-->

అగ్ని-P (AGNI-PRIME) అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఆధునిక అగ్ని ప్రైమ్‌ క్షిపణిని భారత్‌ విజయవంతంగా పరీక్షించింది

Also Read


అగ్ని-P (AGNI-PRIME) :

భారతదేశం తనకంటూ సొంతంగా క్షిపణులు ఉండాలని 1980లలోనే భావించి ఇంటిగ్రేటెడ్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. మాజీ రాష్ట్రపతి, భారత రత్న ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ నేతృత్వంలో మొదలైన ఈ కార్యక్రమం తొలి ఫలం ‘‘అగ్ని’’. సుమారు 900 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి తరువాత దశల వారీగా మరిన్ని అగ్ని శ్రేణి క్షిపణుల తయారీ జరిగింది. అయితే, ఆ కాలం నాటి టెక్నాలజీలతో పనిచేసే క్షిపణులను ఈ 21వ శతాబ్దానికి అనుగుణంగా మార్చుకోవాలని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ఐదేళ్ల క్రితం చెప్పుకున్న సంకల్పానికి అనుగుణంగానే సరికొత్త అగ్ని–ప్రైమ్‌ సిద్ధమైంది. ఇరుగుపొరుగు దేశాలతో ముప్పు ఏటికేడు పెరిగిపోతున్న నేపథ్యంలో అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్లగల అగ్ని–ప్రైమ్‌ మన అమ్ముల పొదిలోకి చేరడం విశేషం. తొలి తరం అగ్ని పరిధి 1,000 కిలోమీటర్ల లోపు కాగా.. అగ్ని–ప్రైమ్‌ సుమారు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా అత్యంత కచ్చితత్వంతో మట్టుబెట్టగలదు. ఇంకోలా చెప్పాలంటే తొలి తరం అగ్ని క్షిపణి పాకిస్తాన్‌ను దృష్టిలో ఉంచుకుని తయారైతే.. అగ్ని–ప్రైమ్‌ కొత్త శత్రువు కోసం సిద్ధం చేశారని అనుకోవచ్చు. ఎందుకంటే.. 2,000 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటే.. చైనా మధ్యలో ఉండే లక్ష్యాన్ని కూడా ఢీకొట్టవచ్చు.

అగ్ని – P అనేది అగ్ని తరగతి చెందిన న్యూ జనరేషన్ వేరిమంట్

అగ్ని – P క్షిపణి 1000 మరియు 2000 km ల మధ్య శ్రేణి సామర్ధ్యం కలిగి వుంది.

అగ్ని – P ని DRDO రూపొందించి మరియు అభివృద్ధి చేసింది

DRDO – చైర్మన్ -> Dr G సతీష్ రెడ్డి

Close