-->

Current Affairs Question and Answers for Telugu || Daily Current Affairs Quiz 2021 for Competitive Exams

Also Read

 

*🔥కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్🔥*


• పాడి పరిశ్రమలో సమర్థవంతమైన పునరుత్పాదక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ (EESL) తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1) నీతి ఆయోగ్
2) సుగంధ ద్రవ్యాల బోర్డు
3) నేషనల్ హార్టికల్చర్ బోర్డు
4) జాతీయ పాల అభివృద్ధి బోర్డు✅

• ఏ అధునాతన లైట్ హెలికాప్టర్ డెక్ ఆపరేషన్ సామర్థ్యాలను HAL ప్రదర్శించింది?
1) ఆదిత్య
2) త్రిదేవ్
3) అర్జున్
4) ధ్రువ్✅

• ప్రాణాంతక వైరల్ నెర్వస్ నెక్రోసిస్ (VNN) వ్యాధికి దేశంలో తొలి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?
1) సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- హైదరాబాద్
2) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ-పూణే
3) సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్-చెన్నై✅
4) సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- లక్నవూ

• యయోగన్ -34 అనే కొత్త రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన దేశం?
1) దక్షిణ కొరియా
2) జపాన్
3) నార్వే
4) చైనా✅

• ప్రపంచంలో తొలి సెమీకండక్టర్ డిజైన్, ప్రాసెస్‌లో 2 నానోమీటర్ (nm) నానో షీట్ టెక్నాలజీ పురోగతి తో చిప్ ను ఆవిష్కరించిన సంస్థ?
1) టీసీఎస్
2) ఐబీఎం✅
3) విప్రో
4) హెచ్‌సీఎల్

• వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో “డాగ్ -1 మిషన్ టు ది మూన్” (“DOGE-1 Mission to the Moon”)ను ఏ సంస్థ ప్రారంభిస్తుంది?
1) స్పేస్‌ఎక్స్✅
2) నాసా
3) ఇస్రో
4) సిఎన్ఆర్ఎస్

• తీవ్రమైన కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి డిజిసిఐ ఆమోదించిన యాంటీ కోవిడ్ ఓరల్ డ్రగ్‌ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
1) రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ✅
2) ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్
3) ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్
4) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ

• తక్కువ ఖర్చుతో కూడిన 3 వెంటిలేటర్లు, ప్రాణ, వాయు స్వస్తా అనే ఆక్సిజన్ కాన్సన్ట్రెటర్లను అభివృద్ధి చేసిన సంస్థ?
1) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్✅
2) రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ
3) భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
4) ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్

• మేఫ్లవర్ 400 అనే ప్రపంచంలోని తొలి తెలివైన ఓడను అభివృద్ధి చేయడానికి సాంకేతిక భాగస్వామిగా పనిచేసిన సంస్థ ఏది?
1) ఐబీఎం✅
2) టీసీఎస్
3) విప్రో
4) మైక్రోసాఫ్ట్

• ఆన్‌లైన్ వరద సమాచార, ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం?
1) అసోం✅
2) ఉత్తరాఖండ్
3) హిమాచల్ ప్రదేశ్
4) మహారాష్ట్ర


*🔥జ్ఞానేంద్రియాలు ప్రాక్టీస్ బిట్స్ 🔥*


• మానవ శరీరంలో జ్ఞానేంద్రియాల సంఖ్య?
ఎ) 5✅
బి) 3
సి) 4
డి) 10

• మానవ శరీరంలో చర్మం బరువు సుమారుగా ఎంతశాతం?
ఎ) 20
బి) 50
సి) 5
డి) 15✅

• చెమటలో ఉండే పదార్థాలు?
ఎ) నీరు, సోడియం క్లోరైడ్
బి) నీరు, యూరియా
సి) నీరు, సోడియం క్లోరైడ్, యూరియా✅
డి) సోడియం క్లోరైడ్ మాత్రమే ఉంటుంది

• చెమటలో నీరు, సోడియం క్లోరైడ్ శాతాలు వరుసగా?
ఎ) 99, 0.2 - 0.5✅
బి) 0.5, 99
సి) 5, 90
డి) 0.5, 0.2

• ‘ది జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్’ అని దేన్ని పిలుస్తారు?
ఎ) చెవి
బి) కన్ను
సి) చర్మం✅
డి) గుండె

