-->

ఆర్థికాభివృద్ధి అనే భావన వివరించండి? - Describe the concept of economic growth?

Also Read

 


    ఆర్ధికాభివృద్ధి అనే భావన చాలా విస్తృతమైనది. ఇది ఆర్ధికవృద్ధితో పాటు మానవజీవిత గమనానికి సంబంధించిన అన్ని రకాల అనుకూల మార్పులను పరిగణనలోనికి తీసుకుంటుంది. అన్నిరంగాల అభివృద్ధిని సమీక్షిస్తుంది. ఈ విధంగా ఆర్ధికాభివృద్ధి అనగా వస్తు సేవల పరిమాణంలో కనిపించే పెరుగుదలతో పాటు, జాతీయ ఆదాయ పంపిణీలోనూ, సాంకేతిక రంగాలలోనూ, సంస్థాపరమైన అంశాలలోనూ సాధించిన అభిలషణీయ మార్పు అని చెప్పవచ్చును. అందుచేత కేవలం వస్తు సేవలలో వృద్ధిని ఆర్థికాభివృద్ధి అనలేం.
    ఆర్ధికాభివృద్ధి ప్రతిఫలాలు అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందక పోవచ్చును. అప్పుడు ధనవంతులు మహా ధనవంతులుగానూ, పేదలు నిరుపేదలు గానూ మారతారు. దీనిని కూడా ఆర్ధికాభివృద్ధి అనలేం. ఇక్కడ ప్రజల నిజ తలసరి ఆదాయాలు పెరిగినాయి కనుక ఆర్ధిక వృద్ధిగా చెప్పవచ్చును. అదే సమయంలో ఆదాయం అసమానతలు కూడా పెరిగినాయి కాబట్టి ఇది ఆర్థికాభివృద్ధిగా పరిగణింపరాదు.

Close