-->

భారతదేశం... శీతోష్ణస్థితి - Climate of India

Also Read

భారతదేశం... శీతోష్ణస్థితి

భారతదేశ శీతోష్ణస్థితిలో ప్రతి రెండు నెలలకు ఒకసారి గుణాత్మక మార్పులు సంభవిస్తాయి. రుతుపవన పూర్వకాలాన్ని నడివేసవిగా పరి గణిస్తాం. రుతు పవన కాలంలో మాత్రం దేశమంతటా వర్షాలు విస్తా రంగా కురుస్తాయి. దేశంలోని చిరపుంజి, మాసిన్రామ్ లలో అత్యధిక వర్షపాతం కురిస్తే... ధార్, కట్స్ లో అత్యల్ప వర్షపాతం నమోదవు తోంది!!
రుతుపవన ప్రక్రియ చాలా సంక్లిష్టమైంది. రుతుపవన ప్రక్రియ ఆవిర్భావాన్ని కింది సిద్ధాంతాల ద్వారా వివరించవచ్చు. అవి :
 • ఎ) థర్మల్ సిద్ధాంతం 
 • బి) ప్లాన్ సిద్ధాంతం 
 • సి) జెట్ స్ట్రీం సిద్ధాంతం 
 • డి) టిబెటన్ హీట్ ఇంజిన్ సిద్ధాంతం 
 • ఇ) ఎల్ నినో సిద్ధాంతం 
 • ఎఫ్) ఈక్వినో, ఐఓడీ దృక్పథం
ఈ థర్మల్ సిద్ధాంతం ప్రకారం... నైరుతి రుతుపవనాలు సముద్ర పవ నాల వంటివి. ఖండ-సముద్ర భాగాల ఉష్ణ ప్రవర్తనలో వ్యత్యాసం వల్ల ఏర్పడతాయి. నైరుతి రుతుపవనాలను భారత ఉపఖండంలోకి ఆకర్షించే అల్పపీడన మండలం వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏర్పడిందని ఈ సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది. ప్లాన్ సిద్ధాంతం ప్రకారం ఆగ్నేయ రుతుపవనాలు దక్షిణాసియా ప్రాంతంలో రూపాంతరం చెంది.. నైరుతి రుతుపవనాలుగా భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. భూమధ్యరేఖా అల్పపీడన మండలం సూర్యుడి సాపేక్ష గమనం వల్ల కర్కటక రేఖ వద్దకు స్థానభ్రంశం చెంది నైరుతి రుతుపవనాలను ఆకర్షిస్తుంది. వేసవి కాలంలో టిబెటన్ పీఠభూమి దాదాపు కొలిమిగా మారుతుంది. పర్వత పరివేష్టిత పీఠభూమి కావటంతో ఇక్కడ ఉపరి తల ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి. దీంతో టిబెటన్ పీఠభూమి నుంచి సంవాహన వాయువులు దక్షిణంగా వీచి దక్షిణ హిందూ మహాసముద్రంలో అవనతం చెందుతాయి. దాంతో దక్షిణ హిందూ మహాసముద్రంలో అధిక పీడనం ఏర్పడుతుంది. దక్షిణ హిందూ మహాసముద్రానికి వాయువ్య భారతదేశానికి మధ్య పీడనా ప్రవణత ఏర్పడటంలో దక్షిణ హిందూ మహాసముద్రం నుంచి కవోష్ణ ఆర్థ పవనాలు భారతదేశంలోనికి ప్రవేశిస్తాయి. ఉప ఆయనరేఖా పశ్చిమ జెట్ స్ట్రీం జూన్ మొదటివారంలో హిమాలయాలకు ఉత్తరంగా స్థానభ్రంశం చెందటం వల్ల నైరుతి రుతుపవనాలు ఉధృతంగా భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. ఆఫ్రికా తూర్పు తీరంలో ఉన్న సోమాలియా నుంచి అరేబియా సముద్రం మీదుగా.. కేరళ తీరం వైపు వీచే సోమాలియా నిమ్న స్థాయి జెట్ స్ట్రీం నైరుతి రుతుపవనాలను బలోపేతం చేస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్ నినో సాధారణంగా నైరుతి రుతుపవనాలను బలహీనం చేస్తుందని వాతా వరణ నిపుణుల అభిప్రాయం. ఈ కారణంతోనే రుతుపవనాల భవి ష్యత్తు నమూనాలో ఎల్ నినో చలనరాశులకు పెద్దపీట వేయటం జరి గింది. అయితే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇటీవల ఎల్ నినో నైరుతి రుతు పవన వ్యవస్థల మధ్య సంబంధం బలహీనపడుతున్నట్లు శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. భూమధ్యరేఖా హిందూ మహాసముద్రంలో పీడనంలో అకస్మాత్తుగా సంభవిస్తున్న మార్పులు, సముద్ర ప్రవాహాలలో సంభ విస్తున్న మార్పులు నైరుతి రుతుపవనాలను ప్రభావితం చేస్తున్నా యని శాస్త్రజ్ఞులు ధ్రువీకరించారు. అందువల్ల ఇటీవల రుతుపవన భవిష్యత్తు నమూనాలో సమూల మార్పులు చేశారు.

