-->

సంపద నిర్వచనాన్ని వివరించి దాని లోపాలు వ్రాయుము? - Describe the definition of wealth and write down its flaws.

Also Read    అర్థశాస్త్రానికి ఒక విశిష్టమైన నిర్వచనాన్ని ఇచ్చి దానికి శాస్త్ర రూపాన్ని ఇచ్చిన మొదటి వ్యక్తి ఆడమ్ స్మిత్. అందుకే ఆయనను అర్ధశాస్త్ర పితామహుడుగా వ్యవహరిస్తారు. అర్థశాస్త్రం "సంపదను గురించి చర్చించే శాస్త్రం” గాఆడమ్ స్మిత్ నిర్వచించాడు. J.B. Say ప్రకారం “సంపదను గురించిన సూత్రాల అధ్యయనమే అర్థశాస్త్రం” గా పేర్కొనవచ్చు. వాకర్ నిర్వచనం ప్రకారం “సంపదకు సంబంధించిన విషయాలతో సంబంధం కలిగినదే అర్థశాస్త్రం”.
పై నిర్వచనాల ప్రకారం, అర్థశాస్త్రం సంపదను మరింతగా పెంచుకోవటానికి ప్రజలు చేసే కార్యకలాపాలను గురించి అధ్యయనం చేస్తుంది.
విమర్శ :- అర్థశాస్త్రం యొక్క సంపద నిర్వచనం Carlyle, Ruskin లచే తీవ్రంగా విమర్శించబడినది. వారి ఉద్దేశ్యంలో అర్థశాస్త్రం
  • సంపదకు అధిక ప్రాముఖ్యత ఇవ్వబడింది.
  • మానవులలో స్వార్థబుద్ధిని పెంచుతుంది.
  • స్మిత్ నిర్వచనంలో సంపద అంటే కేవలం భౌతిక వస్తువులు గానే పరిగణించటం జరిగింది. ఇందులో సేవలను గురించిన ప్రస్తావించలేదు. కనుక ఇది అర్థశాస్త్ర పరిధిని తగ్గించేదిగా ఉందని వీరిద్దరి అభిప్రాయం.

Close