-->

ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana(PMJJBY)

Also Read

 


  అర్హత :

 • 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన బ్యాంకు పొదుపు ఖాతాదారులలందరూ అర్హులే.  ఒక వ్యక్తికి ఒక పాలసీ మాత్రమే వర్తిస్తుంది.
ప్రీమియం :

 • సంవత్సరానికి రూ. ౩౩౦/- ఆటో  డెబిట్ విధానంలో ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ( అదనంగా సేవా పన్ను విధించే అవకాశం ఉంది)

 ప్రయోజనాలు :

 • పాలసీదారునికి సాధారణ మరణం సంభవిస్తే వారు నామినేట్ చేసిన వ్యక్తికి బీమా రూ. 2   లక్షలు లభిస్తాయి.  అంగవైకల్యంప్రమాదం జరిగితే బీమా వర్తించదు.
 • ముగింపు తేదీ కంటే ముందుగానే ప్రతిపాదిత సభ్యులు మరణిస్తే భీమ చేసిన సొమ్ము మొత్తం ప్రీమియం సకాలంలో సంక్రమంగా చెల్లించి ఉన్నట్లయితే ప్రతిపాదించిన లబ్ధిదారులకు చెల్లించబడుతుంది.

లబ్ధిదారుని నియామకం :

 • ప్రతి సభ్యుడు లేదా సభ్యురాలు భార్య లేదా భర్తలు తమ పిల్లలనుఆధారపడిన వారిని లబ్ధిదారులుగా  నియమించుకోవాలి.  లబ్ధిదారు  మైనరు అయితే బీమా ప్రయోజనాలు అందుకునే వ్యక్తి పేరును సభ్యుడు తప్పక పేర్కొనాలి.  ఇట్లు  పేర్కొనడాన్ని నామినేషన్ అంటారు.  సభ్యులు మృతి చెందితే రికార్డు ప్రకారం సభ్యుడు నామినేట్ చేసిన నా వ్యక్తికి బీమా ప్రయోజనాన్ని అందిస్తారు.

 సమయ వ్యవధి :

 • ప్రతి సంవత్సరం జూన్ 1 నుండి మే 31 వరకు పాలసీని తీసుకోవచ్చు.
 • 50 సంవత్సరాలు నిండే టప్పుడు పథకం లోకి ప్రవేశించిన వారికి,  55 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది.

 నిబంధనలు :

 • ఖాతాదారుడు పాలసీ తీసుకునేటప్పుడుపూర్తి ఆరోగ్యవంతులంప్రీమియం కట్టగలం”  అనే సొంత ధ్రువీకరణ  పత్రాన్ని సమర్పించాలి.

 బీమా రద్దయ్యే సమయం :

 • సభ్యుని వయసు  వార్షిక పునరుద్ధరణ తేదీకి 55 సంవత్సరాలు నిండిన నట్లయితే
 • బ్యాంకు ఖాతా మూసి వేయడం లేదా భీమా పథకం ప్రీమియం చెల్లించడానికి అవసరమైన సొమ్ము ఖాతాలో లేకపోవడంతో
 • సాంకేతిక  కారణాలవలన  లేదా ప్రీమియం చెల్లించడానికి అవసరమైన   సొమ్ము లేక రద్దయిన పాలసీల విషయంలో  పెంచిన గడువులోగా ప్రీమియం చెల్లించిఆరోగ్య దృవీకరణ పత్రం అందజేస్తే బీమా  సదుపాయాన్ని పునరుద్ధరిస్తారు.
 • పథకం పరిధిలోని భీమా ప్రయోజనాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి.  వీటిని   అసైన్ మెంట్  చేయడం, తనఖా పెట్టడం వంటివి చేయడానికి వీలు లేదు.
 • ఒక నెల రోజుల ముందు నోటీసులు ఇచ్చి రద్దు చేయడానికి, సవరించడానికి బ్యాంకు పూర్తి హక్కు ఉంది.

Close