ఆయనరేఖా రుతుపవన శీతోష్ణస్థితి : 

భారతదేశం వైవిధ్య శీతోష్ణస్థితిని కలిగి ఉంది. స్థూలంగా భారతదేశ శీతోష్ణస్థితిని 'ఆయనరేఖా రుతుపవన శీతోష్ణస్థితి'గా అభివర్ణిస్తారు. ఇక్కడ సంవత్సరాన్ని ఆరురుతువులుగా విభజించడం సంప్రదాయం. అంటే.. ప్రతి రెండు నెలలకొకసారి శీతోష్ణస్థితిలో గుణాత్మక మార్పులు సంభవిస్తాయన్నమాట! అయితే శాస్త్రీయంగా భారతదేశ శీతోష్ణస్థితి సంవత్సరాన్ని నాలుగు రుతువులుగా విభజిస్తారు. అవి : రుతుపవన పూర్వకాలాన్ని నడివేసవిగా పరిగణిస్తాం. ఈ కాలంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా ఉంటాయి. ముఖ్యంగా వాయువ్య భార తదేశం, దక్కన్ పీఠభూమి అంతర్భాగాల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టం గా 45°Cలకు పైగా నమోదవుతాయి. ఈ కాలంలో సంవాహన ప్రక్రియ వల్ల మధ్యాహ్నం గాలిదుమ్ములు, చిరుజల్లులతో కూడిన స్థానిక పవనాలు వీస్తాయి. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకు ఆంధీలు (ఉత్తరప్రదేశ్), లూ (పంజాబ్, హర్యానా), కాల్ బైశాఖి (బీహార్, ప. బెంగాల్), మామిడి జల్లులు (దక్షిణ భారతదేశం). నైరుతి రుతుపవన కాలంలో భారతదేశమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. సంవత్సర సగటు వర్షపాతంలో సుమారు మూడింట రెండొంతులు ఈ నాలుగు నెలల కాలంలోనే కురుస్తాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వీచే ఆర్ధ రుతుపవనాలు విస్తారంగా వర్షాన్నిస్తాయి. పశ్చిమ తీరమైదానం, దక్షిణ షిల్లాంగ్ పీఠభూమి ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం కురుస్తుంది. ఇక్కడ సగటు వర్షపాతం 250 సెం.మీ.కు పైగా ఉంటుంది. ఈ మండలానికి చెందిన చిరపుంజి, మాసి రామ్ లో ప్రపంచంలోకెల్లా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఈ కాలం వర్షపాత విస్తరణలో ప్రాంతీయ అసమా నతలు స్పష్టంగా కనిపి స్తాయి. సహ్యాద్రి కొండలకు పవన పరాన్ముఖ దిశలో ఉన్న దక్కన్ పీఠభూమి అంతర్భాగాల్లో వర్షపాతం 50-70 సెం.మీ. మధ్యలో ఉంటుంది. ఇది వర్షచ్ఛాయా ప్రాంతం కావటంతో పాక్షిక శుష్క మండలంగా ఏర్పడింది. ఆరావళి పర్వతాలకు పశ్చిమంగా ఉన్న పశ్చిమ రాజస్థాన్ (థార్), ఉత్తర గుజరాత్ (కచ్) ప్రాంతాల్లో వర్షపాతం అత్య ల్పంగా (30 సెం.మీ. కన్నా తక్కువగా) నమోదవుతుంది. ఆరావళి పర్వతాలు నైరుతి రుతుపవనాలకు సమాంతరంగా ఉండటంతో పర్వ తీయ వర్షపాతం సాధ్యంకాదు. సహజంగా ఉండే అస్థిరత కారణంగా నైరుతి రుతుపవనాలు ఈ ప్రాంతంలో ఉద్ఘాతనం చెందటానికి ప్రయ త్నించినప్పటికీ, వాటిని ఊర్ధ్వ ట్రోపో ఆవరణంలోని శీతల స్థిర వాయురాశులు అడ్డుకుంటాయి. దీంతో పశ్చిమ రాజస్థాన్ ప్రాంతం అల్ప వర్షపాతం కురిసి ఎడారిగా మారిపోయింది. నైరుతి రుతుపవ నాలు భారతదేశ ప్రధాన భూభాగాన్ని మొదటగా జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకుతాయి. ఇవి మొత్తం భారతదేశంలో విస్తరించటానికి సుమారు 45 రోజులు పడుతుంది.

