-->

డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం- కవిగా కలాం - Dr. APJ Abdul Kalam- Kalam as a poet

Also Read

కవిగా కలాం

    కలాం ఒక ప్రసిద్ధ సైంటి స్టే కాడు మంచి కవి కూడా. అతడు తమిళంలోను, ఆంగ్లంలోను కూడా కవితలు రాశాడు. అతడు రాసిన 17 పద్యాలు ఆంగ్లంలోకి తర్జుమా చేయబడ్డాయి. 1994లో ప్రచురించబడ్డాయి. దానికి “మై జర్నీ” అని పేరు పెట్టాడు (నా ప్రయణాం). అతడు ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉన్నవాడు కాబట్టి భగవద్గీత, ఖురాన్లను రెండింటినీ చదివేవాడు. అతనికి సర్వమత సహిష్ణుత ఉందని యీ విషయం తెలియజేస్తుంది. అతని పద్యాలు ఎక్కువగా మత విషయికంగానే ఉంటాయి. తాజాగా అతడు రాసిన పుస్తకం “ద లైఫ్ ట్రీ" (జీవిత వృక్షం). దీనిలో 26 పద్యాలున్నాయి. కొన్ని ఆంగ్లంలో రచించినవి. కొన్ని పద్యాలు తమిళం నుండి తర్జుమా చేయబడినవి. జీవితాన్ని ఏ విధంగా గడపాలో తెలియజేసే పద్యాలవి. దానికి వాజపేయి పరిచయ వాక్యాలు రాశాడు. “కలాం స్పేస్ రిసేర్చి ద్వారా, సాంకేతిక రక్షణ మార్గాల ద్వారా దేశానికి ఎనలేని సేవ చేశాడు. అతడు సున్నితంగా, భావస్ఫోరకంగా రాశాడు. శాస్త్రజ్ఞానం, కవిత్వాల కలయిక చాలా అద్వితీయమైనది. కలాం ఆ ఘనతని సాధించాడు” అని వాజపేయి రాశాడు.
    తన "లైఫ్ ట్రీ'లో తన చిన్ననాటి పేదరికం గురించి వర్ణించాడు. దానిని దేశం యొక్క భవిష్యత్తుతో ముడిపెట్టాడు. కలాం అభిప్రాయం ప్రకారం వ్యక్తిగత జీవితం కంటే దేశమే ప్రధానం. దేశం గురించే ప్రతి ఒక్కరూ ఆలోచించి ప్రగతి పథంలో దేశాన్ని నడిపించడానికి కృషిచేయాలని చెప్పాడు. తన వ్యక్తిగత జీవితం, సాంకేతికత, సంఘజీవనం తన ఆత్మకు అద్దంలాంటివి అని చెప్పాడు. అతని దృష్టి ఎప్పుడూ దేశాన్ని సైన్సు ద్వారా, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, మానవ విలువలతో, ప్రకృతి ఆరాధనతో ముందుకు తీసుకునిపోవడంలోనే నిమగ్నమై ఉంటుంది. సృజనాత్మకత అనేది అది సైన్సులో కావచ్చు. ఇంజనీరింగ్ లో కావచ్చు మనిషి యొక్క సమర్ధత మీద ఆధారపడి ఉంటుంది. దానిని మనం పోషించుకోవాలి అని అంటూ ఉండేవాడు.
    కలాం చాలా ప్రతిభకలవాడు. ప్రతిస్థాయిలోను తన చైతన్యాన్ని భావాలతో నింపేవాడు. భావాలు ఎప్పుడూ ఉన్నతంగానే ఉండేవి. ఉదాహరణకి అతడు రాసిన పద్యాల్నే తీసుకుందాం. అతని పద్యాలలోను భావాలు కళలతోను, ప్రకృతితోను, సైన్సుతోను ముడిపడి ఉంటాయి. ఆలోచనారహితంగా, అంటే వివేచన లేకుండా మతానికిగాని, సంఘంలో ఉండే సంకుచితత్వానికి అంటి పెట్టుకుని ఉంటే సంబంధ బాంధవ్యాలు దెబ్బ తింటాయి. తన "లైఫ్ ట్రీ” లో కలాం యొక్క మానవతా వాదిత్వం. ఆత్మ విశ్వాసం, ఆశావాదిత్వం కనపడతాయి. భారతదేశంలో ఉన్న సంఘవ్యవస్థని మార్చడమే కలాం యొక్క ధ్యేయం. ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి రగిలించి, వాళ్లను కలలు కనేటట్లు చేసి, ఆ కలాల్ని సాకారం చేసుకునేటట్లు చేసేవాడు. “దీపం ఎప్పుడైతే వెలిగిందో ఆ జ్ఞానదీపం చివరి వరకు వెలిగి 'అభివృద్ధిచెందిన భారతదేశం' విజన్ నెరవేరే వరకూ అలా వెలుగుతూనే ఆ ఉంటుంది.”
“స్ఫూర్తితో మనం స్వేదం చిందించి, శ్రమిస్తే అభివృద్ధి చెందిన భారతదేశం తప్పక ఉదయిస్తుంది. అదే నా ప్రార్ధన కూడా” అనేవాడు కలాం.
