-->

వ్యవసాయ పంచాంగం 2021 (Part - 1)

Also Read

వ్యవసాయ పంచాంగం


    పంచాంగంను అనుసరించి చేసే వ్యవసాయంను వ్యవసాయ పంచాంగం అంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో స్థానిక పంచాంగాన్ని అనుసరించి వ్యవసాయం చేస్తుంటారు. పంచాంగాన్ని అనుసరించి వేసే పంటల వలన పంట సులభంగా బతకడమే కాకుండా అధిక దిగుబడులు రావడానికి అవకాశాలున్నాయి.

కార్తె

మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు. తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు. తెలుగు రైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు. తరువాతి తరాలకూ ఆ జ్ఞానం అందేలా చేశారు. పురుగుమందులు, జన్యుమార్పిడి విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలతో భయం గొలుపుతున్న కొత్త సమాజంలో రాబోయే రోజుల్లో ఇంకా కొత్త సామెతలు పుట్టవచ్చు. జోతిష్కులు 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు, పంచాంగాలు తయారు చేశారు. సూర్యోదయముప్పుడు ఏ చుక్క (నక్షత్రం) చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పున్నమి రోజు చంద్రుడు ఏ చుక్కతో ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తను అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారుచేసుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలిచారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. సంవత్సరానికి 27 కార్తెలు. తెలుగు ప్రజానీకం చంద్ర మానాన్ని పాటిస్తుంటే తమిళులు సౌర మానాన్ని పాటిస్తున్నారు. తెలుగు రైతులు తరతరాలుగా తమ అనుభవాలలో నుంచి సంపాదించుకున్న వ్యవసాయ వాతావరణ విజ్ఞానాన్ని 'కార్తెలు', నాటి పై సామెతల రూపంలో ప్రచారం చేశారు. ఆయా కార్తెలు నెలలు రాశులు వారీగా పైరులకు వాతావరణం ఎలా ఉంటుందో అందరికీ అర్ధమయ్యేలా సామెతలలో ఎలా చెప్పుకున్నారో చూడండి:

కార్తెలు 27

1.అశ్వని 2. భరణి 3 .కృత్తిక 4. రోహిణి 5. మృగశిర 6. ఆరుద్ర 7. పునర్వసు 8. పుష్యమి 9. ఆశ్లేష 10. మఖ 11. పుబ్బ 12. ఉత్తర 13. హస్త 14. చిత్త 15. స్వాతి 16. విశాఖ 17. అనూరాధ 18. జేష్ట్య 19. మూల 20. పూర్వాషాడ 21. ఉత్తరాషాడ 22. శ్రవణం 23. ధనిష్ట 24. శతభిషం 25. పుర్వాబాద్ర 26.  ఉత్తరాబాద్ర 27. రేవతి

Read More Topics :

  1. వివిధ కార్తెలో చేయవలసిన వ్యవసాయ పనులు
  2. కార్తెల పై సామెతలు | రాశులు వారీగా సామెతలు | సామాన్య శాస్త్రం
  3. వ్యవసాయ పంచాంగం 2021

Close