-->

వింత లోకం రెక్కల ఏనుగు కథ - The story of the strange world winged elephant

Also Read

రెక్కల ఏనుగు

    అనగా అనగా ఒకరాజు ఆ రాజుకి ఒక పెద్దతోట ఆ తోటకు కావలాదారుడు సూరయ్య. అతని భార్య నరసమ్మ. వారు తోటలోనే కాపురం ఉండేవారు.
    ఒక రోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతున్నాడు. ఒక వైపున చెట్లు మేసి ఉండటం గమనించారు. రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు తోటంతా తిరిగాడు. కంచె అంతా బాగానే ఉంది. మరి జంతువులు లోపలి కెలా వచ్చాయి? సూరయ్యకు అర్థం కాలేదు.
    ఆ రోజు నుండి ప్రతి రాత్రి సూరయ్య మాటువేసి కాపలాకాశాడు. పున్నమిరాత్రి వచ్చింది. వెన్నెల పిండారబోసినట్లుంది. సూరయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది. అది ఒక అందమైన రెక్కల ఏనుగు మిల మిలా మెరుస్తున్నది. సూరయ్య ఆశ్చర్యానికి అంతులేదు.
    ఆ ఏనుగు తోటంతా తిరిగింది. తనకు ఇష్టమైన ఆకులన్నీ మేసింది. సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు. ఉదయం కావస్తోంది. ఎనుగు ఒక్క సారిగా ఘీంకరించింది. పైకి ఎగిరింది. సూరయ్య గబుక్కున దాని తోకపట్టుకున్నాడు ఆకాశంలో పయనించాడు వింతలోకం చేరాడు. అక్కడ ఎటుచూసినా శత్నరాసులే. భవనాలంతా బంగారుమయం. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు మాట్లాడుతున్నాయి పాములు తోకలపై లేచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి. ఆహా ! ఎన్ని వింతలు, ఎన్ని మాయలు ! సూరయ్య కోరిందే తడవుగా అన్ని ప్రత్యక్షమయ్యాయి. తనకు కావలసినవన్నీ మూట కట్టుకున్నాడు పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకుని భూలోకం చేరాడు.

    ఈ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు. వింత వస్తువులన్నీ చూపాడు. కొంతమంది ఇతని మాటలు నమ్మలేదు. వారందరిని వింతలోకం తీసుకుపోతానన్నాడు పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకు రమ్మన్నాడు.
    పున్నమి రోజు రానే వచ్చింది. అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలో దిగింది. తనకు కావలసిన మేత మేసింది. ఉదయం కాబోతుండగా ఘీంకరించి పైకి ఎగిరింది. సూరయ్య దాని తోక పట్టుకున్నాడు. అతని కాలును నరసమ్మ, ఆమె కాలు మరొకరు, ఇలా అందరూ వేలాడుతూ ఆశంలో ప్రయాణించసాగారు.
    చివరలో మల్లమ్మ వేలాడుతున్నది. ఆమెకు ఒక సందేహం వచ్చింది. ఓపిక పట్టలేక పోయింది. "వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి?" అని పై వారిని అడిగింది. వారు తమ పైవారిని అడిగారు. చివరికి ఆ ప్రశ్న సూరయ్యకు చేరింది సూరయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. గుమ్మడికాయలు ఇంత పెద్దగా ఉంటాయని చూపబోయి చేతులు చాచాడు. అంతే.............................................(ఏమైందో)

Close