-->

ప్రకృతి విపత్తుతో రాయలసీమ అతలాకుతలమైపోయింది. నరసాపురం సభ వాయిదా - పవన్ కళ్యాణ్

Also Read

ప్రకృతి విపత్తుతో రాయలసీమ అతలాకుతలమైపోయింది... నరసాపురం సభ వాయిదా

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఈ నెల 21వ తేదీన జనసేన పార్టీ జిల్లా నాయకులు, శ్రేణులు వ నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ వాయిదా పడింది. ఈ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. ప్రకృతి విపత్తుతో రాయలసీమ అతలాకుతలమైపోయి, ప్రాణ నష్టం, పంట నష్టం సంభవించిన తరుణంలో బహిరంగ సభ నిర్వహణ భావ్యం కాదని, కోస్తా జిల్లాల్లోనూ రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. ఈ మేరకు సభను వాయిదా వేశారు. అదే రోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ఆ సభలో మత్స్యకారుల సమస్యలు, వారి జీవనోపాధికి కలుగుతున్న విఘాతాలను శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రస్తావించాల్సి ఉంది. నరసాపురంలో సభ ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియచేస్తాం.

Close