• విటమిన్-డి అనేది ఏ పదార్థ రూపాంతరం?
ఎ) యూరియా
బి) కోలెస్టిరాల్✅
సి) లిపిడ్లు
డి) ప్రోటీన్లు


• జ్ఞాన కేంద్రాలు మెదడులోని ఏ భాగంలో ఉంటాయి?
ఎ) మస్తిష్కం✅
బి) అనుమస్తిష్కం
సి) మజ్జాముఖం
డి) ఏదీకాదు

• సల్ఫర్ సంబంధ లేపనాలను ఏ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు?
ఎ) ఎఖిని
బి) ఫ్లూరైటిస్
సి) సోరియాసిస్
డి) స్కేబీస్✅

• చర్మ శుద్ధి కర్మాగారాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
ఎ) కేరళ
బి) తమిళనాడు✅
సి) కర్ణాటక
డి) బీహార్

• దీర్ఘ దృష్టి ఉన్నవారు వాడే కటకం?
ఎ) పుటాకార
బి) కుంభాకార✅
సి) సమతల
డి) ద్వికుంభాకార

• వర్ణాంధత్వం (కలర్ బ్లైండ్‌నెస్) అనేది?
ఎ) విటమిన్-ఎ లోపం వల్ల వస్తుంది
బి) పోషకాహార లోపం వల్ల వస్తుంది
సి) అనువంశిక వ్యాధి✅
డి) ఏదీకాదు

• కిందివాటిలో చర్మ వ్యాధి కానిది?
ఎ) ఎక్జిమా
బి) సోరియాసిస్
సి) క్షయ✅
డి) ఎఖిని


*🔥Polity ప్రాక్టీస్ బిట్స్ 🔥*


• ఒక రాష్ర్ట గవర్నర్ అనుభవించే అధికారాలకు సంబంధించి కింది వివరణను పరిశీలించండి?
1) ప్రతి సంవత్సరం జరిగే శాసనసభ తొలి సమావేశం ప్రారంభంలో గవర్నర్ ప్రసంగిస్తారు
2) శాసనసభ పరిశీలనలో ఉన్న ఒక బిల్లుకు సంబంధించి అతడు శాసనసభకు సందేశాలు పంపవచ్చు.
3) అతడు రాష్ర్ట శాసన సభను సమావేశ పరచవచ్చు, వాయిదా వేయవచ్చు, రద్దు చేయవచ్చు.
4) రాష్ర్ట హైకోర్టు అధికారాలకు భంగం కలిగించే ఒక బిల్లుకు అతని ఆమోదం తెలుపవచ్చు.☑️

• కింది వారిలో గవర్నర్ నియమించనిది ఎవరు?
1) రాష్ర్ట మంత్రి మండలి
2) రాష్ర్ట అడ్వకేట్ జనరల్
3) రాష్ర్ట పోలీస్ డెరైక్టర్ జనరల్☑️
4) రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు

• అశోక్ మెహతా కమిటీ పంచాయతీ రాజ్ వ్యవస్థకు ఎన్ని అంచెల విధానాన్ని సిఫార్సు చేసింది?
1) 3
2) 2 ☑️
3) 1
4) 4

• భారత రాజ్యాంగంలో ‘విద్య’ ఏ జాబితాలో ఉంది?
1) ఉమ్మడి జాబితా ☑️
2) కేంద్ర జాబితా
3) రాష్ర్ట జాబితా
4) అవశిష్ట అంశాలు

• ఒక రాష్ర్ట గవర్నర్‌ను అతని పదవి నుంచి రాష్ర్టపతి తొలిగించేది ఎప్పుడు?
1) రాష్ర్ట ముఖ్యమంత్రి వినతితో
2) లోకాయుక్త సలహాతో
3) కేంద్ర కేబినెట్ సలహాపై☑️
4) అటార్నీ జనరల్ సలహాపై

• మూల రాజ్యాంగం ప్రాథమిక హక్కులను ఏడు రకాలుగా వర్గీకరించింది కానీ అవి ఇపుడు ఎన్ని?
1) ఐదు
2) నాలుగు
3) ఎనిమిది
4) ఆరు☑️

• ప్రస్తుత లోక్‌సభలో సీట్ల కేటాయింపు ఏ జనాభా లెక్కల ప్రకారం జరిగింది?
1) 1951
2) 1971☑️
3) 2001
4) 1991

