-->

సుప్రీం కోర్ట్ మరాఠా రిజర్వేషన్లు ఎందుకు చెల్లవు అని చెప్పింది? (How Marathas got reservation, and what happens now)

Also Read

 


మరాఠా రిజర్వేషన్లు చెల్లవు : సుప్రీం

        50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగరీత్యా చెల్లుబాటు కాదని మరాఠాల రిజర్వేషన్ల కేసులో సుప్రీంకోర్టు విస్పష్టంగా తీర్చు చెప్పింది. వారికి విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకమంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదంటూ 1992లో ఇచ్చిన మండల్‌ తీర్పునకు ఇది విరుద్ధమని పేర్కొంది. ఆ పరిమితిని మించి మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు అసాధారణ కారణాలు ఏవీ లేవని పేర్కొంటూ... ఆ ఉత్తర్వుల్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు 2021 మే 5న కీలక తీర్పు వెలువరించింది. మండల్‌ తీర్పును ధ్రువీకరిస్తూ పలుమార్లు నిర్ణయాలు వెలువడినందున దాని పునఃపరిశీలనకు మళ్లీ విసృత ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన పనిలేదని కోర్టు స్పష్టం చేసింది. తాజాగా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గా(ఎస్‌ఈబీసీ)ల జాబితాను వెలువరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటిపై కొత్త నోటిఫికేషన్‌ వచ్చే వరకు ప్రస్తుత జాబితా చెల్లుబాటు అవుతుందని తెలిపింది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలో జస్టిస్‌ ఎల్‌, నాగేశ్వరరావు, జన్చిన్‌ ఎన్‌.అబ్బల్‌ నజీర్‌, జన్నిన్‌ హేమంత్‌గుప్త, జన్సిన్‌

ఎస్‌.రవీంద్రభట్‌లతో కూడిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. విచారణలో భాగంగా 102వ రాజ్యాంగసవరణను తదనంతర (ప్రభావం చూపే ప్రాధాన్య అంశంగా పరిగణించింది. ఇది రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది.


అసాధారణ పరిస్థితులు లేవు :

మండల్‌ తీర్పు” ప్రకారం కొన్ని ప్రత్యేకమైన, అసాధారణ పరిస్థితుల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. అయితే మరాఠాల. విషయంలో అలాంటి సందర్భం లేదు. ఎం.సి. గైక్వాడ్‌ ఆధ్వర్యంలోని మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌ సమర్పించిన నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారు. ఈ నివేదికలోని గణాంకాలు పరిశీలించినప్పుడు వారు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినట్టు కనిపించలేదు. ఉన్నత ఉద్యోగాలు, విద్యలో వారికి గణనీయమైన స్థానమే ఉంది. జనాభా శాతానికి తగ్గట్టుగా ఉద్యోగాలు లేవన్న వాదన సరికాదు. వారికి 16 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదు. “మరాఠాలు ప్రభావశీలమైన ఉన్నత వర్షానికి చెందిన వారు. ప్రధాన జాతీయ జీవన స్రవంతి లో ఉన్నవారు” అని వ్యాఖ్యానించింది.

 

తీర్పు పునఃపరిశీలన అవసరం లేదు

 

మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదంటూ ఇందిరా సాహ్నీ కేసులో 9 మంది సభ్యుల ధర్మాసనం 1992 తీర్చు చెప్పింది. దీన్నే మండల్‌ తీర్పుగా అభివర్ణిస్తుంటారు. అనంతరం జరిగిన రాజ్యాంగ సవరణలు, సామాజికపరంగా వచ్చిన మార్పుల కారణంగా ఈ తీర్పును పునఃపరిశీలించాలన్న వాదనలు వచ్చాయి. అయితే ఈ తీర్పును ఆమోదిస్తూ కనీసం నాలుగు సందర్భాల్లో రాజ్యాంగ ధర్మాసనాలు నిర్ణయాలు వెలువడినందున దీనిని మరోసారి పరిశీలించాల్సిన అవసరం లేదు. 11 మంది సభ్యుల విసృత రాజ్యాంగ ధర్మాసనానికి పంపించాల్సిన పనిలేదు. “50 శాతం పరిమితిని మార్చాలంటే అది సమానత్వ ప్రాతిపదికన కాకుండా కుల ఆధారిత సమాజం అవుతుంది. రాజకీయ ఒత్తిళ్లతో రిజర్వేష న్లను పెంచుకుంటూ పోతే అసమానతలు తగ్గించడం కష్టమవుతుంది. పురోగమనం కాకుండా అందరూ వెనుక కంటే దేశంలో స్తబ్దత ఏర్పడుతుంది. అది రాజ్యంగ ఆశయాలకు విరుద్ధం” అని పేర్కొంది. వెనుకబడిన వర్ధాల అభివృద్ధికి ఒక్క రిజర్వేషన్ల సరిపోవని, ఇతర సంక్షేమ చర్యలు ఉండాలని సూచించింది.

 

సవరణ రాజ్యాంగ బద్దమే కానీ....

