-->

రాష్ట్ర విధాన పరిషత్ - రాష్ట్ర స్థాయిల్లో ద్విసభ విధానం - Biological system in state levels

Also Read

రాష్ట్ర విధాన పరిషత్

జాతీయ ఉద్యమంతో ముడిపడిన బ్రిటిష్ చట్టాలు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సంస్థలు మొదలైన వాటిపై ఐదు వరకు ప్రశ్నలుంటున్నాయి. భారత రాజ్యాంగం అమల్లో అనేక సమస్యలు, అనుభవాలు ఎదురయ్యాయి. గత 60 ఏళ్లలో ఆయా సందర్భాల్లో జరిగిన సంఘటనలు జనరల్ స్టడీస్ పేపర్ లో ప్రశ్నలుగా రావడం మనం చూస్తున్నాం. దేశ కాలమాన స్థితుల్లో సంభవిస్తున్న అనేక నూతన పరిణామాలు, కాల పరీక్షలను ఎదుర్కొన్న మన రాజ్యాంగం సవరణల ద్వారా కొన్ని మార్పులను కూడా తనలో ఇముడ్చుకొని అత్యంత సుదీర్ఘమైన రాజ్యాంగంగా మన ముందుంది.

విధాన పరిషత్

2007 జేఎల్ జనరల్ స్టడీస్ పేపర్లో రాష్ట్రాల్లో విధాన పరిషత్ ను రాజ్యాంగంలోని ఏ అధికరణను అనుసరించి ఏర్పాటు చేస్తారు? అనే ప్రశ్నవచ్చింది. దీనికి సరైన సమాధానం 169వ అధికరణ. అయితే వివిధ పోటీ పరీక్షల జనరల్ స్టడీస్ పేపర్లను పరిశీలించినపుడు విధాన పరిషత్ పై అనేక ప్రశ్నలొస్తున్నాయి. విధాన పరిషత్ ను ఏర్పాటు చేయాలన్నా లేదా రద్దు చేయాలన్నా పార్లమెంటు సాధారణ మెజారి టీతో తీర్మానాన్ని ఆమోదించాలి. భారతదేశంలో విధాన పరిషత్ లు కలిగిన రాష్ట్రాల సంఖ్య ఆరు. ఆంధ్రప్రదేశ్ లో 2007లో తిరిగి విధాన పరిషత ను ఏర్పాటు చేశారు. అందువల్ల విధాన పరిషత్ ప్రాధాన్యత సంతరించుకుంది.

విధాన పరిషత్ సభ్యుల సంఖ్య విధానసభ సభ్యుల సంఖ్యలో 1/3 వంతుకు మించరాదు. అదేవిధంగా కనిష్టంగా 40 మంది కంటే తక్కువగా ఉండరాదు. యూపీ అత్యధిక సభ్యులను కలిగి (108) ఉండగా... జమ్ము-కాశ్మీర్ సభ్యుల సంఖ్య (36) తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎంఎల్ సీల సంఖ్య 90. విధాన పరిషత్ ఎగువసభ. అంతే కాకుండా ఇది శాశ్వత సభ కూడా. దానిని రద్దుచేసే అవకాశం లేదు. సభ్యుల పదవీకాలం ఆరేళ్లు. ప్రతి రెండేళ్లకోసారి 1/3 వంతు మంది సభ్యులు రిటైర్ అవుతారు. అంతే సంఖ్య స్థానాలకు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిపై ఎన్నికలు జరుగుతాయి. విధానసభకు పోటీచేసే అభ్యర్థులకు వర్తించే అర్హతలే విధాన పరిషత్ అభ్యర్థులకు వర్తించిన ప్పటికీ వయసు విషయంలో మాత్రం పరిషత్ కు పోటీ చేసేవారు 30 ఏళ్లు నిండి ఉండాలి.

విధాన పరిషత్ సభ్యులను ఐదు విధాలుగా ఎన్నుకుంటారు. మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3 వంతు మంది స్థానిక సంస్థల ద్వారా ఎన్నికవుతారు. 1/3 వంతు సభ్యులను విధానసభ ఎన్నుకొంటుంది. 1/6 వంతు సభ్యులను రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. 1/12 వంతు సభ్యులను ఉపాధ్యాయులు, 1/12 వంతు సభ్యులను పట్టభద్రులు ఎన్నుకొంటారు. ఈ ఎన్నికలను కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహి స్తుంది. 1985లో మన రాష్ట్ర విధాన పరిషత ను ఎన్టీఆర్ ప్రభుత్వ కాలంలో రద్దు చేసేనాటికి పరిషత్ చైర్మన్ గా సయ్యద్ ముఖసిర్ షా ఉన్నారు. ప్రస్తుత చైర్మన్ గా ఎ. చక్రపాణి, డిప్యూటీ చైర్మన్ గా మహ్మద్ జానీ కొనసాగుతున్నారు.

అధికారాల రీత్యా విధానసభతో పోల్చినప్పుడు పరిషత్ కు ఎలాం టి ప్రాముఖ్యం లేదు. కేంద్రంలో రాజ్యసభ, లోకసభల మధ్య భిన్నాభి ప్రాయాలు వ్యక్తమైనపుడు రాష్ట్రపతి ఉభయసభల సంయుక్త సమా వేశాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ రాష్ట్రంలో విధానసభ, పరిషత్ ల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినపుడు అలాంటి అవకాశం లేదు. విధానసభ సదరు బిల్లును రెండోసారి ఆమోదించాల్సి ఉంటుంది.
  • రాజ్యాంగ సవరణలు మూడు రకాలు. మూడో పద్ధతిలో పార్లమెం టులో 2/3 వంతు మెజారిటీతో పాటు 1/2 వంతు రాష్ట్రాల రాష్ట్ర విధానసభలు మాత్రమే సవరణ ప్రక్రియలో పాల్గొంటాయి.
  • రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు, దానిని అధికారం నుంచి తొలగించ టంలో విధానసభ నిర్ణయమే అంతిమం.
  • ఆర్థిక బిల్లులను విధానసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. వాటి ఆమోదానికి పరిషత్ 14 రోజుల కంటే ఎక్కువ సమయాన్ని తీసు కోరాదు.
  • రాష్ట్రపతి ఎన్నికల్లో, రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో విధానసభ సభ్యులు మాత్రమే పాల్గొంటారు.
  • రాష్ట్ర మంత్రిమండలి విధానసభకు మాత్రమే సమష్టి బాధ్యత వహిస్తుంది.
  • రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆర్థిక, అధికార బిల్లులు విధానసభలో వీగిపోయినట్లయితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. కానీ విధాన పరిషత్ లో వీగిపోయినపుడు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు.
  • వేతనాల విషయంలో రెండు సభల సభ్యులు సమాన అధికారా లను కలిగి ఉంటారు.
  • 1985లో మన రాష్ట్ర విధాన పరిషత్ రద్దు కోసం, 2007లో విధాన పరిషత్ ఏర్పాటు కోసం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది ప్రస్తుత కేంద్ర న్యాయశాఖామంత్రి హెచ్.ఆర్. భరద్వాజ్ కావడం యాదృచ్ఛికం.

Close