం అనగా వస్తుసేవల రూపంలో ఉండే ఆదాయం అని అర్ధము. మొత్తం ఆదాయాన్ని మొత్తం జనాభాతో భాగించగా వస్తుంది, తలసరి ఆదాయం కాబట్టి దీర్ఘకాలంపాటు వస్తు సేవల రూపంలో గోచరించే తలసరి ఆదాయంలో పెరుగుదలను ఆర్ధిక వృద్ధి అంటారు.

ఆర్ధికాభివృద్ధి, ఆర్ధిక వృద్ధి కన్నా విస్తృతమైంది. ఇది వస్తు సేవల పెరుగుదలతో పాటు, ఆదాయ అసమానతల తగ్గుదల, పేదరిక నిర్మూలన కూడా సూచిస్తుంది. భారత రాజ్య నిర్మాతలు దేశం ఆర్థికాభివృద్ధి చెందాలని ఆశించారు. దీనిని సాధించడానికి దేశజాతీయోత్పత్తి నిరంతరంగా పెరగడంతో పాటు ప్రజల నుండి అనుకూల స్పందన రావాలి. ఆర్ధిక వ్యవస్థలో వస్తురాశి పెరగాలంటే, ఉత్పత్తి పెరగాలి. దేశంలోని వనరుల వినియోగం పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది. యంత్రాలు, యంత్ర పరికరాలు, సామాగ్రి తయారు చేయడానికి శ్రామిక శక్తి అవసరం. యంత్రాలను, పరికరాలను మూలధన పెట్టుబడి అంటారు. ఇటువంటి పెట్టుబడి ఆర్ధిక వ్యవస్థకు అవసరం.

దేశంలో వస్తూత్పత్తి పెరుగుదల దేశ జనాభా పెరుగుదల రేటు కన్నా అధికంగా ఉన్నప్పుడే తలసరి ఆదాయ స్థాయి పెరుగుతుంది. ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. ధనిక, పేద వర్గాల మధ్య వ్యత్యాసం కూడా తగ్గుతుంది. అసమానతలు సమసిపోతాయి. ఒకసారి ఆర్ధికాభివృద్ధి మొదలయితే ఇతర అభిలషణీయ మార్పులు వాటంతటవే చోటు చేసుకుంటాయి. సాంకేతికాభివృద్ధి జరుగుతుంది. ఉత్పాదకత పెరుగుతుంది. పారిశ్రామికంగా కీలక పాత్ర వహిస్తుంది. ఒకవేళ ఉత్పాదకతలో మార్పులు, సాంకేతిక ప్రగతి పట్టణాలకు మాత్రమే పరిమిత మయితే దానిని ఆర్ధికాభివృద్ధి అనలేము.

ఈ విధంగా ఆర్థికాభివృద్ధి తలసరి ఆదాయాల పెరుగుదలను ఆదాయ అసమానతల తగ్గుదలను మెరుగైన జీవన పరిస్థితులను సూచిస్తుంది. దేశంలో లభించే వివిధ వస్తు సేవల లభ్యత, నాణ్యతలను బట్టి జీవన ప్రమాణం ప్రభావితమవుతుంది. ఈ విధంగా త్రాగునీటి సౌకర్యాలు, అక్షరాస్యతలో పెరుగుదల, తపాలా సౌకర్యాలు, రోడ్ల సదుపాయాలు మొదలయినవి అన్నీ ఆర్ధికాభివృద్ధి ద్వారా ప్రభావితమై ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని కల్పిస్తాయి.

Close