-->

స్టాక్ మార్కెట్ లో బోనస్ ఇచ్చే కంపెనీలను ఎలా తెలుసుకోవాలి? - How do know the bonus companies in the stock market?

Also Read    షేర్ల ప్రపంచంలో సంభవించే అద్భుతం ఈ బోనస్ షేర్లు. బోనస్ షేర్లంటే ప్రస్తుతం వున్న షేర్లకు అదనంగా మరికొన్ని షేర్లని కంపెనీ తన ఇన్వెస్టర్లకి ఉచితంగా అందజేయడం. అసలు కంపెనీ అలా ఎందుకు ఉచితంగా షేర్లని ఇన్వెస్టర్ కి ఇస్తుంది అన్న ప్రశ్న పాఠకులకు కలగవచ్చు. ఆ సందేహాన్ని నివృత్తి చేసుకుందాం.
    ఇంతకు ముందు మనం ఒక కంపెనీ తను సంపాదించిన లాభాలన్నింటినీ వాటాదారులకు పంచదని తెలుసుకున్నాం. డివిడెండ్ రూపేణా కొంత లాభాన్ని వాటాదారులకు పంచి, మిగిలిన దానిని తన రిజలలో ఉంచుతుందని తెలుసుకున్నాం. అలా ఉంచబడిన రిజలు వాటాదారుల సొత్తే కాబట్టి వారి సొమ్ముని నగదు రూపంలో కాక వాటాల రూపంలో ఉచితంగా ఇస్తుంది. అలా ఉచితంగా ఇవ్వబడ్డ షేర్లనే 'బోనస్ షేర్లు' అంటారు. ఉదాహరణకు రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కంపెనీలో 'ఎక్స్' అనే వ్యక్తికి 100 షేర్లు ఉన్నాయనుకుందాం. అతడికి ప్రతి సంవత్సరం డివిడెండ్ మాత్రమే కాక కంపెనీ మరొక వంద షేర్లని బోనస్ గా రెండు మూడేళ్ళకు ఇస్తుంది. అంటే బోనస్ అనంతరం 'ఎక్స్'కి రెడ్డీస్ ల్యాబోరేటరీస్ కంపెనీలో 200 షేర్లు ఉంటాయి. అసలు ఒక కంపెనీలో వాటాదారులకు బోనస్ ని ఇవ్వాలా, లేదా, ఇస్తే ఏ నిష్పత్తి ప్రాతిపదికన ఇవ్వాలన్నది ఆ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు నిర్ణయిస్తారు.
    ఇక్కడ బోనస్ ని నిర్ణయించే అంశం రిజలే, ప్రతి సం|| డివిడెండ్ పోగా మిగిలిన లాభం ఈ రిజర్వ్ ల రూపంలో పేరుకుంటుంది. ఈ రిజర్వ్ లను అక్కౌంటింగ్ పరిభాషలో బుక్ వాల్యూ ప్రాతిపదికన కొలుస్తారు. అంటే ఒక కంపెనీ బోనస్ ఇస్తుందా. లేదా అన్నది ఆ కంపెనీ బుక్ విలువని బట్టి తెలుసుకోవచ్చు. ఉదాహరణకు పది రూపాయలు ముఖవిలువ గల 'ఎక్స్' కంపెనీ బుక్ విలువ 80రూ||లు. అంటే దాని ముఖవిలువకు 8రేట్లు (80/100) రిజర్లు ఆ కంపెనీకి వున్నాయన్నమాట.
    ఆ ఒక కంపెనీ బోనస్ ఇవ్వనుంది అని వాసన సోకి సోకకుండానే ఆ కంపెనీ షేర్ల ధరలు పెరగడం ప్రారంభిస్తాయి. అంటే షేర్ విలువ త్వరిత వేగంతో పరుగెట్టడానికి కారణం ఈ 'బోనస్ షేర్లే'. అలాంటి బోనస్ ఇచ్చే కంపెనీలు ఉంటే ఇన్వెస్టర్ల పంట పండుతుంది.

మరి ఈ బోనస్ ఇచ్చే కంపెనీలను ఎలా గుర్తించాలి?

ఈ క్రింది అంశాల ఆధారంగా బోనస్ ఇచ్చే కంపెనీలను గుర్తించవచ్చు. 
  1. బోనస్ ఇచ్చే కంపెనీల బుక్ వాల్యూ కనీసం 30 లేదా అంతకు మించి ఉండాలి. దాని లాభాలు ప్రతి ఏడూ క్రమేపీ పెరుగుతూనే ఉండాలి.
  2. ఆ కంపెనీ భవిష్యత్ లాభాదాయకత కూడా ఉజ్వలంగా ఉండాలి. అలా లేకపోతే ప్రస్తుతం ఉన్న రిజలు అయిపోతాయేమోనన్న సంశయంతో బోనస్ ఇవ్వడానికి సంశయిస్తారు ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు.
  3. ఒక కంపెనీ గత సంవత్సర కాలంలో వాటాదారులకు రైట్ ఇచ్చి ఉండకూడదు. సెబి నిబంధనల ప్రకారం బోనస్ ఇవ్వాలంటే ఒక కంపెనీ అంతకు సంవత్సరం ముందు పబ్లిక్ ఇష్యూ గాని, రైట్స్ గాని ఇచ్చి ఉండకూడదు.
  4.  కేవలం బుక్ విలువ, కంపెనీ భవిష్యత్ అవకాశాలే కాకుండా ఆ కంపెనీ ప్రమోటర్లు లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకి వాటాదారులకు ఉదారంగా బోనస్ ఇవ్వాలన్న మనస్తత్వం ఉండాలి. ఉదాహరణకు కొన్ని కంపెనీల బుక్ విలువ 90 లేదా అంతకుమించి వున్న ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకీ బోనస్ ఇచ్చే మనస్తత్వం ఉండదు. మరి ఆ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ బోనస్ ఇచ్చే దృక్పథం కలవారా, కారా అన్నది మనకెలా తెలుస్తుంది అని మీకు సంశయం రావచ్చు. వెరీ సింపుల్! ఆ కంపెనీ గతంలో ఎన్ని సంవత్సరాలకొకసారి బోనస్ ఇచ్చిందో పాత వార్షిక రిపోర్టర్లు, స్టాక్ మార్కెట్ డేటా చూస్తే సరి. అది కుదరకపోతే 'క్యాపిటల్ మార్కెట్' అనే పత్రికలో మరియు రకరకాల వెబ్ సైట్లలో ప్రతి కంపెనీ తాలూకు డేటా ఇస్తారు. అందులో చూసి నిర్ణయించు కోవచ్చు.

Close