రుతుపవనాల తిరోగమనం :

సెప్టెంబర్ 15కల్లా భారతదేశం నుంచి నైరుతి రుతుపవనాల తిరోగ మనం ప్రారంభమవుతుంది. తిరోగమన రుతుపవనాలు శీతల శుష్క ఖండ వాయురాశులతో కూడి ఉంటాయి. ఇవి బంగాళాఖాతం మీదకు రాగానే సముద్ర నీటి ఆవిరిని పీల్చుకొని ఆర్ధంగా తయారవుతాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఈశాన్య వ్యాపార పవనాలు బలంగా వీస్తుంటాయి. ఈశాన్య వ్యాపార పవనాల ప్రభావం వల్ల తిరోగమన రుతుపవనాలు, ఈశాన్య రుతుపవనాల రూపంలో తమిళ నాడు, దక్షిణ కోస్తా ఆంధ్ర తీరాన్ని తాకుతాయి. ఈ ప్రాంతంలో వీటి ప్రభావం వల్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈ కాలంలో భారత దేశ మంతటా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతాయి. ముఖ్యంగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు ఉత్తర, వాయువ్య భారతదేశంలో 10°C కన్నా తక్కువగా ఉంటాయి. హిమాలయ ప్రాంతంలో మంచు విస్తారంగా కురుస్తుంది. మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం ప్రాంతాల నుంచి బలహీనమైన కవోష్ణ సమశీతోష్ణ మండల చక్రవాతాలు, పశ్చిమ పవ నాల ప్రభావం వల్ల వాయువ్య భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. వీటి ప్రభావం వల్ల పంజాబ్, హర్యానా, రాజస్థాన్, జమ్ముకాశ్మీర్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో జల్లులు కురుస్తాయి. వీటిని పశ్చిమ అలజ డులుగా పిలుస్తారు. ఇవి భారతదేశంలోనికి ప్రవేశించటంలో ఉప ఆయన రేఖా పశ్చిమ జెట్ స్ట్రీం కీలక పాత్ర పోషిస్తుంది. ఇదే కాలం లో.. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే స్థానిక అల్పపీడన ద్రోణులు మరింత తీవ్రమై వాయుగుండాలు తుపానులుగా రూపాంతరం చెంది భారతదేశ తూర్పు తీరాన్ని తాకుతాయి. వీటి ప్రభావం వల్ల తూర్పు తీరంలో నవంబర్, డిసెంబర్ లో వర్షాలు కురు స్తాయి. జనవరికల్లా ఈశాన్య రుతుపవనాలు కూడా బలహీన పడతాయి. జనవరి-మార్చి మధ్య కాలంలో వాతావరణం అనిశ్చితంగా ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత, వర్షపాతం, పవన దిశలు క్రమబద్ధమైన రీతిలో ఉండవు. జనవరి నుంచి సూర్యుడి సాపేక్ష గమనం ఉత్తరార్ధ గోళం దిశగా ప్రారంభమవుతుంది. దాంతో భారతదేశంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగు తాయి. ఈ కాలంలో భారతదేశంలో పవనాలు ఒక స్థిరమైన దిశలో వీచవు. మొత్తం మీద దేశమంతటా సమశీతోష్ణ ఆహ్లాద కరమైన వాతావరణం ఉంటుంది.