• భారత రాజ్యాంగం ప్రకారం ఏ వ్యవస్థను రాజ్యాంగపు ‘రక్షకుని’గా గుర్తించారు?
1) పార్లమెంటు
2) సుప్రీంకోర్టు☑️
3) కార్యనిర్వాహకశాఖ
4) ఏవీకావు

• ప్రతిపాదన (A): ఒక రాష్ర్ట ముఖ్యమంత్రి ఆ రాష్ర్ట మంత్రి మండలి అధినేత
హేతువు (R): ముఖ్యమంత్రి శాసన సభకు బాధ్యత వహిస్తాడు, సభలో మెజార్టీ మద్దతును అనుభవిస్తాడు.
1) A, R లు విడివిడిగా సరైనవి. R, Aకు సరైన వివరణ☑️
2) A, R లు విడివిడిగా సరైనవి కానీ A కు R వివరణ కాదు
3) A సరైంది కానీ R తప్పు
4) A తప్పు కానీ R ఒప్పు

• కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. రాష్ర్ట మంత్రిమండలి లేకుండా గవర్నర్ విధులు నిర్వహించలేడు
బి. రాష్ర్ట శాసనసభలో సభ్యుడు కానీ వ్యక్తి మంత్రిగా నియమించలేం
సి. ముఖ్యమంత్రి మరణం/రాజీనామా తర్వాత కొంతకాలం పాటు రాష్ర్టమంత్రి మండలి విధుల్లో కొనసాగుతుంది
డి. ముఖ్యమంత్రి లేనపుడు రాష్ర్టమంత్రి మండలి అత్యవసర సమావేశాలకు హోంశాఖ మంత్రి మాత్రమే అధ్యక్షత వహిస్తాడు.
1) ఎ మాత్రమే ☑️
2) సి, డి
3) ఎ, బి, డి
4) ఎ, బి, సి, డి


*🔥ఇండియన్ పాలిటి బిట్స్🔥*


*🥀1.విట్లీ కౌన్సిల్ ను పోలిన వ్యవస్థ లేని దేశం? అమెరికా*

*🥀2.సిటిజన్ చార్టర్ రూపకల్పన జరిగిన దేశం ?రిటన్*

*🥀3.కంప్యూటర్ టెక్నాలజీని సిటిజన్ టెక్నాలజీ గా పిలిచిన వారు ఎవరు?న్వెట్ గ్రింగ్రిచ్*

*🥀4. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒకే వ్యక్తికి ఒక ఓటు అని పేర్కొన్నది ఎవరు ?అంబేద్కర్*

*🥀5.అభివృద్ధి రాజ్యమున అని పిలుస్తున్న దేశం ?దక్షిణ కొరియా*

*🥀6.క్లైంట్ చార్టర్ మొదటిసారిగా ప్రవేశ పెట్టిన దేశం? మలేషియా*

*🥀7.ప్రభుత్వ పాలన పై మొట్టమొదటి గ్రంథం?ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్*

*🥀8.స్టడీ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ అనే గ్రంథాన్ని రచించిన వారు? ఎల.డి.వైట్.*

*🥀9.క్రమానుగత శ్రేణి స్కాలర్ ప్రక్రియ అని పిలిచిన వారు ఎవరు? మూనీ అండ్ రెలీ*

*🥀10.కార్యనిర్వాహక నిధులను POSDCORB అనే పదంలో వివరించారు?లూథర్ ఖల్లిక్*

*🥀11.జవహర్లాల్ నెహ్రూ అభిప్రాయంలో ప్రభుత్వ పాలనలో కేంద్రబిందువు? ప్రజల సంక్షేమం*

*🥀12. డిపార్ట్మెంట్ ఏ రకమైన ఏజెన్సీ ?లైన్ ఏజెన్సీ*

*🥀13.గిరిజన సంక్షేమ శాఖ ఏ నియమం ఆధారంగా ఏర్పడింది? ఆశ్రితులు.*

*🔥ఇండియన్ ఎకానమీ బిట్స్🔥*

*💐1.మన దేశంలో గ్రామీణ ప్రాంతాల స్త్రీలు, పిల్లల అభివృద్ధి కోసం సమగ్ర గ్రామాన్ని అభివృద్ధి పథకంలో భాగంగా ప్రారంభించబడిన సంవత్సరం?1982*

