-->

ఎలాంటి వ్యక్తులు షేర్ మార్కెట్ లో అడుగు పెట్టాలి? || What kind of people should step into the share market?

Also Readషేర్ మార్కెట్ అనేది రిస్క్ తో కూడిన వ్యవహారం. తమ డబ్బు పోయినా ఫర్వాలేదు అనుకునేవారు మాత్రమే ఈ రంగంలో రావాలి. అంతేకాని బ్యాంకు వడ్డీ మీద ఆధారపడే వృద్దులు, పెన్షన్ మీద ఆధారపడినవారు, పెండ్లీడు కూతుళ్ళు ఉన్నవారు. కుటుంబమంతా తమ మీద ఆధారపడి వున్న వారు స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడం శ్రేయస్కరం కాదు.

అందువల్ల మీరు స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టాలంటే ఈ క్రింది కేటగిరిలో మీరు దేనికి చెందుతారో తెలుసుకొని తదనుగుణంగా నిర్ణయం తీసుకోండి.

1. మీరు వ్యాపారం చేస్తూ అందులో డబ్బు మిగులుతుంటే ( ఆ డబ్బు తిరిగి వ్యాపారంలో విస్తరణ నిమిత్తం అవసరం లేకుంటే) అందులో కొంత భాగాన్ని నిర్భయంగా స్టాక్ మార్కెట్లో పెట్టవచ్చు.

2. మీరు ఉద్యోగులయి ఉండి మీకు ఇల్లూ, స్థలాలు లాంటివి అంతకుముందే ఉన్నట్లయితే మీరు సైతం కొంత డబ్బు షేర్ మార్కెట్లో పెట్టవచ్చు.

3. మీరు రిటరైపోయి బ్యాంకులో వేసుకున్న వడ్డీ మీద బ్రతుకుతున్న వారయితే అసలు స్టాక్ మార్కెట్ జోలికి రాకండి. మీకు ఆ వయసులో డబ్బు సంపాదించాలన్న ఆశ కూడా ఉండదు కదా! ఏదో జీవితం ప్రశాంతంగా వెళ్తుంటే చాలు కదా అనుకునేవారు స్టాక్ మార్కెట్ పరిసరాలకు కూడా అడుగుపెట్టడం మంచిది కాదు. మరి బ్యాంకు వడ్డీ చాలా తక్కువ వస్తుంది స్టాక్ మార్కెట్ వ్యూహాలు, యుక్తులు 'గైడ్' ఎలా? అనుకునే వారు మ్యూచువల్ ఫండ్ లో ప్రయత్నం చేయవచ్చు. ఇందులో సైతం మీకున్న డబ్బులో 20 శాతం మించి ఇన్వెస్ట్ చేయకండి.

4. మీకు పెళ్ళికెదిగిన కూతుళ్ళు ఉన్నపుడు, వారికి బహుమతి రూపేణా ఏదైనా ఇవ్వాలనుకున్నపుడు స్థలాలు కొనండి. స్టాక్ మర్కెట్లో షేర్లకి ఎవరూ విలువ ఇవ్వడం లేదు.

5. పిల్లలు, ఇంకా వివాహం కాకుండా బాదరబందీలేని వారు తమ డబ్బులో కొద్ది శాతం ఫండమెంటల్స్ ఉన్న షేర్లలో నిర్భయంగా పెట్టుబడి పెట్టవచ్చు.

6. మీరు అప్పుడే ఓ స్థలం అమ్మారు. ఆ డబ్బుని తిరిగి స్థలంలో ఇన్వెస్ట్ చేయాలని లేదు. అలాంటపుడు స్థలం అమ్మగా వచ్చిన లాభాన్ని (మాత్రమే) స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టవచ్చు.


కాబట్టి మీరు పైన పేర్కొన్న వర్గాలలో దేని క్రిందికి వస్తారో తదనుగుణంగా వ్యవహరించండి.

Close