 

ఎస్‌ఈబీసీల గుర్తింపునకు సంబంధించిన 102వ రాజ్యాంగ సవరణ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నవరణ రాజ్యాంగబద్ధమేనని ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. అయితే బీసీ కులాల జాబితాలను చేర్చే అధికారం ఎవరికి ఉండాలన్న అధికారంపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఇది కేవలం రాష్ట్రపతికి (అంటే కేంద్ర ప్రభుత్వానికి) ఉందని ముగ్గురు న్యాయమూర్తులు మెజార్టీ తీర్పును వెలువరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు చేయవచ్చని స్పష్టం చేశారు. ఇద్దరు న్యాయమూర్తులు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ ఉందని తెలి పారు. ఈ రాజ్యాంగ సవరణ ఉద్దేశం రాష్ట్రాల అధికాం లను తీసివేయడం కాదని పేర్కొన్నారు. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాల అధికారాలను హరించలేదని కేంద్రం వాదించింది. దానికి మద్దతు లభించినట్టయింది. దీని ద్వారా సమాఖ్య వ్యవస్థకు నష్టం కలగలేదని పేర్కొంది. అయితే బీసీలను గుర్తించడం, వారిని వర్గీకరిం చడం, రిజర్వేషన్లు అమలు చేయడంలో రాష్ట్రాలు అధికారాలను కోల్పోయినట్టు మెజార్టీ తీర్పు ద్వారా వెల్లడయింది. రిజర్వేషన్లను సమర్థిస్తూ గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడంతో అవి చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.

 

ఏమిటీ కేసు?

 

ఫడణవీస్‌ ప్రభుత్వం 2018లో మరాఠాలను బీసీలుగా గుర్తించి 16 శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 52 శాతం నుంచి 68%కి పెరగడంతో కొందరు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విద్యారంగంలో 18 శాతానికి, ఉద్యోగాల్లో 12 శాతానికి పరిమితం చేస్తూ తీర్చు వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మొత్తం రిజర్వేషన్లనే కొట్టివేసింది.

 

ఏమిటీ 102వ రాజ్యాంగ సవరణ?

 • ఈ సవరణ ద్వారా కొత్తగా రెండు అధికరణాలు 338బీ, 842 చేర్చారు.
 • 338బీ: వెనుకబడిన వర్ణాల జాతీయ కమిషన్‌ ఏర్పాటు, దాని విధివిధానాలు, అధికారాలు, బాధ్యతలకు సంబంధించినది.
 • 342ఏ: ఏదైనా కులాన్ని సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన వర్షం (ఎస్‌ఈబీసీ)గా నోటిపై చేయడానికి రాష్ట్రపతికి ఉన్న అధికారాలను వివరించేది. అదేవిధంగా ఎస్‌ఈబీసీ జాబితాల్లో మార్పులు చేయడా నికి పార్లమెంటుకు ఉన్న అధికారాలను తెలియజేసేది.

సుప్రీంకోర్టు విచారణ జరిపిన అంశాలు

 • 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్‌ఈబీసీలను గుర్తించడంలో రాష్ట్రాలకు ఉన్న అధికారాలను తొలగించినట్టు అయిందా?
 • ఇది సమాఖ్య వ్యవస్థకు విరుద్ధంగా ఉందా?
 • ఈ రాజ్యాంగ సవరణను కొట్టి వేయాలా?
 • కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రిజర్వేషన్లను 50 శాతానికి మించి ఇచ్చే అవకాశం ఉండగా... అలాంటి పరిస్థితి మరాఠాల విషయంలో ఉందా?
 • ఇప్పటికే రిజర్వేషన్లు ఇచ్చినందున అవి చెల్లుబాటు అవుతాయా?
 • రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న తీర్చు పునః పరిశీలనకు విసృత రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలా?

4 కేసుల్లో 3 ఏకగ్రీవం

·        మరాఠాల రిజర్వేషన్లతో పాటు, 102వ రాజ్యాంగ నవరణ చెల్లుబాటుపై వచ్చిన నాలుగు కేసులపై కోర్టులో విచారణ జరిగింది. మూడింటిపై ఏకగ్రీవ తీర్పులు వచ్చాయి. ఒక్కదాని విషయంలో మాత్రం 3:2 మెజార్టీతో తీర్పు వెలువడింది.

1. మరాఠాల కోటా

·        రాజ్యాంగ విరుద్ధమని అయిదుగురు న్యాయ మూర్తుల ఏకగ్రీవ తీర్పు

2.“మండల్‌ తీర్చు” పునఃపరిశీలన

·        అయిదుగురు జడ్జీల ధర్మాసనం ఏకగ్రీవంగా తిరస్కరణ

3. ఇప్పటికే అమలైన మరాఠా కోటా చెల్లుబాటవుతుందని ఏకగ్రీవంగా తీర్పు.

4. ఎస్‌ఈబీసీల గుర్తింపు

 • కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంది- జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వరరావు, జస్టిస్‌ హేమంత్‌గుప్త, జస్టిస్‌ ఎస్‌. రవీంద్రభట్‌ల మెజారిటీ తీర్పు
 • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ ఉంది- జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ అబ్బుల్‌ నజీర్‌ల మైనార్టీ తీర్పు
 • ఇందులో భాగంగా 102వ సవరణ రాజ్యాంగ బద్ధమేనని ఏకగ్రీవ తీర్పు


Close