*💐2.జాతీయ నమూనా వ్యవస్థ సర్వే మన దేశ పరిస్థితులను అనుకూలంగా వేసిన అంచనాలు ఏ నిరుద్యోగి తమకు సంబంధించినవి? సాధారణ స్థితి నిరుద్యోగిత,వారం వారీ స్థితి నిరుద్యోగిత*

*💐3.ఆధునిక పద్ధతుల ఉపయోగం వల్ల శ్రామికులకు ఉపాధి అవకాశాలను కోల్పోవటం ను ఏమంటారు?సాంకేతికపరమైన నిరుద్యోగిత*

*💐4.పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో సాధారణంగా ఏర్పడే నీ స్వచ్ఛత నిరుద్యోగిత భావనను వివరించినది?జె.యం.కీన్సు*

*💐5.వ్యవస్థాపన సౌకర్యాలు ఉండే పట్టణ ప్రాంతాలకు జనాభా తరలిపోకుండా ఎక్కువ మంది నివసించే గ్రామీణ ప్రాంతాలలో వ్యవస్థాపన సౌకర్యాలు కల్పించుట మొదలైన పద్ధతిని వ్యాఖ్యానించిన వారు ఎవరు?ఎ.ఎం.ఖుస్రో*

*💐6.అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనీస వ్యయౌ ఆధారంగా నిర్ణయించబడింది ?పేదరికపు గీత*

*💐7.ఒక వ్యక్తికి తన కనీస జీవన అవసరాలకు తీర్చుకోవటానికి సరిపడే ఆదాయం లేని స్థితిని తెలియజేసేది ?నిరూపించ పేదరికం*

*💐8.భారతదేశంలో అత్యధిక పేదరికం గల రాష్ట్రం క్రమం?బీహార్,ఒరిస్సా.*

*💐9.ప్రపంచ బ్యాంకు వర్గీకరణ ప్రకారం మీద పేదరిక గీతను నిర్ణయించే దినసరి వినియోగ వ్యయం?రెండు*

*💐10.పేదరిక గీతకు దిగువనున్న వారి ఆదాయ అంతరాలు పుట్టిన తర్వాత దీనిని ఉపయోగించి సేన్ పేదరిక సూచిని నిర్ణయించవచ్చు ?అంతరాల భరితాలు*

*💐11.మన దేశంలో పేదరికం లో అత్యధికంగా ఉన్న వర్గాలవారు?చేనేత పనివారి.*

*💐12.భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలను తయారు చేసింది? కేంద్ర గణాంకాల సంస్థ*

*💐13..భారతదేశపు దీర్ఘకాలం జనాభా విధానం లక్ష్యం 2045 నాటికి మన దేశ జనాభా? నియంత్రించడం, మెరుగుపరచడం*.


*🔥ఇండియన్ ఎకానమీ బిట్స్🔥*


*🥀1.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామతీర్థ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎక్కడ నెలకొల్పబడింది?ప్రకాశం జిల్లాలో*

*🥀2.జనరల్ నాలెడ్జ్ సెంటర్లను పర్యవేక్షించే ది ఎవరు?ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ సంస్థ*

*🥀3. భారతదేశంలో 1987లో రాష్ట్రం గా మార్చిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? అరుణాచల్ ప్రదేశ్*

*🥀4.ప్రపంచంలో సాపేక్షంగా తక్కువ భూ ఉపరితలంపై ఎక్కువ జనాభా కేంద్రీకృతం చేయడాని ఏమంటారు?జనాభా ఇంఫ్లోజన్*

*🥀5.కేంద్ర ప్రభుత్వం రకమైన జాతీయ ఆహార భద్రత మిషన్ ద్వారా ఉత్పత్తి పెంచాలని కున్న పంట?వరి గోధుమ పప్పు ధాన్యాలు*

*🥀6.ఆర్థిక వ్యవస్థలో ఒక పని నుంచి మరొకరికి శ్రామికులు మారడం వల్ల ఏర్పడేది? సంఘష్ట నిరుద్యోగత*

*🥀7.జనవరి 2006లో భారత దేశంలో ప్రవేశపెట్టిన సూక్ష్మ వ్యవసాయ పథకం లక్ష్యం ?నీటి వాడకం సామర్థ్యాన్ని పెంచడం*