రుతుపవననాలు :

భారతదేశపు వాతావరణాన్ని సంవత్సరం పొడవునా రుతుపవ నాలు ప్రభావితం చేస్తాయి. దక్షిణ హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిమ్న ట్రోపో ఆవరణంలో ఏర్పడే విశిష్టమైన పవన వ్యవస్థను రుతు పవన వ్యవస్థగా అభివర్ణిస్తారు. ఇది దక్షిణా సియా, ఆగ్నేయాసియా ప్రాంతాల శీతోష్ణస్థితిపై ప్రభావితం చూపిస్తుంది. శీతాకాలంలో భారత ఉపఖండంపై విస్తరించి ఉన్న శీతల,శుష్క ఖండ వాయురాశిని జూన్-సెప్టెంబర్ మధ్య కాలంలో కవోష్ణ, ఆర్ద్ర సముద్ర వాయురాశి స్థానభ్రంశం చెంది స్తుంది. శీతాకాలంలో ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పవనాల స్థానంలో జూన్-సెప్టెంబర్ మధ్య కాలంలో నైరుతి దిశ నుంచి పవనాలు వీస్తాయి. ఈ దృగ్విషయాన్నే రుతుపవన వ్యవస్థ అంటారు.

రుతుపవనాలు-ముఖ్య లక్షణాలు :

 • రుతువులననుసరించి పవన దిశలో సుమారు 180 డిగ్రీల మార్పు 
 • వేసవి, శీతాకాలాల్లో పరస్పర విరుద్ధ లక్షణాలు గల వాయురాశులు 
 • అకస్మాత్తుగా ప్రవేశించడం 
 • క్రమపద్ధతిలో దేశమంతటా విస్తరించడం 
 • క్రమపద్ధతిలో తిరోగమించడం 
 • అనిశ్చితత్వం 
 1. ఎ) రుతుపవన పూర్వకాలం  (మార్చి 15 నుంచి జూన్ 15) 
 2. బి) నైరుతి రుతుపవన కాలం   (జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15) 
 3. సి) ఈశాన్య రుతుపవన కాలం (సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 15) 
 4. డి) రుతుపవన అనంతర కాలం (డిసెంబర్ 15 నుంచి మార్చి 15)
 • భారతదేశ వాతావరణాన్ని విశేషంగా ప్రభావితం చేసేది? రుతుపవనాలు
 • నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని ఎప్పుడు తాకుతాయి ? జూన్ మొదటివారంలో

పశ్చిమ అలజడులు అంటే.. ? 

మధ్యదరా, ఎర్ర సముద్ర ప్రాంతాల నుంచి బలహీనమైన కవోష్ణ సమశీతోష్ణ మండల చక్రవాతాలు, పశ్చిమ పవనాల ప్రభావం వల్ల వాయువ్య భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. వీటి ప్రభావం వల్లపంజాబ్, హర్యానా, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో జల్లులు కురుస్తాయి. వీటినే పశ్చిమ అలజడులు అంటారు.
 • ఏ మార్పులు నైరుతి రుతు పవనాలను ప్రభావితం చేస్తున్నట్టు శాస్త్రజ్ఞులు ధ్రువీకరించారు ?
భూమధ్యరేఖా హిందూ మహా సముద్రంలో పీడనంలో అకస్మాత్తుగా సంభవిస్తున్న మార్పులు, సముద్ర ప్రవాహాలలో సంభవిస్తున్న మార్పులు నైరుతి రుతు పవనాలను ప్రభావితం చేస్తున్నాయని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు.

Close