-->

రాజ్యాంగం అస‌లు కాపీని బాక్స్‌లో ఎందుకు ఉంచారో తెలుసా? (Why is the Indian Constitution kept in Nitrogen?)

Also Read

 

Why is the Indian Constitution kept in Nitrogen?

1950, జ‌నవ‌రి 26న భార‌త రాజ్యాంగం అమ‌ల్లోకి వ‌చ్చిన సంద‌ర్భంగా ప్ర‌తి ఏటా జ‌న‌వ‌రి 26ను రిప‌బ్లిక్ డేగా జ‌రుపుకుంటాం. మ‌న‌ది ప్ర‌పంచంలోనే అతి పెద్ద లిఖిత పూర్వ‌క రాజ్యాంగం. దీనిని రాయ‌డానికి మొత్తం 2 ఏళ్ల‌, 11 నెల‌ల‌, 18 రోజులు ప‌ట్టింది. ఈ రాజ్యాంగం అస‌లు ప్ర‌తిని పార్ల‌మెంట్‌లోని సెంట్ర‌ల్ లైబ్ర‌రీలో ఉంచార‌న్న విష‌యం  కూడా చాలా మందికి తెలుసు. అయితే రాజ్యాంగానికి సంబంధించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ఉన్నాయి. ఇవి బ‌హుశా చాలా మందికి తెలిసి ఉండ‌క‌పోవ‌చ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

👉మొత్తం మూడు కాపీలు

భార‌త రాజ్యాంగానికి సంబంధించి అస‌లు కాపీలు మొత్తం మూడు ఉన్నాయి. ఈ కాపీల‌న్నీ పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ లైబ్ర‌రీలోనే ఉన్నాయి. వీటిని మూడు గ‌దుల్లో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య ఉంచారు. అస‌లు కాపీ 22 అంగుళాల పొడ‌వు, 16 అంగుళాల వెడ‌ల్పు ఉంటుంది. మొత్తం 251 పేజీల్లో ఈ రాజ్యాంగం ఉంది. 

👉హీలియం గ్యాస్ ఉన్న గాజు గ్లాసులో..

ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన లిఖిత పూర్వ‌క రాజ్యాంగం అస‌లు కాపీని కాపాడుకోవ‌డం చాలా ముఖ్య‌మైనది. దీనికోసం ప్ర‌భుత్వం చాలా జాగ్ర‌త్త‌లే తీసుకుంటుంది. అందుకే ఈ అస‌లు కాపీల‌ను హీలియం గ్యాస్ నింపిన బాక్స్‌లో ఉంచారు. హీలియం గ్యాస్ ఎందుకు వాడుతార‌న్న‌దీ ఆస‌క్తిక‌ర‌మే. సాధార‌ణంగా ఆక్సిజ‌న్ ఎక్కువ‌గా ఉన్న వాతావ‌ర‌ణంలో ఇది త్వ‌ర‌గా పాడ‌వుతుంది. ఆక్సిజ‌న్ పేప‌ర్‌పై ఉన్న ప‌దార్థం, ఇంకుతో ప్ర‌తిచ‌ర్య జ‌రిపి అది త్వ‌ర‌గా పాడ‌య్యేలా చేస్తుంది. అదే హీలియం గ్యాస్ మాత్రం ఎలాంటి ప్ర‌తిచ‌ర్య జ‌ర‌ప‌దు. దీనివ‌ల్ల అస‌లు కాపీ పాడ‌వ‌కుండా చాలా కాలం అలాగే ఉంటుంది. 

మొద‌టి సంత‌కం ప్ర‌ధానిది..

ఈ రాజ్యాంగం అస‌లు కాపీని ఇక్క‌డ ఉంచే ముందు రాజ్యాంగ ప‌రిష‌త్‌లోని మొత్తం 284 మంది స‌భ్యులు దీనిపై సంత‌కాలు చేశారు. అయితే దీనిపై తొలి సంత‌కం మాత్రం అప్ప‌టి రాష్ట్ర‌ప‌తిగా ఉన్న రాజేంద్ర ప్ర‌సాద్ చేయ‌లేదు. ఆయ‌న‌కు బ‌దులు అప్ప‌టి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ చేశారు. వీళ్ల‌లో 46 మంది స‌భ్యులు హిందీలో సంత‌కాలు చేశారు. వీళ్లలో ఈ ముసాయిదాను రూపొందించ‌డంలో పాలుపంచుకున్న 15 మంది మ‌హిళ‌లు కూడా ఉన్నారు.

Close