*🥀8.భారతదేశంలో ఉన్న అల్ప ఉద్యోగిత నుఏమంటారు?ప్రచ్ఛన్న నిరుద్యోగిత.*

*🥀9.కేంద్ర ప్రభుత్వం అమలు చేయుచున్న సంఘం యువజన ఎవరి సంక్షేమానికి ఉపయోగపడుతుంది?గ్రామీణ మహిళలకు*

*🥀10.2008లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఎవరి సంక్షేమాన్ని పెంపొందించారు? బాలికలు*

*🥀11.భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోల్డెన్ షేక్ పథకం ఎవరికి సంబంధించింది ?స్వచ్ఛంద పదవీ విరమణ చేయు వారికి*

*🥀12.ప్రసూతి మరణాల రేటును నిర్ధారించుటకు ప్రసూతి మరణాల నిష్పత్తి దేనితో లెక్కించబడుతుంది?ఒక లక్షణాలు*

*🥀13.ల్యాండ్ లైసెన్సు డు కల్టివేటర్ 2011లో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ రుణ అర్హత కార్డుల పంపిణీ ద్వారా ఎవరికి రుణ సౌకర్యాలు కల్పించి ఉద్దేశించబడింది?కౌలు రైతులు*.


*🔥ఇండియన్ పాలిటి బిట్స్🔥*


*✔️1.ప్రభుత్వ సర్వీసులకు అభ్యంతరం కానిదేది? లింగ భేదం*

*✔️2.ఇండియాలో అవశిష్ట అధికారాలను ఎవరికీ ఉంటాయి?కేంద్రం*

*✔️3.ప్రధానమంత్రి సచివాలయానికి ఇంకొక పేరు?సూక్ష్మ కేబినెట్*

*✔️4. పార్లమెంట్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించేది ?స్పీకర్*

*✔️5.రాష్ట్ర గవర్నర్ ఎవరికి బాధ్యత వహిస్తాడు ?రాష్ట్రపతి*

*✔️6.సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు?60 సంవత్సరాలు*

*✔️7. మంత్రిమండలి సచివాలయం ?స్టాఫ్ ఏజెన్సీ*

*✔️8.బ్రిటిష్ కాలంలో కేంద్ర ప్రభుత్వ పాలన.ఏ చట్టంలో ఉంది? 1919 చట్టం.*

*✔️9. మంత్రిమండలి సంఖ్యను నిర్ణయించేది ?రాష్ట్రపతి*

*✔️10.ప్రణాళిక సంఘం అనేది ఒక? సలహా పూర్వక సంస్థ*

*✔️11.రెవెన్యూ బోర్డు ఏర్పాటైన సంవత్సరం?1972.*

*✔️12. 1947 కు ముందు రాష్ట్రపతి భవన్ ను ఏమని పిలిచేవారు?వైస్ రీగల్ వసతిగృహం*

*✔️13.కేంద్ర ఎన్నికల కమిషన్ ను త్రిసభ్య కమిషన్ గా ఎప్పుడు మార్చారు?1993.*


*🔥Polity ప్రాక్టీస్ బిట్స్ -🔥*


• పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు సంబంధించి కింది వాటిలో కారణం కానిది ఏది?
1) లాభదాయక పదవుల్లో ఉండటం
2) విదేశాలకు విధేయత చూపడం
3) ద్వంద్వ సభ్యత్వం
4) పన్ను బకాయిపడటం✅

• కింది వాటిలో లోక్‌సభ స్థానాలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది?
1) 31వ సవరణ
2) 42వ సవరణ
3) 84వ సవరణ
4) పైవన్నీ✅

• పౌర సమాజంలో అంతర్భాగం కానిది?
1) స్వచ్ఛంద సంస్థలు
2) కుల సంఘాలు
3) శాసనసభ ✅
4) కుటుంబం

• జిల్లా ప్రణాళికా కమిటీ అనేది ఒక..?
1) రాజ్యాంగపరమైన సంస్థ✅
2) చట్టపరమైన సంస్థ
3) రాజ్యాంగేతర సంస్థ
4) సలహా సంస్థ

• కింది వాటిలో జిల్లా స్థాయిలో సామాజిక న్యాయ కమిటీలను సూచించింది ఏది?
1) బి.పి.ఆర్. విఠల్ కమిటీ
2) జలగం వెంగళరావ్ కమిటీ✅
3) డి.కె. సమరసింహారెడ్డి కమిటీ
4) హనుమంతరావు కమిటీ

• కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది?
1) 2002
2) 1996
3) 2004
4) 2006✅

• స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘కంపల్సరీ ఓటింగ్’ పద్ధతిని ప్రతిపాదించిన రాష్ట్రం ఏది?
1) గుజరాత్ ✅
2) ఆంధ్రప్రదేశ్
3) పశ్చిమ బెంగాల్
4) తమిళనాడు

• బ్లాక్ వ్యవస్థను రద్దు చేయడం, జిల్లా పరిషత్‌కు కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించడం, బ్యూరోక్రసి పాత్రను తగ్గించడం తదితర సూచనలు చేసిన కమిటీ ఏది?
1) దంత్‌వాలా కమిటీ
2) అశోక్ మెహతా కమిటీ
3) సి.హెచ్. హనుమంతరావు కమిటీ
4) జి.వి.కె. రావ్ కమిటీ✅

• ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా విద్యాహక్కును ప్రాథమిక హక్కుగా 21(ఎ) నిబంధనలో చేర్చారు?
1) 86వ రాజ్యాంగ సవరణ, 2000
2) 85వ రాజ్యాంగ సవరణ, 2002
3) 86వ రాజ్యాంగ సవరణ, 2002✅
4) 86వ రాజ్యాంగ సవరణ, 2010

• కింది వాటిలో పంచాయతీ విధి కానిది?
1) పారిశుధ్యం
2) శ్మశానాల నిర్వహణ
3) విద్యుచ్ఛక్తి✅
4) పర్యావరణ పరిరక్షణ

*🔥కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ 🔥*


• పుదుచ్చేరి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినది?
1) వి నారాయణసామి
2) వి.వైతిలింగం
3) ఎన్.రంగసామి☑️
4) పి షణ్ముగం

• అసోం కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
1) సర్బానంద సోనోవాల్
2) రంజీత్ కుమార్ దాస్
3) హిమంత బిస్వా శర్మ☑️
4) దేబబ్రత సైకియా

• నాసా కొత్తఅడ్మినిస్ట్రేటర్‌గా ప్రమాణ స్వీకారం చేసినది?
1) ఫ్లాయిడ్ మెక్విలియమ్స్
2) మైఖేల్ కాలిన్స్
3) బిల్ నెల్సన్☑️
4) జిమ్ బ్రైడ్ స్టైన్

• నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ సీఈఓగా ఎవరు నియమతులయ్యారు?
1) సందీప్ జైన్
2) ఎల్వి పవన్
3) రమేశ్ వైద్య
4) పద్మకుమార్ ఎం నాయర్☑️

• భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త సిఎండిగా నియమితులైనది?
1) అరుణ్ కుమార్ సింగ్☑️
2) డికె మెహతా
3) మనోజ్ జైన్
4) కె పద్మాకర్

• ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) జాతీయ అధ్యక్షురాలిగా నియమితులైనది?
1) భారతీ తివారీ
2) ఉజ్వలా సింఘానియా☑️
3) సుందరి అయ్యర్
4) ఆకాంక్షా రాథోడ్

• మహమ్మారి బారిన పడిన చెస్ కమ్యూనిటీకి సహాయం చేయడానికి ఏ సంస్థ ‘చెక్‌మేట్ కోవిడ్ ఇనిషియేటివ్’ ను ప్రారంభించింది?
1) ఆల్ ఇండియా స్పోర్ట్స్ ఫెడరేషన్
2) ఫిఫా
3) అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ
4) ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్☑️

• ఇటీవల ఐసిసి విడుదల చేసిన ఐసిసి వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
1) ఇంగ్లండ్
2) న్యూజిలాండ్☑️
3) భారత్
4) దక్షిణాఫ్రికా

• పురుషుల మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ 2021 విజేత?
1) అలెగ్జాండర్ జ్వెరెవ్☑️
2) మార్కోల్ గ్రానెల్లూయర్స్
3) హోరాసియో జెబ్బాల్స్
4) సెబాస్టియన్ వెటెల్

• స్పానిష్ గ్రాండ్ ప్రీ 2021 విజేత?
1) సెబాస్టియన్ వెటెల్
2) లూయిస్ హామిల్టన్☑️
3) హెన్రీ పోలో
4) వోటారి వోటాలు

Close