-->

డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం - కలాం ఇస్రోనుండి డి.ఆర్.డి.ఓ.కి వెళ్ళడంతో సమస్య తలెత్తింది - A.P.J. Abdul Kalam | Biography, History, Books,

Also Read

    కలాం ఇస్రోనుండి డి.ఆర్.డి.ఓ.కి వెళ్ళడంతో చిన్న సమస్య తలెత్తింది. ఇస్రో కలాంని విడిచి పెట్టడానికి యిష్టంలేక సందేహిస్తూంది. డి.ఆర్.డి.ఓ. కలాంని చేర్చుకోవడానికి తొందరపడుతూంది. సుదీర్ఘంగా చర్చించిన తరువాత, అప్పటి రక్షణమంత్రి ఆర్.వెంకట్రామన్తో సంప్రదింపులు జరిపిన తరువాత కలాంని డి.ఆర్.డి.ఎల్ డైరక్టరుగా తీసుకున్నారు. ఆ నిర్ణయం 1982లో తీసుకున్నారు. కలాం ఇళోని విడిచి వెళ్ళేముందు ధావన్ అతనిని స్పేస్ ప్రోగ్రాం 2000 నాటికి ఎలా ఉండబోతూందో ప్రసంగించమని కోరాడు. అదే కలాంకి వీడ్కోలు సభగా మారింది.
    రాజారామన్న తరువాత ఆ పదవిని డా|| అరుణాచలం అలంకరించాడు. అతడు లోహశాస్త్ర నిపుణుడు. మిక్కిలి సమర్ధత గలవాడు. కలాం డి.ఆర్.డి.ఎల్ కి చేరిన తరువాత డి.ఆర్.డి.ఎల్. డైరక్టర్ యల్ బన్సాల్ కలాంకి అక్కడున్న సీనియర్ సైంటిస్టులకు పరిచయం చేశాడు. ఈలోపున మద్రాస్ అన్నా విశ్వవిద్యాలయం కలాంకి గౌరవ డాక్టరేట్ లో జూన్ 1982లో చేరాడు.
    ఆఫ్ సైన్స్ డిగ్రీ యిచ్చి సత్కరించింది. కలాం డి.ఆర్.డి.ఎల్ డి.ఆర్.డి.ఎల్ లో కార్యక్రమాలు చురుకుగా జరగడానికి కలాం ముఖ్యమైన సైంటిఫిక్, సాంకేతిక సమస్యల మీద చర్చలు జరిపాడు. సైంటిఫిక్ విషయాల్లో చర్చలు విరివిగా జరగాలని అతని కోరిక. రహస్యంగా సలహాలు తీసుకోవడం, పనులు జరిపించడం అతనికి యిష్టం లేదు. అన్నీ బాహాటంగానే జరగాలి. చర్చల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది సీనియర్ సైంటిస్టులతో ఒక ఫోరమ్ ఏర్పాటు చేయడం అందరూ కలిసి ఆ ఫోరమ్ లో ముఖ్యమైన విషయాలమీద చర్చిస్తారు. డి.ఆర్.డి.ఎల్.లో ఉన్నత స్థాయి సంస్థ "మిస్సైల్ టెక్నాలజీ కమిటీ” ఏర్పాటయింది. చివరకు దీర్ఘకాల "గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం యొక్క ప్రణాళిక సిద్ధమయింది. కలాం అధ్యక్షతన ఒక కమిటీ కూడా ఏర్పడింది.

    ఏ అభివృద్ధి ప్రోగ్రాం అయినా నిధులు లేకపోతే ఆగిపోతుంది. కాని రక్షణ మంత్రి ఆగిపోతుంది. కాని రక్షణమంత్రి ఆర్.వెంకట్రామన్ అధ్యక్షతన జరిగిన ఒక సమావేశంలో కలాం నిధులను గురించి ప్రస్తావించాడు. అక్కడున్న వారందరికీ చాలా సందేహాలున్నాయి. కలాం కోరిన కోరిక దురాశ అని కొందరు అన్నారు. ప్రతి ఒక్కరికి జాతీయంగా స్వంత మిస్సైల్ సిస్టమ్ ఉండాలనే కోరిక ఉంది. చివరకు వెంకట్రామన్ కలాం యొక్క టీముని తనను మరునాడు కలవమని సూచించాడు. వారు మరునాడు కలవడానికి వెళ్లేటప్పుడు రక్షణ మంత్రి కొంత నిధులు సమకూరుస్తాడనుకున్నారు. కాని అతడు దశలవారీగా మిస్సైల్స్ ని తయారుచేసేకంటే ఒక ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్ ప్రోగ్రాంని సిద్ధం చేయమని చెప్పాడు. వారికి చాలా ఆశ్చర్యం కలిగింది. మంత్రి సూచన గురించి వారు దీర్ఘంగా ఆలోచించారు. రాత్రల్లా కూర్చుని ఒక ప్రణాళికని సిద్ధం చేశారు. మరునాడు సాయంకాలం కలాం తన మేనకోడలి పెళ్ళికి రామేశ్వరం వెళ్లాలనే విషయం గుర్తుకి వచ్చింది. సమయానికి పెళ్ళికి హాజరుకావడానికి అవకాశం లేదు. కాబట్టి పెళ్ళికి వెళ్ళడం కుదరదనుకున్నాడు. ఉద్యోగరీత్యా తాను తన మేనకోడలి పెళ్ళికి వెళ్లలేకపోయానని బాధపడ్డాడు.
