-->

బౌద్ధమతం అంటే ఏమిటి? | అన్ని పోటీ పరీక్షల కోసం స్టడీ నోట్స్ | What is Buddhism? | Study Notes for All Competitive Exams| History |

Also Read

బౌద్ధ మతం

గౌతమ బుద్ధుడు - (563-488)
జననం - లుంబినీ వనం (పద్మం)
మహాభినిష్క్రమణం - కపిలవస్థు (గుర్రం)
సంబోధి - గయ (బోధివృక్షం)
ధర్మచక్ర పరివర్తనం - సారనాథ్ (చక్రం)
మరణం - కుసీనగరం (స్థూపం)

  • క్రీ.పూ. 6వ శతాబ్దంలో హిందూ మతానికి వ్యతిరేకంగా 62 (శ్రమణులు ఉద్యమాలు), మత ఉద్యమాలు జరిగాయి. వాటిలో ప్రధానమైన
    1) బౌద్ధమతం, 2) జైనమతం, 3) అజీవిక, 4) చార్వాక

గౌతమబుద్ధుడు :

  • బుద్దుని మొదట ప్రస్తావించిన విదేశీయుడు -క్లిమెంట్
  • ఈ మతాన్ని గౌతమ బుద్ధుడు (క్రీ. పూ. 563-483) స్థాపించాడు. బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు.
  • బుద్దునికి గల ఇతర పేర్లు - శాక్యముని, తధాగతుడు, అంగీరసుడు అని కూడా పిలుస్తారు. ఇతను గౌతమి గోత్రానికి చెందినవారు.
  • ఇతడు 'శాక్య' తెగకు చెందినవాడు. ఇతడిని శాక్యముని అని కూడా పిలుస్తారు.
  • శాక్య తెగ కపిలవస్తు అనే రాజ్యాన్ని పాలించినది.
  • తండ్రి శుద్దోదనుడు తల్లి మహామాయ.
  • మహామాయ కపిలవస్తు నుంచి, శ్రావస్థికి వెళుతుండగా మార్గమధ్యంలో "లుంబిని” (నేపాల్) అనే గ్రామంలో సిద్ధార్థుడు జన్మించారు.
  • సిద్ధార్థుడు జన్మించిన ఏడు దినములకు మహామాయ చనిపోగా, అతని పినతల్లి గౌతమీ ప్రజాపతి ఇతడిని పెంచి పోషించింది.
  • బౌద్ధమతంలో చేరిన మొదటి మహిళ "గౌతమీ ప్రజాపతి".
  • సిద్ధార్థుని భార్య పేరు "యశోధర", కుమారుడు - రాహులుడు, రధసారధి - చెన్న.
  • బుద్ధుడి గుఱ్ఱం పేరు "కంఠక".
  • 29వ ఏట కపిలవస్తు నగర పర్యటనలో నాలుగు విషయాలను గమనించాడు.
    1) వృద్ధుడు, 2)రోగి, 3) శవం, 4) సన్యాసి.
  • ఈ దృశ్యాల ప్రభావం వలన జ్ఞానాన్వేషణ చేయుచూ ఇళ్ళు వదిలి వెళ్ళిపోతాడు.
  • ఈ ఘటనను “మహాభినిష్క్రమణము" అంటారు.
  • బుద్ధుని గురువులు - రుద్రక రామపుత్ర, అలారకలామ.
  • 35 ఏళ్ళ వయసులో "గయ"లో బోధివృక్షం కింద 49 రోజులు ధ్యానం చేశాడు. బీహార్‌లోని గయ నిరంజన నదీతీరాన గలదు. ఇచ్చటనే బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు.
  • దీనిని "సంభోధి" అని పిలుస్తారు.
  • ఈ చెట్టుపై ఉండి బుద్దుని దీక్షభగ్నం చేయుటకు ప్రయత్నించినది "మార" అనే దుష్టశక్తి,
  • అప్పటి నుంచి సిద్ధార్థుడు బుద్ధుడు అయ్యాడు. బుద్ధుడు అనగా పూర్ణ జ్ఞానం కలవాడు.
  • జ్ఞానోదయం తరువాత సారనాథ్ లోకి జింకలవనంలో మొదటి సారిగా తన ఐదుగురు శిష్యులకు ఉపదేశం చేశాడు.
  • ఈ ఉపదేశాన్ని "ధర్మచక్ర పరివర్తనం" అంటారు.
  • క్రీ.పూ 483లో తన 80వ యేట "కుసి" నగరంలో చనిపోయాడు. దీనినే మహాపరి నిర్మాణము అంటారు.
  • బుద్దుని లైట్ అఫ్ ఏసియా అని వర్ణించినది - ఎడ్విన్ ఆర్నాల్డ్.
  • బుద్దుని ప్రపంచజ్యోతి అని వర్ణించినది శ్రీ మతి రైస్ డేవిడ్స్.
  • బౌద్దమత గ్రంధాలూ : 1) త్రిపీఠకములు 2) జాతక కథలు
  • బౌద్ధమతంలో ప్రధాన శాఖలు - హీనయానం, మహాయానం
  • మహాయాన మతస్థులు బుద్ధునితోపాటు, బోధిసత్వుని ప్రతిమలను కూడా తయారుచేసి పూజించారు.
  • భవిష్యత్ లో జన్మించబోయే బుద్ధుడి పేరు - మైత్రేయ.
  • క్రీ.శ. 5వ శతాబ్దం నుంచి బౌద్ధమతంలో “వజ్రయానం” అనే మూడవశాఖ ప్రారంభమయినది. ఇది మంత్ర తంత్రాలతో కూడినది.
  • స్థూపాలు : బుద్ధుని అస్థికలపైన నిర్మించిన కట్టడాలు. ఇవి వారి దేవాలయాలుగా విలసిల్లుతున్నాయి.

ఆ స్థూపాలు మూడు రకాలు :

1) ధాతు గర్భ స్థూపాలు : బుద్ధుని గానీ, బౌద్ధ సన్యాసుల యొక్క గానీ అస్థికలను ఉంచి నిర్మించిన స్థూపాలు.
2) పారిభోజకాలు : మతగ్రంథాలు, లేదా భిక్షవుల వస్తువులను నిక్షిప్తం చేసి వాటి పై నిర్మించిన స్థూపాలు.
3) ఉద్దేశిక స్థూపాలు : ఏ వస్తువులు లేకుండా నిర్మించిన స్థూపం.
  • భారతదేశంలో అతి పెద్ద స్థూపం సాంచీ స్థూపం (మధ్యప్రదేశ్)
  • ప్రపంచంలో అతి పెద్ద స్థూపం - బోరోబుదురు స్థూపం (జావా, ఇండోనేషియా)
  • భారతదేశంలో ప్రాచీన స్థూపం - పిప్రావహ
  • దక్షిణ భారతదేశంలో ప్రాచీన స్థూపం - భట్టిప్రోలు.
  • దక్షణ ప్రాచీన భారతదేశంలో 84,000 స్థూపాలు నిర్మించినది - అశోకుడు.
  • బుద్ధుని ధాతువు "భట్టిప్రోలు" (గుంటూరు జిల్లా) స్థూపంలో ఉంది.
  • ఆరామం - బౌద్ధ సన్యాసుల నివాస గృహాలు లేదా విశ్రాంతి గదులు.
  • చైత్యము - పూజా మందిరాలు.
  • బౌద్ధమత భిక్షవుల వ్యవస్థను "సంఘం" అంటారు.

Close