    తన భావాల్ని వ్యక్తీకరించడానికి పద్యాల్నే మాధ్యమంగా తీసుకున్నాడు. ముఖ్యంగా విద్య, రీసెర్చి, ఆచరణల మీద కేంద్రీకరించేవాడు. వీటిని ఆసరాగా తీసుకుని అభివృద్ధి చెందిన భారతదేశపు కల సాకారం చేసుకోవచ్చును. “మనం మనదేశం కోసం శ్రమించాలి. మన స్వేదం దేశాన్ని సుభిక్షం చేస్తుంది” అనేవాడు. శాస్త్రజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుని, దానితోపాటు ఆధ్యాత్మికతని, కళల్ని రంగరించి జీర్ణం చేసుకున్నాడు కలాం. వీటికి తోడు తన అనుభవాల్ని కూడా జోడించాడు. హింస, కుల విచక్షణలను చూసి కలాం చలించిపోయాడు. "సాంగ్ ఆఫ్ క్రియేషన్” అనే పద్యాలు రాశాడు. (సృష్టిపాట) ప్రకృతి మనకిచ్చిన వరాలలో దివ్యజ్ఞానం గొప్పది.
జీవితం ఒకే మంత్రంతో ముందుకు సాగిపోతూ ఉంటుంది. అదే"నేర్చుకో, నేర్చుకో”
అతడు “నేచర్స్ వండర్” అనే దానిలో (ప్రకృతి అద్భుతాలు) యిలా అన్నాడు. “నువ్వు జన్మించావు. ఇవ్వడంలోనే జీవించు, అందర్నీ ప్రేమతో బంధించు అదే జీవితవృక్షం”
    ఈ రోజుల్లో మనం సంపాదిస్తున్న జ్ఞానాన్ని ప్రతిబింబించేటట్లుగా కలాం యొక్క శైలి ఉంటుంది. కవిత్వం అనేది భాషాపరంగానే కాక, ప్రజల గొప్పతనాన్ని, చేసిన ఘన కార్యాల్ని, వారి ఆశల్ని మొదలైనవాటి నన్నింటినీ ప్రతిబింబిస్తుంది. కలాం గొప్ప శాస్త్రవేత్త అయినా గొప్ప సృజనాత్మకతని సంతరించుకున్నాడు. ఎక్కువ వైవిధ్యభరితంగా అతని కవిత్వం ఉంటుంది. భగవంతుని మీద కలాంకి అపారమైన నమ్మకం ఉంది. ప్రార్థనవల్ల గొప్ప ఫలితం ఉంటుందనేవాడు. మన ప్రార్థనల్ని భగవంతుడు ఆదరిస్తాడనేవాడు. తన కోసమే కాక, అందరి కోసం భగవంతుని ప్రార్థించేవాడు. ఎప్పుడూ గొప్ప గురువులతోను, ఉన్నత భావాలు కలవారితోనూ కలిసి ఉండాలనుకునేవాడు.
    "హార్మనీ” అనే కవితలో కలాం విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక ఉపాధ్యాయుడు తనను తన స్నేహితుడైన రామనాథం నుండి విడదీసిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఆ ఉపాధ్యాయునికి ఒక బ్రాహ్మణ బాలునితో ఒక ముస్లిం బాలుడు కలిసి కూర్చోవడం యిష్టం లేదు. కలాంని చివరి బెంచీ మీద కూర్చోమన్నాడు.
    “నా కళ్లంట నీళ్లు కారాయి. రామనాథన్ కూడా ఏడ్చాడు. విద్యాధికులమనుకునే వాళ్ళు మమ్మల్ని విడదీశారు. అంతరాలనే విషాన్ని పంచడం ప్రారంభించారు” అని రాశాడు.
    భగవంతుడు అందర్నీ సమానంగానే, స్వేచ్చగా ఉండమనే సృష్టించాడు అనే భావన కలాంకి బాల్యం నుండీ ఉండేది.
    “అందరూ ఒకేలా సృష్టించబడ్డారు. అందరూ సమానులే” అనే విషయాన్ని భగవంతుడు మనల్ని గుర్తుంచుకోమన్నాడు.
“అందరూ గుర్తించండి
ఖుదా, రాముడూ యిద్దరూ ఒకటే.
వారు ప్రేమమూర్తులు”
అని రాశాడు కలాం.
    1991లో మదర్ థెరిసా హాస్పిటల్ లో ఉన్నదని తెలిసి చాలా బాధపడ్డాడు. ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థించాడు. ఎందుకంటే “ఇళ్ళు లేనివారికి ఆమె హృదయమే ఇల్లు” అనేవాడు.
“మెసేజ్” అనే కవితలో విజయ రహస్యానికి మార్గం చెప్పాడు. (సందేశం) “నీ పనిని ప్రేమించు, నీ కలలో విశ్వాసం ఉంచు, నీ కలల్ని చెదరగొట్టే శక్తి దేనికీ లేదు.”
కలాం రాసిన కొన్ని కవితలకి కళారూపాన్ని యిచ్చారు కొందరు చిత్రకారులు,

Close