    కలాం తన టీముతో కలిసి వెంకట్రామనికి తాము తయారుచేసిన ప్రణాళికను చూపించారు. అతడు తన సంతృప్తిని వ్యక్తం చేశాడు. అదే సమయంలో డా|| అరుణాచలం కలాం మేనకోడలు జమీలా పెళ్లి గురించి మంత్రికి చెప్పాడు. వెంటనే కలాం రామేశ్వరం వెళ్లడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. సరియైన సమయానికి కలాం పెళ్ళికి హాజరయ్యాడు.
    కలాం తయారుచేసిన ప్రణాళికను మంత్రి కేబినెట్ ముందుంచాడు. వెంటనే అది ఆమోదం పొందింది. 308 కోట్ల రూపాయిలు ఆ ప్రణాళిక కోసం విడుదల చేశారు. ఆ విధంగా ప్రతిష్టాత్మకమయిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటయింది. భారతదేశం యొక్క స్వావలంబన స్ఫూర్తి దృష్ట్యా ఆ ప్రాజెక్టులకు పేర్లు పెట్టారు. భూమిమీద ప్రయోగించే ఆయుధానికి "పృథ్వి” అనీ, (భూమి); టాక్టికల్ కోర్ వెహికిల్ కి “త్రిశూల్” (శివుని ఆయుధం) అనీ, భూమి నుండి గాలిలోకి వెళ్లే రక్షణ ఆయుధానికి “ఆకాశ్” (ఆకాశం) అనీ, ఏంటీ ట్యాంక్ మిస్సైల్ ప్రాజెక్టుని “నాగ్” (పాము) అనీ, పేర్లు పెట్టారు. తన కలల రూపమైన REX కి కలాం 'అగ్ని' (మంట) అని పేరు ప్రత్యేకంగా పెట్టాడు. ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం డా|| అరుణాచలం చేతులమీదుగా ప్రారంభమయింది. కలాం జీవితంలో యిది రెండవ మరపురాని రోజు.
    మిస్సైల్ టెక్నాలజీ (క్షిపణి సాంకేతికత) ఒకప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాలకే పరిమితమైనదని భావించేవారు. అనుకున్న దానిని వీరు ఎలా సాధించగలరో చూద్దామని ప్రపంచమంతా ఆసక్తితో ఎదురుచూస్తుంది. కావలసినదల్లా మిస్సైల్ టెక్నాలజీలో నైపుణ్యం వీరు విదేశాలనుండి ఏమీ ఆశించలేదు. ఎన్ని వైరుధ్యాలు వచ్చినా, ఆటంకాలు ఎదురయినా, వీరు సిద్ధపడాలి. జాతి సాధ్యానికి మించిన దానిని వీరు సాధించాలి. డి.ఆర్.డి.ఎల్. చాలామంది ప్రతిభగలవారున్నారు. కాని వారిలో చాలామంది అహంకార స్వభావులు.
    డి.ఆర్.డి.జడ్లో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఎ.వి. రంగారావు. అతడు చాలా ప్రతిభగలవాడు కాని విపరీతమైన అహంకారం గలవాడు. నాలుగు నెలలలోపు నాలుగువందలమంది సైంటిస్టులు మిస్సైల్ ప్రోగ్రాం మీద పనిచేశారు. కలాం చేయవలసిన ముఖ్యపని ప్రాజెక్టు డైరక్టర్లను ఎంచి వారిచేత వ్యక్తిగతంగా మిస్సైల్ ప్రాజెక్టులను నడిపించేటట్లు చేయడం. ఇది చాలా కష్టమైన పని. అపాత్రుల్ని ఎంపిక చేస్తే మొత్తం భవిష్యత్ప్రణాళిక నాశనమవుతుంది. ఎంపికచేసిన అయిదుగురు ప్రాజెక్టు డైరెక్టర్లు మరో యిరవై అయిదుమంది ప్రాజెక్టు డైరక్టర్లకు, టీము లీడర్లకు శిక్షణ యివ్వాలి.
