-->

Group -II కు ఎప్పుడు ప్రిపేరవ్వాలి? || ఎంత కాలం ప్రిపేరవ్వాలి? || ఇప్పుడు ప్రిపరేషన్ ప్రారంభించాలా? || నోటిఫికేషన్స్ వచ్చాక ప్రిపరేషన్ ప్రారంభిస్తే సరిపోతుందా?

Also Readతెలుగు రాష్ట్రాల్లో Group-II పరీక్షకు ప్రిపేరవ్వాలని, మంచి ఉద్యోగంలో స్థిరపడాలని లక్షల మంది అభ్యర్థులు బలంగా ఆకాంక్షిస్తున్నారు. కాని వారి మనస్సుల్లో అనేక ప్రశ్నలు, సందేహాలు ఉత్పన్నమౌతున్నాయి. వాటిని నివృత్తి చేయడమే ఈ చిన్న వ్యాసం ఉద్దేశం.

  • * Group-II కు ఎప్పుడు ప్రిపేరవ్వాలి?
  • * ఇప్పుడు ప్రిపరేషన్ ప్రారంభించాలా?
  • * అసలు నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి?
  • * ఎంత కాలం ప్రిపేరవ్వాలి?
  • * నోటిఫికేషన్స్ వచ్చాక ప్రిపరేషన్ ప్రారంభిస్తే సరిపోతుందా?

    లాంటి అనేక ప్రశ్నలను మనం హేతుబద్ధంగా విశ్లేషించుకుందాం. లక్షల మంది అభ్యర్థులు సీరియస్ గా పోటిపడుతున్న ఒక ఉద్యోగం మనం సొంతం చేసుకోవాలంటే మనం ఎంత తొందరగ ప్రిపరేషన్ ప్రారంభిస్తే అంత మంచింది. నిజంగా ఉద్యోగం పొందాలని సంకల్పించిన అభ్యర్థులు నోటిఫికేషన్ తో సంబంధం లేకుండ తమ ప్రిపరేషన్ ప్రారంభించడం సరైన నిర్ణయం. వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తే Group-II సిలబస్ మొత్తం చదివి పరీక్షకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలంటే సిలబస్ ను కనీసం 5, 6 సార్లు రివిజన్ చేయవలసి వుంటుంది. కాబట్టి కనీసం 7, 8 నెలల పాటు అంకిత భావంతో ప్రిపేరవ్వాల్సిన అవసరం ఎంతైన ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తే నోటిఫికేషన్లు వచ్చాక ఒత్తిడికి గురవ్వాల్సిన అవసరం వుండదు.

    Group-II పరీక్ష గతంలో వ్రాసి 1, 2 మార్కులు తక్కువ రావడం వలన ఉద్యోగం పొందలేని అభ్యర్థులు, Group-I, సివిల్స్ లాంటి ఉన్నత స్థాయి పరీక్షలకు సిద్ధమౌతున్నవారు కూడా Group-II వ్రాయడం జరుగుతుంది అలాగే గతంలో V.R.O.లు, పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాలు, గ్రామ సచివాలయ ఉద్యోగులుగ పనిచేస్తున్నవారు, ఇతర ప్రైవేట్ ఉద్యోగాలలో కొనసాగుతూ మరింత సౌకర్యవంతమైన, గౌరవప్రదమైన జీవితం పొందాలనుకునేవారు కూడా Group-II పరీక్షకు ప్రిపేరౌతు వుంటారు కాబట్టి వారితో పోటీపడాలంటే వీలైనంత తొందరగ ప్రిపరేషన్ ప్రారంభించాలి. అలాగని మనం వీరందరితో పోటీ పడగలమా అని భయపడవలసిన అవసరం కూడా లేదు.

