-->

UNICEF - యునైటెడ్ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ ఎమర్జెన్సీ ఫండ్‌ (UNICEF - United Nations International Children's Emergency Fund)

Also Read

      


 

        1946 నుంచి పని చేస్తున్న UINCEF బడుగు వర్గాలలోని బాలబాలికలకు అసరాగా పనిచేస్తోంది. ప్రాథంమిక ఆరోగ్యం, విద్య, మలేరియా వ్యాధి నిర్మూలనం, పౌష్టికాహారం, గ్రామీణాభివృద్ధి, కుటుంబ, శిశు సంక్షేమం మొదలైనవి వీరి కార్యక్రమాలు. 1965కే UNICEF సేవలకి గుర్తింపుగా నోబెల్‌ పురస్కారం లభించింది.

        భారతదేశంలో భూమిలో లభ్యమయ్యే జల వనరులలో ఫ్లోరైడ్ నిల్వల వలన నష్టపోతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌, రాజాస్థాన్‌లు ముఖ్యం. ఈ రాష్ట్రాలలో చిన్న పిల్లలను ఫ్లోరైడ్ బారి నుండి కాపాడటానికి UINCEF గణనీయంగా కృషి చేసింది.

వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (WHO) - ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యాలు :

  1. వ్యాధి నివారణ, నిర్మూలన. 
  2. వ్యాధులు విస్తరించకుండ చర్యలు చేపట్టడం.

        పౌర ఆరోగ్యానికి, వ్యాధి నివారణకు అవసరమైన చర్యలు WHO రాజ్యాలకు అందజేస్తూ ఉంటుంది. పరిశోధనల ఫలితంగా అందివచ్చిన సమాచారాన్ని WHO రాజ్యాలకు పంపుతుంది. మలేరియా నివారణకు, క్షయ వ్యాధికి తీసుకోవలసిన నివారణ చర్యల పట్ల, కొత్త వ్యాక్సిన్‌లను గురించి, శిక్షణా శిబిరాలను నిర్వహిస్తుంది. గత 20 సంవత్సరాలుగా HIV (హ్యూమన్ ఇమ్యూన్‌ డేఫిషియన్సీ) వ్యాధి ప్రబలటంతో WHO దీనిపట్ల శ్రద్ధ వహిస్తోంది. ప్రచారం ద్వారా అపోహాలను తొలగించి, తక్షణ చర్యలను చేపట్టనికి రాజ్యాలతో సహకరిస్తోంది.

       WHO చేపట్టిన అతిపెద్ద కార్యక్రమంలో పల్స్‌పోలియో కార్యక్రమం. పోలియో వ్యాధి నిర్మూలనకు WHO యొక్క సేవలు ప్రశంసనీయం. పొగాకు వాడకం, కష్ట నష్టాలపై కూడ WHO శ్రద్ధవహిస్తోంది.

FAO - ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ :
    
    రోమ్‌లో హెడ్‌క్వార్టర్స్‌ గల ఈ సంస్థ గ్రామీణాభివృద్ధిపై బాగా శ్రద్ధ వహిస్తుంది. పేదరిక నిర్మూలనకు, ఆహార భద్రతకుFAO వ్యవసాయాభివృద్ధి ద్వారా కృషి చేస్తోంది.

ILO - ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ :

    శ్రామిక వర్గాల జీవన ప్రమాణాలని మెరుగుపరచనికై ILO కృషి చేస్తోంది. శ్రామికుల అనారోగ్య సమస్యలు, వారి హక్కులపట్ల శ్రామికులకు అవగాహన పెరిగేందుకు ILO పని చేస్తోంది.

UNIDO - యునైటెడ్ నేషన్స్‌ ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ :

    ఈ సంస్థ ప్రపంచ స్థాయిలో పారిశ్రామికాభివృద్ధికై కృషి చేస్తోంది.
        1945 తరువాత యుద్దాలనేవి మొదటగా మానసిక స్థాయిలో రూపొందించబడినాయి. కనుక, శాంతి సహకారాలను కూడ మానసిక స్థాయిలోనే మొదట రూపొందించాలనే వాదన బలపడసాగింది. అంతర్జాతీయ సహకారంతో శాంతి, పెంపొందగలదని సమితి ప్రారంభ దశ నుండి ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Close