-->

కిన్నెర కళాకారుడు శ్రీ మొగులయ్య గారికి శ్రీ పవన్ కల్యాణ్ గారు రూ.2 లక్షల ఆర్థిక సాయం.

Also Read


        ‘భీమ్లా నాయక్'ను పరిచయం చేసే గీతానికి సాకీ ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన శ్రీ దర్శనం మొగులయ్య గారికి రూ.2 లక్షల ఆర్ధిక సాయం అందిస్తునట్లు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన శ్రీ మొగులయ్య గారు 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే అరుదైన కళాకారుడు. వర్తమాన సమాజంలో కనుమరుగవుతున్న ఇలాంటి కళలు, ముఖ్యంగా జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలనే తపన శ్రీ పవన్ కల్యాణ్ గారిలో ఉంది. శ్రీ మొగులయ్య గారు కిన్నెర మీటుతూ పలు జానపద కథలను పాటల రూపంలో వినిపిస్తారు. ఆయనకు శ్రీ పవన్ కల్యాణ్ గారు తన ట్రస్టు 'పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్' ద్వారా రూ.2 లక్షలు అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు కార్యాలయ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన చెక్కును శ్రీ మొగులయ్య గారికి అందచేస్తారు.

Close