-->

భారతదేశంలో ఖనిజ వనరులు - Indian Geography

Also Read

భారతదేశంలో ఖనిజ వనరులు

భూపటల శిలల్లో లభించే ఖనిజాలు పారిశ్రామికాభివృద్ధికి మూలాధారం. ఖనిజాల సమాహారమే శిలలు. భారతదేశంలో ఫెర్రస్ లోహ ఖనిజాల యిన ఇనుప ధాతువు, మాంగనీస్, బాక్సైట్ అపారంగా . , లభిస్తున్నాయి. కానీ నాన్ ఫెర్రస్ లోహాలైన రాగి, సీసం, జింక్ ధాతువుల నిల్వల లోటు ఉంది. వీటిని పెద్ద మొత్తాల్లో దిగుమతి చేసుకుంటున్నాం. 
ఖనిజ ఇంధనాలు రెండు రకాలు. అవి 
  • 1) శిలాజ ఇంధనాలు
  • 2) అణు ఇంధనాలు.
బొగ్గు, చమురు, సహజవాయువు శిలాజ ఇంధనాల తరగతికి చెందుతాయి. యురేనియం, థోరియం, ప్లుటోనియం, రేడియం మొదలైనవి అణు ఇంధనాలు. భారత దేశంలో బొగ్గు నిల్వలు విస్తారంగా ఉన్నాయి. కానీ చమురు -సహజ వాయువు నిల్వలు స్వల్పమే. ఇక అణు ఇంధనాల విషయానికొస్తే యురేనియం నిల్వలు చెప్పుకోదగిన స్థాయిలో ఉండగా థోరియం నిల్వలు అపారంగా ఉన్నాయి. బంగారం, వెండి, వజ్రాల వంటి విలువైన ఖనిజాల నిల్వలు చాలా తక్కువ పరిమాణంలో ఉన్నాయి. అలోహ ఖనిజాలైన సున్నపురాయి, డోలమైట్, ఆస్బెస్టాస్, బెరైటీస్ వంటి ధాతువుల నిల్వలు చెప్పుకోత గ్గ స్థాయిలో ఉన్నాయి.

ఇనుము:

హెమటైట్, మాగ్నటైట్, లిమొనైట్, సైడిరైటులు ముఖ్యమైన ఇనుపధాతువు రకాలు. భారతదేశంలో మేలిరకం హెమటైట్, మాగ్నటైట్ నిల్వలు విస్తారంగా ఉన్నాయి. ఇవి ప్రధానంగా జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీ గఢ్, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. జార్ఖండ్ లోని నవముండి, ఒరిస్సాలోని గురు మహ సాని, ఛత్తీస్ గఢ్ లోని బైలడిల, కర్ణాటకలోని బళ్లారి-హోస్పేట్ మండలం, గోవాలోని బిచోలిమ్ ముఖ్యమైన ఇనుప ధాతువు ఉత్పత్తి కేంద్రాలు. ,

మాంగనీస్:

పైరోల్యూసైట్ ముఖ్యమైన మాంగనీస్ ధాతువు. మాంగనీస్ నిల్వలు ప్రధానంగా కర్ణాటక రాష్ట్రంలోని హసన్, చిక్ మగలూరు, చిత్రదుర్గ జిల్లాల్లోనూ, మధ్యప్రదేశ్-మహరాష్ట్రల్లో విస్తరించిన బాలాఘాట్ - బాంద్రా మండలంలోనూ విస్తరించి ఉన్నాయి. బాక్సైట్, అల్యూమినియం ధాతువు. బాక్సైట్ నిల్వలు ద్వీపకల్ప భారతదేశంలోని ఎత్తయిన పీఠభూములు, కొండల శిఖరాల మీద విస్తరించి ఉన్నాయి. చోటా నాగపూర్ పీఠభూమిలోని కొడర్మా ప్రాంతం, మధ్యప్రదేశ్ లోని మైకాల పీఠభూమి, తూర్పు కనుమల్లో ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాల్లో బాక్సైట్ ను ప్రధానంగా వెలికి తీస్తున్నారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు కనుమల్లో కూడా బాక్సైట్ నిల్వలు విస్తారంగా ఉన్నాయి. ఇక్కడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ వెలికితీతకు ఇటీవలే ప్రభుత్వం అనుమతినిచ్చింది.

రాగి:

క్యుప్రెట్ మేలిరకం రాగి ధాతువు. భారత దేశ రాగి నిల్వలు నాసిరకం చాల్కో ప్రెట్ తరగతికి చెందినవి. ఇవి ప్రధానంగా జార్ఖండ్, రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్ లో విస్తరించి ఉన్నాయి. ఖేత్రి(రాజస్థాన్), మలాజ్ ఖండ్ (మధ్యప్రదేశ్), రక్కా (జార్ఖండ్) ముఖ్యమైన రాగి గనుల కేంద్రాలు. సీసం, జింక్ నిల్వలు సాధారణంగా ఒకే ప్రాంతంలో లభిస్తాయి. రాజస్థాన్‌లో జావార్, దరీబాయి ప్రధాన గనుల కేంద్రాలు.

బంగారం:

బంగారం నిల్వలు ప్రధానంగా కర్ణాటకలోని కోలార్ హట్టి ప్రాంతంలో క్వార్టైట్ శిలల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో కేన్ నది ఒడ్డున ఉన్న 'పన్నా' దేశంలోని ఏకైక వజ్రాల గనుల కేంద్రం.

బొగ్గు:

బొగ్గు నిల్వలను వాటిలోని కర్బన శాతాన్ని అనుసరించి నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. 
అవి.. 
  • 1) ఆంధ్రసైట్, 
  • 2) బిట్యూమినస్ ,
  • 3) లిగ్నైట్, 
  • 4) పీట్. 
మొదటి రెండు మేలిరకం నిల్వలు. భారతదేశంలో బొగ్గు నిల్వలు ప్రధానంగా బిట్యూమినస్, లిగ్నైట్ తరగతికి చెందినవి. తమిళనాడులోని నైవేలి ప్రధాన లిగ్నైట్ బొగ్గు గనుల కేంద్రం. బిట్యూమినస్ బొగ్గు నిల్వలు పశ్చిమబెంగాల్, జార్ఖండ్ లో విస్తరించిన దామోదర్ లోయ, ఒరిస్సా, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లలో విస్తరించిన మహానది-సోన్ నదీ లోయ, ఆం ధ్రప్రదేశ్-మహరాష్ట్రల్లోని గోదావరి-వార్ధా లోయల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. జార్ఖండ్ లోని ఝరియా, గిర్ది, ధన్‌బాద్, పశ్చిమబెంగాల్ లోని రాణిగంజ్, ఒరిస్సాలోని టాల్చెర్, ఛత్తీస్ గఢ్ లోని కోర్బా, మహరాష్ట్రలోని చంద్రపూర్, బలార్ష, ఆంధ్రప్రదేశ్ లోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, సత్తు పల్లి, భూపాలపల్లి, గోదావరిఖని, మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ మొదలైనవి ముఖ్యమైన బొగ్గు గనుల కేంద్రాలు. జార్ఖండ్ లోని జాడుగుడి ప్రధానమైన యురేనియం గనుల కేంద్రం. ఆంధ్రప్రదేశ్ లోని కడప, నల్గొండ జిల్లాల్లో యురేనియం వెలికితీతకు సన్నాహాలు చేస్తున్నారు. కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా తీరాల్లోని అపారమైన మోనజైటు నిల్వల్లో యురేనియం, థోరియం ధాతువులు లభిస్తాయి. వీటి వెలికితీత ఇంకా ప్రారంభం కాలేదు.

Close