    ప్రణాళిక బద్ధంగ రోజుకు 5, 6 గంటలు చిత్తశుద్ధితో ప్రిపరేషన్ కొనసాగించిన Group-II ఉద్యోగం సాధించవచ్చు. అయితే గతంలో Group-II పరీక్షకు కరోన లాక్ డౌన్ కన్నా ముందు అనేక సంస్థలు కోచింగ్ అందించేవి కాబట్టి అభ్యర్థుల వందల గంటల సమయం వృధా కాకుండా నిపుణులైన ప్యాకల్టీ సూచనలు పాటిస్తూ, క్లాసులు వింటూ ప్రిపరేషన్ కొనసాగించేవారు. ప్రస్తుతం offline కోచింగ్ అభ్యర్థులకు అందుబాటులో లేనందున అభ్యర్థులు కొంతమేరకు ఇబ్బంది పడుతన్న మాట వాస్తవం కాని మార్పును మన ఇష్టఅయిష్టాలతో సంబంధం లేకుండా మనం స్వాగతించకపోతే మన లక్ష్యాలను చేరుకోవడం మరింత ఆలస్యమౌతుంది కాబట్టి ప్రస్తుతం మనకు అనేక సంస్థలు Group-II పరీక్షకు సంబంధించి online కోచింగ్ అందిస్తున్నాయి కాబట్టి అభ్యర్థి కోచింగ్ తీసుకోవాలా? వద్దా? అని మొదట నిర్ణయించుకోవలసి వుంటుంది. ఒకవేళ కోచింగ్ తీసుకోవాలని నిర్ణయించుకుంటే అత్యధిక మార్కులు వున్న Polity, History, Economy లాంటి సబ్జెక్టుకు అధిక ప్రాధాన్యత (మార్కుల దృష్ట్యా) కాబట్టి ఆయా సబ్జెక్టులు బోధిస్తున్నవారు ఎవరు? వారికి పోటీ పరీక్షల బోధనలో గతంలో అనుభవం ఎంత? లాంటి విషయాలన్ని సమీక్షించుకొని ఒక మంచి online వేదిక ద్వారా కోచింగ్ పొందడం ప్రయోజనకరంగ వుంటుంది. అలాగే ఒక మంచి ఉద్యోగం పొందడం కోసం మనం 6, 7 వేల రూపాయలు వెచ్చించడం అనవసర ఖర్చుగ భావించకూడదు. ఒకవేళ offline కోచింగ్ తీసుకోవాలనుకుంటే ప్రస్తుత కరోనా సంక్షభం నేపథ్యంలో offline కోచింగ్ సాధ్యఅసాధ్యాలు దానికయ్యే ఖర్చు మొదలైనవన్ని ముందే అంచనా వేసుకోవాలి అలాగే ఒక మహానగరంలో ఒక వ్యక్తి వుండి కోచింగ్ తీసుకొనడానికి కోచింగ్ ఫీజ్ తో పాటు నెల నెల అయ్యే ఇతర ఖర్చులకు సంబంధించి వాస్తవిక అంచనాలతో ఆలోచించుకొనవలసిన అవసరం వుంది.

    కోచింగ్ లేకుండ సొంతంగ ప్రిపేరవ్వాలని నిర్ణయించుకుంటే కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు నిపుణులైన, దశాబ్దాల అనుభవం వున్నవారు గైడెన్స్ ఇస్తారు కదా? అది మనం స్వయంగ ప్రిపేరవుతున్నపుడు లభించదేమో అనే అభద్రత భావానికి గురికాకూడదు.

    పై అంశాలన్నీ పునరవలోకనం చేసుకున్న తరువాత అభ్యర్థులు ఒకవేళ నోటిఫికేషన్స్ ఆలస్యమైతే మా మానవ వనరులు వృధా అయిపోతాయోమో అని ఆందోళన చెందకుండా 7, 8 నెలలపాటు పూర్తిస్థాయిలో ప్రిపరేషన్‌కు వెచ్చించి ఏవరికి వారు తాము పరీక్ష వ్రాసి ఉద్యోగం పొందడానికి కావలసిన మార్కులు పొందగలం అన్న నమ్మకం కుదిరేస్థాయికి తమ ప్రిపరేషన్ చేరింది అని విశ్వసిస్తే అప్పుడు ప్రిపరేషన్ కోసం రోజుకు 2, 3 గంటలు వెచ్చిస్తూ వారి, వారి వ్యక్తిగత కార్యకలపాలు, తమ ప్రయివేట్ లేదా పార్ట్ టైం ఉద్యోగం కాని లేదా వారి వారి ఇతర వ్యాపకాలు గాని కొనసాగిస్తూ సమాంతరంగా ప్రిపరేషన్ కూడ కొనసాగించవచ్చు.

    ఇక ప్రయివేట్ ఉద్యోగాలు, ఇతర వ్యాపకాలు వున్నవారు, గృహిణులు, ప్రస్తుతం డిగ్రీ/పి.జి. చదువుకున్నవారు online కోచింగ్ ద్వారా తమ అనుకూల సమయాలలో క్లాసులు వింటు ఇంటి వద్దనే వుండి తమ లక్ష్యం వైపు ప్రయాణం సాగించే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి "మనం నిజంగా ఏదైనా సాధించాలనుకుంటే ప్రపంచమంత కుట్రపన్ని మనకు సహకరిస్తుందని” అల్కెమిస్టు అన్న పుస్తకంలోని ఒక వ్యాఖ్యాన్ని గుర్తు చేసుకుంటు ఇప్పుడే మనం ప్రిపరేషన్‌ను ప్రారంభిద్దాం.

Close