-->

Why Invest in the Stock Market? || How to make profits in stock market? || స్టాక్ మార్కెట్ లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి?

Also Read



దీర్ఘాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పెట్టె పెట్టుబడుల్లో వచ్చే లాభాలను చూస్తే స్టాక్ మార్కెట్ ముందు స్థలాలు, బంగారం ఏవైనా దాని తర్వాతనే ఈ క్రింది ఉదాహరణను చూడండి. దీనిని చాలామంది ఇదివరకే చదవి ఉంటారు. ఎందుకంటే ఇది ఒక్కసారి ప్రముఖ తెలుగు దిన పత్రికలో కూడా ప్రచురితమైనది. 1980 లో మీరు విప్రో కంపెనీ 100 రూపాయలు ముఖ విలువగల 100 షేర్లను కొనడానికి మీరు 10, 000 రూపాయలను పెట్టుబడిగా పెట్టి ఉంటే ఇప్పటి వరకు వాటి విలువ సుమారుగా ఎంత ఉంటుందో తెలుసా సుమారు 432 కోట్లు పైననే.
1981 లో ఆ కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది దానితో అప్పుడు మీ దగ్గర ఉన్న షేర్లు 200.
1985లో ఆ కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది మీ షేర్లు 400 అయ్యాయి.
1987 లో ఆ కంపెనీ షేర్ల ముఖ విలువను 10 రూపాయలుగా విభజన దానితో పాటు 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది మీ దగ్గర షేర్లు 8000 అయ్యాయి. 1990లో ఆ కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది మీ షేర్లు 16000 అయ్యాయి.
1993లో ఆ కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది మీ షేర్లు 32000 అయ్యాయి.
1995 లో ఆ కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది మీ షేర్లు 64000 అయ్యాయి.
1998 లో ఆ కంపెనీ 2:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది మీ షేర్లు 192000 అయ్యాయి.
1999 లో ఆ కంపెనీ షేర్ల ముఖ విలువను 2 రూపాయలుగా విభజన మీ షేర్లు 9,60,000 అయ్యాయి.
2004 లో ఆ కంపెనీ 2:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది షేర్లు 28,80,000 అయ్యాయి.
2005 లో ఆ కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది మీ షేర్లు 57,60,000 అయ్యాయి.
2010 లో ఆ కంపెనీ 2:3 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది అప్పుడు మీ షేర్లు 96,00,000 అయ్యాయి.
జూన్ 2011 నాటికి మీ వద్ద 96,00,000 ఆ కంపెనీ షేర్లు ఉన్నాయి ఇపుడు ఆ షేర్ల విలువ లెక్కగట్టి చెప్పండి సుమారు 432 కోట్లు పైననే కావున స్టాక్ మార్కెట్ దీర్ఘాకాల పెట్టుబడికి ఎంతో అనుకూలమైనది.
"First learn and then earn"
Share మార్కెట్ ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్ అనునది చేయడానికి సరైన విజ్ఞానం అవసరం. కావున ముందు తగినంత పరిజ్ఞానం పొందిన తర్వాత మార్కెట్లో మీరు సంపాదించడం మొదలు పెట్టండి. ముందుగా మీరు స్టాక్ మార్కెట్ గురించి లెర్నింగ్ చేయండి. ఈ లెర్నింగ్ ద్వారా మీరు స్టాక్ మార్కెట్ లో ఏర్నింగ్ చేయవచ్చు. మీరు తప్పకుండా ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఏ రంగం లో ఐనా “లెర్నింగ్ లేకుండా ఏర్నింగ్ సాధ్యం కాదు” కాబట్టి మీరు లెర్నింగ్ ప్రారంభించండి.

Close