-->

రక్త పీడనం (Blood Pleassure)

Also Readరక్తాన్ని వల వంటి రక్త నాళాల ద్వారా ప్రవహింప చేయాలంటే చాలా ఎక్కువ ఒత్తిడి కావాలి. గుండెలోని జఠరికలు సంకోచించి అతిథిగా పీడనంతో రక్తాన్ని ధమనులలోకి పంపుతాయి. జఠరికలు పీడనాన్ని కోల్పోయి యథాస్థితికి చేరుతూ, తర్వాత సంకోచానికి సిద్ధమవుతాయి.
డాక్టర్లు సిగ్మా మానోమీటర్ అనే పరికరంతో రక్తపీడనాన్ని కొలుస్తారు. రక్త పీడనం మన శరీరంలోని వివిధ శరీరభాగాల్లో వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు శరీరంలో నియమితమైన ప్రదేశంలో మాత్రమే రక్తపీడనాన్ని కొలిస్తే వేర్వేరు సమయాల్లో పీడనాన్ని సరిపోల్చటానికి అవకాశం ఉంటుంది. అందువలన డాక్టర్లు మన దండచేయి ( మీ చేయి పైభాగం) లో ఉండే ధమని పీడనాన్న మాత్రమే కొలుస్తారు.
రక్త పీడనానికి సంబంధించి డాక్టర్లు రెండు రీడింగ్ నమోదు చేస్తారు. జఠరికలు అత్యంత ఎక్కువ పీడనంతో రక్తాన్ని ధమనిలోనికి పంపినప్పుడు మొదటి రీడింగ్ తీస్తారు. ఇది ఆరోగ్యవంతులైన యువతీ యువకులలో 120 మీ. మి పాదరస పీడనం గా ఉంటుంది. దీనినే సిస్టోలిక్ పీడనం (Systole) అంటారు. జఠరికలు - యధాస్థితికి చేరుతూ రక్తాన్ని నింపుకునే సమయంలో రెండవ రీడింగ్ తీస్తారు. ఇది 80 మీ. మీ  పాదరస పీడనానికి సమానంగా ఉంటుంది. దీన్ని డయాస్టోలిక్(Diastole) పీడనం అంటారు.
రక్త పీడనం మనం చేసే పనిని బట్టి మారుతూ ఉంటుంది. విశ్రాంతి, నడవడం, పరుగెత్తడం వంటి పనులులో వేర్వేరుగా ఉంటుంది.
ఈ సమయంలో సాధారణం (120/80) కంటే ఎక్కువ రక్త పీడనం (B.P) ఉన్నట్లయితే ఆ వ్యక్తికి రక్తపోటు (Hypertension) ఉన్నట్లుగా భావిస్తారు.

Close