    కలాం అభిప్రాయం ప్రకారం ఒక ప్రాజెక్టు డైరక్టరు జాగ్రత్తగా, చక్కని ప్రణాళికను రూపొందించగలగాలి. అందర్నీ క్రమపద్ధతిలో నడిపించగలగాలి. అలా నడిపించడంలో మరీ క్రూరంగా ప్రవర్తించకూడదు. పృథ్వికి కల్నల్ వి.సుందరంని, త్రిశూల్ కి యస్.ఆర్. మోహన్ని, అగ్నికి ఆర్.ఎన్. అగర్వాల్ ని ఎంపిక చేశాడు. ఆకాశ్, నాగ్లు భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టులు అయినవాటికి, ప్రహ్లాదని, ఎన్.ఆర్. అయ్యర్ ని ఎంపికచేసి వారికి సహాయకులుగా వి.కె. సారస్వత్, ఎ.కె. కపూర్లను నియమించారు. ప్రతి మూడు నెలలకు ఒక సమావేశం ఉంటుంది. సైంటిస్టులందరూ చర్చించాలి.
    ఉత్పాదక శక్తి కలిగిన లీడరు స్టాఫుని ఎంచుకోవడంలో సమర్ధుడై ఉండాలి. సంస్థలోకి కొత్త రక్తాన్ని ఆహ్వానిస్తూ ఉండాలి. సమస్యల్ని పరిష్కరించే నైపుణ్యం కలిగి ఉండాలి.
    టీముల్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉండగా ఒక సమస్య వచ్చింది. డి. ఆర్.డి.ఓ.లో స్థలం చాలదనిపించింది. కలాం ఇమారత్ కాంచ్ ప్రదేశాన్ని సందర్శించాడు. అది బీడుపడి ఉంది. ఆ ప్రదేశంలో పెద్ద పెద్ద బండరాళ్లున్నాయి. మిస్సైల్ ప్రాజెక్టుకి తగిన వసతులు సమకూర్చాలి. ఒక ఆదర్శ ఉన్నత సాంకేతిక రీసెర్చి సెంటర్ ని కలాం స్థాపించాలనుకున్నాడు. ఇది సామాన్యమైన పనికాదు. ఆ పని ఎమ్.వి. సూర్యకాంతరావు చేయగలడనిపించింది. అందువల్ల కలాం అతనిని ఎంపిక చేశాడు. కృష్ణమోహన్ ని అతనికి సహాయకునిగా ఏర్పాటు చేశాడు. పని పూర్తి కావడానికి అయిదు సంవత్సరాలు పడుతుందని అంచనా వేశారు. కలాం నాయకత్వంలో సభ్యులు మిస్సైల్ సిస్టమ్స్ యొక్క డిజైన్లు తయారుచేయడంలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో రక్షణమంత్రి వెంకట్రామన్ డి.ఆర్.డి.ఎల్.ని సందర్శించాడు. తాను వారికి దన్నుగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఆ మాట వారికి గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది.
    కలాం ఒక సమావేశంలో లక్ష్యాన్ని నిర్దేశిస్తూండగా డా|| బ్రహ్మప్రకాశ్ మరణవార్త చేరింది. అది 3, జనవరి, 1984లో జరిగింది. ఈ సంఘటన కలాంకి పెద్ద షాకు. రాభాయి VSSC ని సృష్టిస్తే, బ్రహ్మప్రకాశ్ అది పనిచేసేటట్లు కృషి చేశాడంటాడు కలాం.
