-->

నిద్రలో కలలవల్ల కలిగే స్థలనాలను అదుపు చెయ్యడం ఎలా? అవి ఆరోగ్యానికి హానికరమా? (How to control the tops that are caused by sleeping dreams?)

Also Read

నిద్రలో కలలవల్ల కలిగే స్థలనాలను అదుపు చెయ్యడం ఎలా?
సమాధానం: అది సహజంగా జరిగేదే! శరీరపు పెరుగుదలతో పాటు హార్మోన్ల స్థాయులలో మార్పులు వస్తాయి. ఈ మార్పులు అప్పుడే యౌవనంలోకి అడుగు పెడుతున్న వారి మనస్సులలో అలజడినీ, అశాంతిని కలిగిస్తాయి. ఈ మార్పులు శరీరంలోనూ, మనస్సులోనూ కామపూరితమైన ఆలోచనలను రేకెత్తిస్తాయి. అవి స్వప్న స్థలనాలుగా బహిర్గతమవుతాయి. ఇవికాక వేరే రకాల కారణాలు ఉండవచ్చు కూడా! ఎక్కువగా తినడం, ఎక్కువగా నిద్రించడం, మనస్సులో అలజడి కలిగించే ఆహారాన్ని తినడం, కామోద్రేకాన్ని కలిగించే బొమ్మలను చూడడం, సాహిత్యాన్ని చదవడం మొదలైనవి. ఇదొక సహజమైన విషయం కాబట్టి దీన్ని గురించి అంతగా కలత చెందవలసిన పనిలేదు. నిద్రలో కలగంటున్నప్పుడు వీర్యాన్ని కోల్పోవడం అంత హానికరం కాదు. కానీ పూర్తిగా చైతన్య స్థితిలో ఉండి కృత్రిమమైన పద్ధతుల ద్వారా కామభోగాల ద్వారా వీర్యాన్ని పోగొట్టుకోవడం ఎంతమాత్రం పనికిరాదు. ఏది ఏమైనా స్వప్నస్థలనాలను కూడా అదుపు చెయ్యడమే ఉత్తమం.
కలలద్వారా కలిగే స్థలనాలను అదుపులో పెట్టడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
1. రాత్రిపూట మితంగా ఆహారం తీసుకోవడం
2. చన్నీటితో స్నానం చెయ్యడం
3. నిద్రపోయే ముందు మంచి మంచి పుస్తకాలు చదవడం, భగవన్నామాన్ని జపం చేయడం, చిత్తశుద్ధితో ప్రార్థన చెయ్యడం
4. నిద్రలోకి జారుకోబోయే ముందు దేవుడి చిత్రాన్ని చూడడం
5. త్వరగా నిద్రించి, త్వరగా మేలుకోవడం స్వప్నస్థలనాలను అదుపు చెయ్యడానికి తోడ్పడతాయి. చాలావరకు కలలు తెల్లవారబోయే ముందు వస్తాయి. వేకువనే నిద్రలేవడాన్ని అలవాటు చేసుకున్నవారు స్వపృష్ఠలనాలను సులభంగా అదుపు చేయవచ్చు.

Close