-->

షేర్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారా? || స్టాక్ మార్కెట్ లాభాలు పొందడం ఎలా? || మూలధనం (కాపిటల్) అనగా నేమి?

Also Read

షేర్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారా?

ఒక్క క్రికెట్ ఆటగాడు అంతాతీయ క్రికెట్ లో ప్రవేశించినప్పుడు అతడి ప్రదర్శన మీద అతడి భవిష్యత్తు ఎలా ఆధారపడి ఉంటుందో షేరు మార్కెట్లోకి ప్రవేశించే చిన్న ఇన్వెస్టర్ కు కూడా ఇదే వర్తిస్తుంది. మొదటి సారి కొన్న షేరు మంచి లాభాలు ఇవ్వకపోయినా కనీసం నష్టాల బారిన పడవేయకుండా ఉంటే చిన్న ఇన్వెస్టర్ మరోసారి మార్కెట్లోకి అడుగు పెడతాడు. ఫలితం దీనికి భిన్నంగా ఉంటే షేరు మార్కెట్ అంటే భయపడతాడు. మార్కెట్ అంటేనే జూదశాల అంటూ శాపనార్థాలు పెట్టె వారి జాబితాలోకి చేరి పోతాడు. మార్కెట్ రేసులో విజేతగా నిలవడమా, పరాజయం పాలవటమా అన్నది చాలా సందర్భాలలో అది మీ చేతులలోనే ఉంటుంది.

సమయం కేటాయించగలరా!

షేర్లకు, ఇతర పెట్టుబడి సాధనాలకు ఎంతో భేదం ఉంది. షేర్లు కొనేసి కొన్నాళ్ళు వాటి గురించి మరచిపోదాం అంటే కుదరదు. మీరు కొన్న షేరు ధరలను, వాటిని ప్రభావితం చేసే పరిణామాలను ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి. అందుకే మొట్టమొదటి సారి షేర్ల కొనుగోలుకు దిగేముందు తన పెట్టుబడులను నిరంతరం పర్యవేక్షించడం కొరకు ఎంత సమయం కేటాయింగలమన్న విషయాన్ని తేల్చుకోవాలి. కనీసం వారానికి ఒక్కసారి ఐన ధరలను గమనించకపోతే లాభాల అవకాశాలు చేజారిపోతాయి. షేరు మార్కెట్, ఆర్థిక పరిస్థితులకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఆర్థిక రంగంలో జాతీయంగా అంతర్జాతీయముగా జరిగే అనేక పరిణామాలు మార్కెట్ ను ప్రభావితం చేస్తాయి స్టాక్ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే ఈ అంశాలపై అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి కనీసం షేర్ల ధరలను ప్రభావితం చేసి అంశాలపై అవగాహన పెంచకోవాలి ఆ విషయాలలో మీ గురించి మీరు సంతృప్తి చెందితే షేర్లలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించవచ్చు.
మీరు తప్పకుండా సమాచార సేకరణ తప్పనిసరిగా చేయాలి ఫలానా పేరు కొంటే లాభాల పంటే నంటూ ఊరించే టిప్స్ కూ లోటూ లేదు. వీటిని చూసిన ఇన్వెస్టర్ కు మార్కెట్ అంటే లాభాల గనిలా అనిపిస్తుంది లాభాలకు దారి చూపేది మీ అవగాహనా మాత్రమేనని తెలుసుకోవాలి.

మూలధనం (కాపిటల్) అనగా నేమి:

మీరు స్వంతంగా ఐస్ క్రీం వ్యాపారం ప్రారంభించాలి అంటే దానికి మూలధనం (కాపిటల్) కావాలి. మీరు ఆ మూలధనాన్ని వ్యాపారం ప్రారంభించడానికి కావలసిన బిల్డింగ్, యంత్ర పరికరాలు, ముడిసరుకు కొరకు వినియోగించి వ్యాపారం ప్రారంభిస్తారు ఒక వేళ మీ దగ్గర సరిపడా మూలధనం లేనప్పుడు దానిని సమకూర్చుకోవడానికి మీకు రెండు మార్గాలు కలవు. మొదటిది మీరు బ్యాంకు ల నుండి లేదా ఇతర మార్గాల ద్వారా అప్పు తీసుకోవాలి. ఐతే మీరు ఈ విధంగా అప్పు తీసుకోవడంతో మీరు ప్రతి నెల వడ్డీ చెల్లించడంతో పాటు తీసుకున్న అప్పు కూడా చెల్లించాలి. ఇక రెండవది తన సంస్థలో భాగస్వామ్యం ఇవ్వడం ద్వారా ఆసక్తి కలిగిన ప్రజల నుండి కావలసిన ధనాన్ని సేకరించడం వలన కంపనీ ప్రారంభించడానికి కావలసిన మూలధనాన్ని సమకూర్చుకోవడం. ఈవిధంగా సేకరించిన ధనంతో మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.

ఈవిధంగా వాటా ( షేర్) ఇవ్వడం వలన కలిగే లాభాలు.

  • ఈ విధంగా వాటా ఇవ్వడం వలన కంపెనీ తనకు కావలసిన మూలధనం కంటే అధిక ధనాన్ని. 
  • సమకూర్చుకోవడం అప్పుల వాళ్ళకు లేదా బ్యాంకులకు చెల్లించే విధంగా.
  • ప్రతి నెల చెల్లించాల్సిన వడ్డీ భారం దీనివలన ఉండదు.
  • సేకరించిన అసలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

వాటా ఇవ్వడం వలన కలిగే నష్టాలు:

  • ప్రధాన యాజమాన్యంతో పాటు వాటాదారులు కూడా యాజమాన్య హక్కును కలిగి ఉంటారు.
  • వాటాదారులు సంస్థ కార్యకలాపాలను ప్రభావితం చేసి హక్కును కలిగి ఉంటారు.

Close