    తమ సిస్టమ్ ని పరీక్షించడానికి కలాం టీమ్ కి ఒక క్షిపణి కావాలి. ఒక DEVIL మిస్సైల్ ని సరిచేశారు. దానిని ఆ ఏడాది జూన్ నెలలో ప్రయోగించారు. ఈ సంఘటన భారతీయ మిస్సైల్ డెవలప్మెంట్ చరిత్రలో మొదటి ముఖ్యమైన అడుగు. ఆ వార్త ఢిల్లీ చేరింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ డి.ఆర్.డి. ఓని సందర్శించి, దాని అభివృద్ధి ఎలా జరుగుతూందో చూడాలనుకుంది. ఆమె 19, జులై, 1984లో సందర్శించింది. కలాం స్వయంగా ఆమెకు స్వాగతం పలికాడు. అంకిత భావంతో పనిచేశారని ఆమె వారిని మెచ్చుకుంది. ఆమె సైంటిస్టుల సమావేశంలో ప్రసంగించింది. పృథ్విని ఎప్పుడు ప్రయోగిస్తారని కలాంని అడిగింది. 1987లో ప్రయోగం జరగవచ్చునని కలాం చెప్పాడు. దానికి ఏమి కావాలో తనకి తెలియజేయమని చెప్పింది. ఆమె పని ఎలా సాగుతూందో పదే పదే కనుక్కుంటూ ఉంది. కొత్తగా వచ్చిన రక్షణ మంత్రి ఎస్.బి. చవాన్ ని కూడా పంపింది.
    కలాం యొక్క టీము చక్కని పద్ధతులు తెలిసి నైపుణ్యం గలది. చేసిన పనిని, ముఖ్యంగా డిజైన్, ప్లానింగ్, మొదలైన వాటిని తరుచుగా పరీక్షిస్తూ ఉండడం వల్ల త్వరగా అభివృద్ధి జరిగింది, ఇమారత్ కాంచ రీసెర్చ్ సెంటర్ కి “రీసెర్చ్ సెంటర్ ఇమారత్” (RCI) అనే పేరు పెట్టారు. చాలామంది సైంటిస్టులు, రిసెర్చ్ స్కాలర్ల భాగస్వామ్యంతో పని ఎక్కువ నాణ్యతతో జరుగుతూంది. ఎటువంటి అభివృద్ధి పనినైనా దేశంలోనే చేయగలమనే విశ్వాసం కలాంకి ఏర్పడింది. లక్ష్యాలు స్పష్టంగా ఉంటే, ప్రతిభ గలవారుంటే ఎంతటి సాంకేతికతో కూడిన పనైనా చేయవచ్చును.
    శాంతియుత ప్రయోజనాల కోసం మొదటి అణువిస్ఫోటనం (న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్) జరిగినప్పుడు ప్రపంచంలో అణు విస్పోటనం జరిపిన దేశాల్లో భారతదేశం ఆరవది అని భారతదేశం గర్వంగా చెప్పుకుంది. అదే విధంగా, SLV-3 ని ప్రయోగించినప్పుడు శాటిలైట్ లాంచ్ చేసిన దేశాలలో భారతదేశం అయిదవది అని చెప్పుకుంది. భారతదేశం సాంకేతికతలో మొదటి, లేక రెండవ స్థానంలో ఉండాలనేదే వారి ఆకాంక్ష.
    కలాం అభిప్రాయం ప్రకారం సైంటిస్టులు గొప్ప వక్తలే కాని మంచి శ్రోతలు కారు.
    కలాం యొక్క టీము యితర ప్రణాళికల మీద పనిచేస్తున్నప్పుడు, ఇందిరాగాంధీ హత్య చేయబడింది. ఆమె మరణం కలాంకి తీరని లోటు. ఎందుకంటే ఆమె తమకు అండగా నిలిచింది. తరువాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడు.
    1985వ సంవత్సరానికల్లా ఇమారత్ కాంచా వద్ద మిస్సైల్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి అవసరమైన క్షేత్రస్థాయి పనులు పూర్తయ్యాయి. రాజీవ్ గాంధీ దానికి పునాదిరాయి వేశాడు. అతడు కూడా వారు చూపిన అభివృద్ధికి సంతృప్తి చెందాడు. దానిని యింకా అభివృద్ధి చేయాలనే ఆసక్తి కనపరిచాడు. సైంటిస్టులు యితర దేశాలకు వలస పోకుండా మాతృదేశంలోనే ఉండి అభివృద్ధి చేయాలని చెప్పాడు. నిత్యజీవితంలో ఎదురయ్యే బాధలు లేకపోతే చేసే పనిమీద ఏకాగ్రత కుదురుతుందనేవాడు. సైంటిస్టుల జీవితాలు ఒడుదుడుకులు లేకుండా సాఫీగా జరగడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తానన్నాడు.
    అమెరికా ఎయిర్‌ఫోర్స్ వారి ఆహ్వానం మేరకు కలాం అమెరికా వెళ్లాడు. అక్కడ పూర్తయిన తరువాత శాన్ ఫ్రాన్సికో వెళ్లాడు. అక్కడ అందమైన స్ఫటిక చర్చిని చూశాడు.

Close