-->

ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల ( AP POLYCET RESULTS 2021 )

Also Read

ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్-2021 ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభివద్ధి శిక్షణశాఖమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మంచి ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. జగనన్న విద్యాదీవెన ద్వారా 81వేల మంది విద్యార్థులకి రూ.128 కోట్లు అందజేశామని పేర్కొన్నారు. 72 వేల మంది విద్యార్థులకి రూ.54 కోట్లు జగనన్న వసతి దీవెనగా అందించామని చెప్పారు.

అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా శ్రీకాకుళం, అత్యధిక బాలికల ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా నెల్లూరు అని పేర్కొన్నారు. అత్యధిక బాలుర ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా ప్రకాశం అని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ డైరెక్టర్ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ బంగారు రాజులు పాల్గొన్నారు.

Check the Results: https://polycetap.nic.in/Default.aspx

Close