-->

What is an investment? || How to make a profit in the stock market? || పెట్టుబడి (ఇన్వెస్టింగ్) అనగానేమి ?

Also Read

పెట్టుబడి (ఇన్వెస్టింగ్) అనగానేమి ?

       రేపటి జీవనం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగాలంటే భవిష్యత్తు లో వచ్చే ఆదాయం కోసం మనం సంపాదించిన సంపదలో మన ఖర్చులు పోగా మిగిలిన సంపదను పెట్టుబడిగా పెట్టి మరింత సంపదను పొందడమే పెట్టుబడి. ఈ పెట్టుబడి అనునది మనం స్థిరాస్తి, బ్యాంకు డిపాజిట్లు, వడ్డీ ఆదాయం, అద్దె ఆదాయం, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, సేవింగ్ సర్టిఫికేట్లు, వివిధ పోస్ట్ ఆఫీసు పథకాలు, బంగారం మొదలగు వాటిలో పెడతాం. మన పెట్టుబడి ఒక్క ముఖ్య ఉద్దేశం సంపద సృష్టించడం దానితో పిల్లల కళాశాల ఫీజులు, పెళ్ళిళ్లు, సెలవులో సరదగా గడపడం, మంచి జీవన ప్రమాణానికి రిటైర్మెంట్ తర్వాత జీవితం సాఫీగా జరుగుటకు మీ అనంతరం ఈ సంపద మీ తరాల వారికి చేర్చటం.

     ఈ పెట్టుబడి వల్ల వచ్చే రాబడి పెరుగుతున్న ద్రవ్యోల్బనం కంటే అధికంగా ఉండాలి. ఎప్పుడైనా సరే సంపదను కాపాడటం మరియు దానిని అభివృద్ధి చేయడం అనేది ఒక్క కళ.

      స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి వల్ల మీరు మిగితా వాటిలో పొందిన రాబడి కంటే అధిక రాబడి పొందగలరు కాని దీనికి మీకు స్టాక్ మార్కెట్ పై పరిపూర్ణ జ్ఞానం. దీర్ఘాకాలిక పెట్టుబడి వ్యూహం సరియైన స్టాక్ ను ఎన్నుకోవడం మొదలగు వాటి మీద ఆధారపడి ఉంటుంది. మీరు పెట్టుబడి అనునది మీ సంపాదన మొదలైన తొలినాళ్ల నుండే క్రమ పద్ధతిలో దీర్ఘకాలిక వ్యూహంతో మొదలు పెట్టాలి మీరు తొలినాళ్ళ నుండే మొదలు పెడితే అనుకోకుండా జరిగే ఎలాంటి రిస్కులను తట్టుకోగలరు. అంతే కాకుండా ఒక వేళ మీరు మీ రిటైర్మెంట్ నాటికి యాభై లక్షలు సంపాధించడం మీ లక్ష్యం ఐతే మీరు మీ సంపాదన తొలినాళ్ళ నుండి పెట్టుబడి మొదలు పెడితే మీ లక్ష్యం చేరుకోవటం చాలా సులభం అవుతుంది. మార్కెట్లో పెట్టుబడులు అంటే రిస్క్ అంటారు. స్థిరాస్తి, బంగారం,

       చివరకు మనకు అన్నం పెట్టె రైతన్న చేసే వ్యవసాయం లో కూడా ఎంతో రిస్కు ఉంది. పండించే పంట చేతికి వచ్చే వరకు అనుక్షణం రిస్కు వానలు లోకపోవడం, అధిక వానలు, విద్యుత్తు సమస్య , పురుగులు పట్టడం, మద్దతు ధర మొదలగు రూపాలలో రిస్కు ఉంటుంది. ఇదే విధంగా మీరు ఏ రంగం తీసుకున్న రిస్కు అనేది తప్పకుండా ఉంటుంది.

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులంటే ఏమిటి?

      అని సాధారణ పౌరుడిని ప్రశ్నిస్తే జూదం, లాటరీ, పేకాట గుర్రపు పందెం లాంటి సమాధానాలు రావచ్చు కాని నిజానికి అది అపోహ మాత్రమే. లాటరీ, గుర్రపు పందేలు గెలవడానికి అదృష్టం కావలి. కాని, స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించడానికి అవగాహన, మార్కెట్ రిస్కులను ముందే పసిగట్టగల కాసింత జ్ఞానం కావాలి. స్టాక్ మార్కెట్ అనేది మంచి పెట్టుబడి సాధనం. చక్కటి ప్రణాళిక ద్వారా, క్రమ పద్ధతిలో సమర్థవంతంగా పెట్టుబడి పెడితే చట్టబద్ధంగా స్టాక్ మార్కెట్లో సంపాదించిన సంపదను ఇంకా దేనిలోను సంపాదించలేము. స్టాక్ మార్కెట్ అంటే జూదం అన్న భావన విడనాడి పెట్టుబడులకు ఉపయోగమైన వేదికగా భావించాలి.

Close